అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీలో జనసేన విలీనం ఉంటుదా? ఫిబ్రవరి 2న ముహుర్తం.. రెండు పార్టీల ముఖ్యనేతల ప్రకటన

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో వరుసగా కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యనేతలతో భేటీలు జరుపుతున్నవేళ పార్టీ విలీనంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బుధవారం ఢిల్లీలో పవన్ నిర్వహించిన రెండు ప్రెస్ మీట్లలోనూ విలేకరులు విలీనంపై ప్రశ్నలు అడిగారు. జాతీయ చానెళ్లు కూడా బీజేపీలో జనసేన విలీనం ఉంటుందా? అని ఆరాతీయడంతో పవన్ అసహనానికి లోనయ్యారు. ఉమ్మడి కార్యాచరణకు సంబంధిచి రెండు పార్టీల ముఖ్యనేతలు కీలక ప్రకటన చేశాయి.

మీరలా ఊహిస్తే నేనేం చెయ్యగలను?

మీరలా ఊహిస్తే నేనేం చెయ్యగలను?


తన ఢిల్లీ పర్యటనలో భాగంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ బుధవారం రెండు సార్లు ప్రెస్ మీట్ నిర్వహించారు. సాయంత్రం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ తర్వాత, రాత్రి బీజేపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు సందర్భాల్లోనూ విలీనంపై ప్రశ్నలు వెల్లువెత్తడంతో ఆయన కోపంగా‘‘మీరు ఏవేవో ఊహించుకుంటే నేనేం చెయ్యగలను?''అని మండిపడ్డారు. చివరికి ఆయనే ఓ క్లారిటీ ఇచ్చారు.. ‘‘బీజేపీలో జనసేన ఎన్నటికీ విలీనం కాబోదు. కలిసి పనిచేయాలని మాత్రమే మేం నిర్ణయయించుకున్నాం'' అని వివరించారు.

ఫిబ్రవరి 2న లాంగ్ మార్చ్

ఫిబ్రవరి 2న లాంగ్ మార్చ్

ఏపీలో ఇకపై ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా రెండు పార్టీలు కలిసే నిర్వహిస్తాయని బీజేపీ-జనసేన కూటమి నేతలు ప్రకటించారు. వైసీపీ సర్కారుపై ఉద్యమకార్యాచరణను వెల్లడించారు. ముందుగా, అమరావతి రైతులకు మద్దతుగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 2న విజయవాడలో లాంగ్ మార్చ్ నిర్వహించాలని రెండు పార్టీల నేతలు డిసైడయ్యారు. అమరావతి రైతులకు సంఘీభావంగా ఫిబ్రవరి 2 మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నుంచి విజయవాడలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు పవన్ నాయకత్వంలో లాంగ్ మార్చ్ ఉంటుందని సమన్వయ కమిటీ తెలిపింది.

15 రోజులకోసారి..

15 రోజులకోసారి..

సమన్వయ కమిటీ భేటీలో జనసేన తరఫున పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్, ముఖ్యనేత నాదెండ్ల మనోహర్.. బీజేపీ తరఫున పార్టీ ఏపీ శాఖ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నర్సింహారావు, మాజీ ఎంపీ పురందేశ్వరి, బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జిలు పాల్గొన్నారు. ఇకనుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి కమిటీ సమావేశమవుతుందని, ఈనెల 28న మరోసారి కలిసి లాంగ్ మార్చ్ ఏర్పాట్లపై చర్చిస్తామని రెండు పార్టీల నేతలు చెప్పారు.

అమరావతి కేంద్రంగా ఉద్యమం..

అమరావతి కేంద్రంగా ఉద్యమం..

బీజేపీ-జనసేన సమన్వయ కమిటీ అంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌తోనూ భేటీ అయింది. భేటీ తర్వాత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఏపీకి అమరావతే శాశ్వత రాజధానిగా ఉంటుందని, దాని కేంద్రంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. మూడు రాజధానుల విషయంలో వైసీపీ సర్కారుకు కేంద్రం సమ్మతి లేదనీ పవన్ తెలిపారు.

English summary
jana sena chief pawan kalyan clarifies on merging his party in bjp, said there will be no merger but both parties will work together in all issues. after bjp-janasena coordination meeting both party leaders held press meet in delhi on wednesday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X