అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రతీ అడుగు కలిసి వేద్దాం:అమరావతిని రాజధానిగా కొనసాగించాలి: బీజేపీ..జనసేన నిర్ణయం..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఇక రానున్న రోజుల్లో కలిసి నడవాలని బీజేపీ..జనసేన ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాతో సమావేశం తరువాత..ఆయన సూచనల మేరకు ఏపీ బీజేపీ నేతలతో జనసేన ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఆ సమయంలో భవిష్యత్ కార్యాచరణ పైన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రతీ అంశంలోనూ కలిసి నడవాలని నిర్ణయించారు. ప్రజా సమస్యలు..రాజకీయ అజెండా పైన రూట్ మ్యాప్ సిద్దం చేసుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చారు.

వైసీపీ..ప్రతిపక్ష టీడీపీకి సమదూరం పాటించాలని

వైసీపీ..ప్రతిపక్ష టీడీపీకి సమదూరం పాటించాలని

స్థానిక సంస్థల ఎన్నికల మొదలు ప్రత అంశంలోనూ కలిసి ముందుకు సాగాలని తీర్మానించారు. ఏపీలో అధికార వైసీపీ..ప్రతిపక్ష టీడీపీకి సమదూరం పాటించాలని నిర్ణయం తీసుకోన్నారు. ఇక, అమరావతి రాజధానిగా కొనసాగించాలని రెండు పార్టీలు ముక్తకంఠం తో డిమాండ్ చేసాయి. ఆ దిశగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు భారీ కార్యారణకు సిద్దం అవుతున్నారు. ఈ వారంలోనే రెండు పార్టీలు కలిసి కవాతు చేపట్టాలని నిర్ణయించారు.

అమరావతే రాజధానిగా కొనసాగించాలి..

అమరావతే రాజధానిగా కొనసాగించాలి..

బీజేపీ..జనసేన మధ్య అధికారికంగా పొత్తు ఖరారైంది. బిజేపీ అధినాయకత్వం సూచనల మేరకు విజయవాడలో జనసేన..బీజేపీ నేతలు సమావేశయ్యారు. దాదాపు మూడు గంటలకు పైగా సాగిన సమావేశంలో ఏ రకంగా రెండు పార్టీలు కలిసి భవిష్యత్ అడుగులు వేయాలనే దాని పైన చర్చలు జరిపారు. ప్రధానంగా తక్షణం అమరావతి అంశం పైన ఫోకస్ పెట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా..అమరావతి రాజధాని గా కొనసాగించాలని రెండు పార్టీలు ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాయి. ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతం నుండి సీడ్ కేపిటల్ తరలించటానికి వీళ్లేదని డిసైడ్ అయ్యాయి. అమరావతి రైతులకు మద్దతుగా పాదయాత్ర చేయాలని రెండు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి.

వైసీపీ..టీడీపీకి సమదూరంలో..

ఏపీలో అధికార వైసీపీ..ప్రతిపక్ష టీడీపీకి సమదూరం పాటించాలని ఈ రెండు పార్టీల ముఖ్య నేతలు నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రజా సమ్యలు..రాజకీయ అజెండా పైనా రూట్ మ్యాప్ సిద్దం చేసుకొని ముందుకు వెళ్లాలని తీర్మానించారు. స్థానిక సంస్థల ఎన్నిలు ప్రస్తుతం వాయిదా పడినా..క్షేత్ర స్థాయి నుండి ఎన్నికల నాటికి రెండు పార్టీల కేడర్ కలిసి పని చేసేలా వారిని సిద్దం చేయాలని నిర్ణయించారు. ప్రతీ ఎన్నికల్లో నూ రెండు పార్టీలకు మేలు జరిగేలా వ్యవహరించాలని నిర్ణయించాయి.

తరచూ సమావేశాలు నిర్వహించాలని

తరచూ సమావేశాలు నిర్వహించాలని

రెండు పార్టీల నుండి ఎంపిక చేసిన ప్రతినిధులతో తరచూ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి సాయం పొందటం పైనా తామే చొరవ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ పధకాల పైన ఏపీలో ప్రచారం చేయాలని..అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపైన నిరసనలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా..ఇక ఏపీలో వైసీపీ..టీడీపీ టార్గెట్ గా జనసేన..బీజేపీ కొత్త రాజకీయానికి తెర లేపింది.

English summary
BJP and Janasena unanimously decided to go with alliane in local body elections to all elections in AP. At the same time both parties passed resolution in support of Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X