వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ ఒక వ‌ర్గానికే ప్రాధాన్య‌త‌: ఆ ప‌ద‌వుల‌న్నీ రెడ్ల‌కే : కులం పేరుతో రాజ‌కీయంగా డామేజింగ్ గేమ్..

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సైతం చంద్ర‌బాబు బాట‌లోనే ప‌య‌ణిస్తున్నారు. చంద్ర‌బాబు త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన వారికే ప్రాధాన్య‌త ఇస్తున్నారంటూ వైసీపీ నేత‌లు ఎన్నిక‌ల ముందు ఆరోపించారు. ఇప్పుడు అదే ర‌క‌మైన ఆరోప‌ణ‌లు బీజేపీ ముఖ్య నేత‌ల మొద‌లు టీడీపీ నేత‌లు చేస్తున్నారు. కేబినెట్ కూర్పులో జ‌గ‌న్ అమ‌లు చేసిన సోష‌ల్ ఇంజ‌నీరిం గ్ అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంది. ఆ త‌రువాత నామినేటెడ్ పోస్టుల్లోనూ 50 శాతం బీసీ..ఎస్సీ..ఎస్టీ..మైనార్టీల‌కు క‌ల్పి స్తూ మంత్రివ‌ర్గం ఆమోదించింది. అయితే, జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు నియ‌మించిన రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల్లో మాత్రం ఒకే వ‌ర్గానికి ప్రాధాన్య‌త త‌గ్గింది..అదే ఇప్పుడు ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌ల‌కు కార‌ణమ‌వుతోంది..

Recommended Video

అసెంబ్లీలో వింతగా ప్రవర్తిస్తున్న చంద్రబాబు - విజయ సాయి రెడ్డి
కేబినెట్ కూర్పులో ప్ర‌శంస‌లు..

కేబినెట్ కూర్పులో ప్ర‌శంస‌లు..

ఏపి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత జ‌గ‌న్ త‌న కేబినెట్ కూర్పులో అమ‌లు చేసిన సామాజిక స‌మీక‌ర‌ణా లు అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్నాయి. 60 శాతం మంత్రి ప‌ద‌వులు బీసీ..ఎస్సీ..ఎస్టీ..మైనార్టీల‌కు కేటాయించారు. అ దే విధంగా బీసీ..ఎస్సీ..ఎస్టీ..మైనార్టీల‌..కాపుల‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. దీని వ‌ర‌కూ బాగానే ఉంది. ఇదే స‌మ‌యంలో నామినేటెడ్ ప‌ద‌వుల్లోనూ 50 శాతం బీసీ..ఎస్సీ..ఎస్టీ..మైనార్టీ వ‌ర్గాల‌కు అమ‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చిన సీఎం జ‌గ‌న్ ఇదే విష‌యం పైన కేబినెట్‌లో అధికారికంగా నిర్ణ‌యం సైతం తీసుకున్నారు. కానీ, ఇదే స‌మ‌యంలో రాష్ట్రంలో ప‌ర్య‌టించిన ముఖ్య నేత‌లు జ‌గ‌న్ పైన తీవ్ర ఆరోప‌ణ‌లు చేసారు. గ‌తంలో చంద్రబాబు త‌ర‌హాలోనే జ‌గ‌న్ సైతం ఒక సామాజిక వ‌ర్గానికే ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని ఆరోపించారు. దీనికి టీడీపీ నేత‌లు సైతం మ‌ద్ద‌తుగా ఇదే ర‌కంగా ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

ఈ పోస్టులు అన్నీ రెడ్డి వ‌ర్గానికే..

ఈ పోస్టులు అన్నీ రెడ్డి వ‌ర్గానికే..

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత ఏపీలో రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు..కీల‌క ప‌దవులు భ‌ర్తీ చేసారు. వీటిలో ఎక్కువ‌గా ఒకే సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్య‌త క‌నిపిస్తోంది. బీజేపీ నేత శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ఇదే అంశం పైన ఆరోప‌ణ చేసారు. వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌గా విజ‌య సాయిరెడ్డి...లోక్‌స‌భ ప‌క్ష నేత‌గా మిధున్ రెడ్డి..టీటీడీ ఛైర్మ‌న్‌గా సుబ్బా రెడ్డి..సీఎం సల‌హాదారుడిగా అజ‌య్ క‌ళ్లాం..కార్య‌ద‌ర్శిగా ధ‌నుంజ‌య రెడ్డి.. చీఫ్ విప్‌గా శ్రీకాంత‌రెడ్డి..విప్‌గా చెవిరెడ్డి భాస్క‌ర రెడ్డి..పిన్నెళ్లి రామ‌కృష్ణా రెడ్డి.. ఏపీఐఐసీ ఛైర్మ‌న్‌గా రోజా..టీటీడీ స్పెఫ‌లాఫీస‌ర్‌గా ధ‌ర్మారెడ్డి.. ఉన్న‌త విద్యా మండ‌లి ఛైర్మ‌న్‌గా హేమ చంద్రా రెడ్డి.. ఆంధ్ర యూనివ‌ర్సిటీ ఇంచార్జ్ వీసీగా ప్ర‌సాద రెడ్డి..ప్ర‌జా సంబంధాల స‌ల‌హా దారుడిగా సజ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి.. స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్‌గా మ‌ధు సూధ‌న‌రెడ్డి.. ఐటి స‌ల‌హాదా రులుగా దేవిరెడ్డి శ్రీనాధ‌ర‌డ్డి, జే విద్యా సాగ‌ర్ రెడ్డి, పెట్టుబ‌డుల స‌ల‌హాదారుడిగా కే రాజ శేఖ‌ర రెడ్డి..వ్య‌వ‌సాయ మిష‌న్ వైయ‌స్ ఛైర్మ‌న్‌గా నాగిరెడ్డి..ఇలా ఒకే వ‌ర్గానికి చెందిన వారికి ఈ ప‌ద‌వులు ద‌క్కిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నారు.

మంత్రి ప‌ద‌వుల్లో మాత్రం..

మంత్రి ప‌ద‌వుల్లో మాత్రం..

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితే కేబినెట్‌లో ఎక్క‌వ రెడ్డి వ‌ర్గానికి చెందిన వారికే మంత్రి ప‌ద‌వులు ద‌క్కుతాయ‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. అయితే, జ‌గ‌న్ మాత్ర ఆ వ‌ర్గానికి నాలుగు ప‌ద‌వులు మాత్ర‌మే ఇచ్చారు. బుగ్గ‌న రాజేంద్ర‌నాధ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, గౌతం రెడ్డి.. బాలినేని శ్రీనివాస రెడ్డి ల‌కు మాత్ర‌మే అవ‌కాశం ఇచ్చారు. అప్పుడు ప్ర‌శంసించి న వారే ఇప్పుడు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. గ‌తంలో చంద్ర‌బాబు గురించి స్వ‌యంగా జ‌గ‌న్ విమ‌ర్శ‌లు చేసిన సంద‌ర్బా న్ని ఇప్పుడు వీరు గుర్తు చేస్తున్నారు. బాబు త‌రహాలోనే జ‌గ‌న్ సైతం వ్య‌వ‌హ‌రిస్తే భారీగా న‌ష్ట‌పోతారంటూ హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు. అయితే, ఇత‌ర పోస్టుల్లో మాత్రం సామాజిక న్యాయం ఉంటుంద‌ని...50 శాతం పోస్టులు కేటాయిస్తార‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. వైసీపీలో తొలి రెండి రెడ్డి సామాజిక వ‌ర్గం నేత‌లు ఎక్క‌వ‌ని..పార్టీ గెలుపు కోసం క‌ష్ట‌ప‌డిన వారికి ప్రాధాన్య‌త ఇచ్చే క్ర‌మంలోనే ఈ నియామ‌కాలు జ‌రిగాయ‌ని వివ‌రణ ఇస్తున్నారు.

English summary
BJP and TDP leaders alleged CM jagan that he giving priority for one community in filling key posts. In many posts mainly YCP supporting community leaders got chance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X