ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒంగోలు ఘటనలో విస్తుపోయే నిజాలు, పెళ్లి పేరుతో నాటకం, రక్షణ ఇవ్వమని కోరి అడ్డంగా బుక్కయ్యారు..

|
Google Oneindia TeluguNews

ఒంగోలులో జరిగిన పైశాచిక చర్యలు విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. సాయి రమేశ్ రెడ్డి అలియాస్ సుమలత లీలల్లో జరిగిన దురాగతాలు బయటకొస్తున్నాయి. తన భర్త, స్నేహితుడితో కలిసి సుమలత చేసిన బండారం ఎలా బయటపడింది ? ఇందులో ఆమె స్వయంకృతపరాధం ఉందా ? ఇంతకీ శుక్రవారం ఏం జరిగింది. పోలీసులు ఏంటున్నారు. వన్ ఇండియా ప్రత్యేక కథనం.

మూడో భర్తతో కలిసి మకాం..

మూడో భర్తతో కలిసి మకాం..

సుమలత తన భర్తతో కలిసి ఒంగోలు మారుతినగర్‌లో ఉంటుంది. వీరితో సిమ్ కార్డులు విక్రయించే వంశీ కృష్ణ చేయి కలిపాడు. ఇంకేముంది వీరి ఆగడాలకు అడ్డేలేకుండా పోయింది. అమ్మాయిలను ట్రాప్ చేయడం, లైంగికంగా వేధించడమే పనిపెట్టుకున్నారు. సదరు మైనర్లపై సుమలత సెక్స్ టాయ్స్‌ పైశాచిక ఆనందం పొందుతుంటే వారిద్దరూ వెకిలి నవ్వేవారట. తర్వాత సుమలత భర్త ఏడుకొండలు, వంశీ ఇద్దరూ కలిసి బాలికలపై లైంగికదాడి చేసేవారని ఒంగోలు డీఎస్పీ బీ రవి మీడియాకు తెలిపారు.

 స్రీ రూప రాక్షసి..

స్రీ రూప రాక్షసి..

సుమలత.. పేరుకు మహిళ, కానీ రూపం, గొంతు అన్నీ పురుష లక్షణాలే. ఇంకేముంది తనను మేల్‌గా మలచుకొనేందుకు చిన్నగా కటింగ్ చేసుకుంది. ఏడుకొండల కంటే ముందు ఇద్దరినీ పెళ్లిచేసుకొని విడాకులు తీసుకుంది.. ముచ్చటగా మూడోసారి 2016లో 47 ఏళ్ల ఏడుకొండలు అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వీరికి సిమ్ కార్డులు విక్రయించే 28 ఏళ్ల వంశీ తోడయ్యారు. ఈ ముగ్గురు తోడు దొంగలు పట్టణం మీద పడి అరాచకాలు సృష్టించారు.

అరాచకానికి కేరాఫ్

అరాచకానికి కేరాఫ్

సుమలత, ఏడుకొండలు, వంశీల అరాచక పర్వం కొనసాగుతుంది. అయితే శుక్రవారం ఓ 17 ఏళ్ల మైనర్ బాలికను సుమలత ట్రాప్ చేసింది. ఆమెను నమ్మి గదిలోకి వచ్చింది. దాదాపు రెండురోజులపాటు ఆమెకు నరకం చూపించారు. ఆమె వెళ్లిపోతే మరొకరు దొరకుతారో లేదోననుకొన్న సుమలత ఇందుకోసం ఓ ప్రణాళిక కూడా రచించింది. దానిని అమలుల్లో పెట్టడంతో తేడా కొట్టింది.

పెళ్లి డ్రామా పేరుతో..

పెళ్లి డ్రామా పేరుతో..

మైనర్ బాలికను వంశీకిచ్చి పెళ్లి డ్రామా ప్రారంభించింది. వారికి పెళ్లైందని.. తల్లిదండ్రుల నుంచి రక్షణ కావాలని వారంతటా వారే పోలీసులను ఆశ్రయించారు. అయితే బాలికకు 17 ఏళ్లు.. మైనర్ అని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె తల్లిదండ్రులను పిలిపిస్తే.. తనకు జరిగిన అన్యాయాన్ని బాలిక పోలీసులకు వివరించింది. దీంతో నిర్ఘాంతపోవడం పోలీసుల వంతయిపోయింది. సుమలత ఇంట్లో ఇంత తతాంగం నడిపించారా అని ముక్కున వేలేసుకున్నారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

వామ్మో.. టాయ్స్..

వామ్మో.. టాయ్స్..

సుమలత ఇంటికి వచ్చి తనిఖీ చేపట్టారు. అయితే అక్కడ భారీగా టాయ్స్ లభించడంతో సుమలత అరాచకాల ప్రపంచానికి తెలిసిపోయాయి. ఇంట్లో ప్రవేశించి పోలీసులు విచారించడంతో.. భయపడ్డ ఏడుకొండలు మూడో అంతస్తు నుంచి దూకాడు. అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఏడుకొండలు మృతిచెందాడని పోలీసులు తెలిపారు. సుమలత, వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే సుమతల, సాయి రమేశ్ రెడ్డి వేర్వేరు అని మైనర్ బాలిక ఇప్పటికీ నమ్మడం విశేషం.

English summary
minor girl filed a sexual abuse complaint in Prakasam district of AP against a 32-year-old man named Sai Ramesh Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X