అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2024లో ఏపీలో అధికారమే లక్ష్యంగా: అమరావతిపై సీఎంకు వార్నింగ్: బీజేపీ..జనసేన మధ్య బేషరతుగా..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Janasena Party And BJP Confirms Alliance | Pawan Kalyan | Amit Shah | Narendra Modi

ఏపీలో బీజేపీ..జనసేన మధ్య అధికారిక పొత్తు కుదిరింది. స్థానిక సంస్థల మొదలు 2024 సార్వత్రిక ఎన్నికల వరకు కలిసి సాగాలని..ఆ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల కూటమి అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా పని చేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ..వైసీపీతో తెర ముందు..తెర వెనుక పొత్తులు..సంబంధాలు ఉండవని బీజేపీ తేల్చి చెప్పింది. రెండు పార్టీలు బేషరతు గా పొత్తు కుదుర్చుకున్నాయని రెండు పార్టీలకు చెందిన నేతలు ప్రకటించారు.

ఇక, అమరావతి విషయంలో ముఖ్యమంత్రి తీరును రెండు పార్టీల నేతలు తప్పు బట్టారు. ముఖ్యమంత్రి నియంతలా నిర్ణయం తీసు కుంటే అది తుది నిర్ణయం కాదని తేల్చి చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని..అమరావతి నుండే రాజధాని కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రత్యేక హోదా గురించి వైసీపీ..టీడీపీని అడగాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రతీ అంశంలోనూ కలిసి పోరాటం..పోటీ చేస్తామని రెండు పార్టీల నేతలు ప్రకటించారు.

2024 అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తాం..

2024 అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తాం..

2014 ఎన్నికల తరువాత కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా దూరమయ్యామని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఏపీ ప్రయోజనాల కోసం బీజేపీతో కలిసి పని చేయాలని నిర్ణయించామని స్పష్టం చేసారు. ఏపీలో కొనసాగుతన్న పాలే గాళ్ల రాజ్యాన్ని సాగనంపి..అవినీతి రహిత..కుల రహిత పాలన అందించేందుకు బీజేపీతో కలిసి పని చేస్తామని పవన్ ప్రకటించారు. ప్రతీ అంశంలో కలిసి పని చేస్తామన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల నుండి సార్వత్రిక ఎన్నికల వరకు కలిసి పని చేస్తామని పవన్ తేల్చి చెప్పారు. ఏపీలో నెలకొన్న పరిస్థితుల పైన ప్రతీ అంశం మీద క్షుణ్నంగా చర్చించామని..సమిష్టిగా అడుగులు వేస్తామన్నారు. కేంద్రం లో బలంగా ఉన్న బీజేపీ తో కలిస్తేనే ఏపీలో డెవలప్ మెంట్ సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు. 2024లో జనసేన..బీజేపీ కూటమి అధికారంలోకి రావటమే లక్ష్యంగా పని చేస్తామని ప్రకటించారు. మోదీ..అమిత షా నమ్మకాన్ని నిలబెడతామని ధీమా వ్యక్తం చేసారు.

జగన్ అనుకుంటే రాజధాని మారిపోదు..

ముఖ్యమంత్రి జగన్ అనుకున్నంత మాత్రాన రాజధానులు మారిపోవని..ప్రభుత్వం నిరంతర ప్రక్రియని వ్యాఖ్యానించారు. తాను రాజధానికి అంత భూమిని తీసుకోవటాన్ని నాడే అభ్యంతరం వ్యక్తం చేసానని.. కానీ, ప్రతిపక్ష నేతగా జగన్ నాడు స్వాగతించారని చెప్పుకొచ్చారు.

అమరావతి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసారు. తాము అధికార వికేంద్రీకరణ కోరుకోవటం లేదని.. అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటున్నామని స్పష్టం చేసారు. అమారావతి కోసం అవసరమైతే వీధుల్లోకి వస్తామని స్పష్టం చేసారు. న్యాయపరంగా ముందకెళ్తామన్నారు. తెగించే నాయకత్వం ఉందని జగన్ గుర్తించాలన్నారు. ఇక, హోదా అంశం పైన తాను చేయగలిగింది చేసానని.. 23 మంది ఎంపీలు ఉన్న వైసీపీని.. గతంలో ప్యాకేజి తీసుకొని..ఇప్పుడు ముగ్గురు ఎంపీలున్న టీడీపీని దీని పైన ప్రశ్నించాలని సూచించారు. పౌరసత్వ బిల్లు కు మద్దతు ప్రకటించిన పవన్..ఎవరికీ అపోహలు వద్దని వివరించారు.

వామపక్షాలక నేనే బాకీ లేను..

వామపక్షాలక నేనే బాకీ లేను..

తాను వామపక్షాలకు బాకీ లేనని జనసేన అధినేత వ్యాఖ్యానించారు. బీజేపీతో కలవటం ద్వారా వామపక్షాలకు దూరం అవుతున్నారా అనే ప్రశ్నకు పవన్ ఈ రకంగా స్పందించారు. ఇక, సీఏఏ బిల్లుకు పవన్ మద్దతు ప్రకటించారు. కమ్యూనిస్టుల కంటే ముందుగానే బీజేపీకి మద్దతిచ్చానని గుర్తు చేసారు. మైనార్టీలను రక్షించేందుకు పౌర సత్వ బిల్లు అని పవన్ వివరించారు. ఈ బిల్లు పైన ఎవరికీ అపోహలు అవసరం లేదని స్పష్టం చేసారు. ముస్లిల పౌరసత్వం తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. పాకిస్థాన్ లో మైనార్టీల పైన దాడులు జరుగుతున్నాయని పవన్ వివరించారు.

జగన్ నిర్ణయిస్తే జరిగిపోతుందా..

జగన్ నిర్ణయిస్తే జరిగిపోతుందా..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం పవన్ తమతో జత కలవటాన్ని స్వాగతించారు. ఈ రెండు పార్టీల ద్వారానే ఏపీలో సామాజిక న్యాయం సాధ్యం అవుతుందని చెప్పుకొచ్చారు. ఒక్క ఛాన్స్ పేరు తో అధికారంలోకి వచ్చి అధపాతాళానికి తొక్కేసారంటూ మండిపడ్డారు. అమరావతి విషయంలో జగన్ నియంత లాగా నిర్ణయం తీసుకున్నంత మాత్రాన జరిగిపోదన్నారు. అది జగన్ భ్రమ అంటూ వ్యాఖ్యానించా రు. రాజధాని విషయంలో రాజకీయంగా అభిప్రాయాలు..స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. దీనిని వ్యతిరేకిస్తామని.. న్యాయ పరంగానూ పోరాటం చేస్తామని కన్నా స్పష్టం చేసారు. తమ పార్టీ రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉందని..అక్కడ హైకోర్టు ఏర్పాటుకు అభ్యంతరం లేదన్నారు. జగన్ అనుకున్నవి చేస్తానంటే కుదరదని తేల్చి చెప్పారు.

ముందు..వెనుకా ఎవరితోనూ పొత్తు ఉండదు

ముందు..వెనుకా ఎవరితోనూ పొత్తు ఉండదు

ఏపీలో ఇక నుండి జనసేనతో మినహా తెర ముందు..వెనుక ఎవరితోనూ పొత్తు ఉండదని బీజేపీ ఏపీ ఇన్ ఛార్జ్ సునీల్ ధేవదర్ స్పష్టం చేసారు. వైసీపీ..టీడీపీతో ఏ రమైన సంబంధాలు ఉండవన్నారు. ఇదే విషయాన్ని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ సైతం స్పష్టం చేసారు. రహస్య ఒప్పందాలు.. సంబంధాలు ఉండవన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటంలో వైసీపీ విఫలమైందని వ్యాఖ్యానించారు. 2024లో జనసేన.. బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాని సునీల్ ధేవధర్ ఆశాభావం వ్యక్తం చేసారు.

English summary
BJP and Janasena fixed target 2024 elections in AP. Both parties alliance officially declared. From local body elections to general elections both parties to go with common agenda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X