వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యాల‌పై క‌న్నా ఫైర్‌: చ‌ంద్ర‌బాబు చేసిన చ‌ట్టం క‌రెక్టే: మారుతున్న బీజేపీ స్వ‌రం..

|
Google Oneindia TeluguNews

Recommended Video

సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యాల‌పై క‌న్నాఫైర్‌ || BJP AP Chief Kanna Lakhsmi Narayana Key Comments On CM Jagan

ఏపీలో క్ర‌మంగా టార్గెట్ జ‌గ‌న్‌గా రాజ‌కీయాలు మారుతున్నాయి. రెండు నెల‌ల పాల‌న‌లో జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాల పై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ప్ర‌తీ సంద‌ర్భంలోనూ విమ‌ర్శిస్తున్నారు. తాజాగా చంద్ర‌బాబు హాయంలో కాపుల‌కు ఈడబ్ల్యూఎస్ కోటాలో అయిదు శాతం రిజ‌ర్వేష‌న్ ఇవ్వ‌టం స‌రైన నిర్ణ‌య‌మ‌ని..దీనిని జ‌గ‌న్ ర‌ద్దు చేయ‌టం స‌రి కాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. బీజేపీ జాతీయ నేత‌లు చంద్ర‌బాబు లక్ష్యంగా ఆరోప‌ణ‌లు చేస్తుంటే.. ఇక్క‌డ బీజేపీ నేత‌లు నేరుగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నారు.

 కాశ్మీరీల హ‌క్కు 35ఏ: ర‌ద్దు చేస్తున్నారంటూ ప్ర‌చారం: ఈ చ‌ట్టం ఎందుకు..ఏం చెబుతోంది..! కాశ్మీరీల హ‌క్కు 35ఏ: ర‌ద్దు చేస్తున్నారంటూ ప్ర‌చారం: ఈ చ‌ట్టం ఎందుకు..ఏం చెబుతోంది..!

పోల‌వ‌రం టెండ‌ర్ల‌లో ఆత్రుత త‌ప్ప‌...

పోల‌వ‌రం టెండ‌ర్ల‌లో ఆత్రుత త‌ప్ప‌...

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కన్నా ల‌క్ష్మీనారాయ‌ణ పోల‌వ‌రం టెండ‌ర్ల విష‌యంలో తీసుకున్న నిర్ణ‌యాన్ని క‌న్నా త‌ప్పు బ‌ట్టారు. అందులో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ఉన్న ఆతృత మిన‌హా మేరేమీ క‌నిపించ‌టం లేద‌ని విమ‌ర్శించారు. ప్రాజెక్టు వ్యయం వందశాతం కేంద్రం భరిస్తున్నప్పుడు వేగంగా పని పూర్తి చేసి బిల్లులు తెచ్చుకోవాల్సింది పోయి టెండర్ల రద్దు దేనిని క‌న్నా ప్ర‌శ్నిస్తున్నారు. రివర్స్‌ టెండరింగ్‌ అంటున్నారు. ఇప్పుడున్న ధరలకంటే ఎక్కువ కోట్‌ చేస్తే ప్రజలు ఏమని అర్థం చేసుకుంటారని క‌న్నా సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. పోలవరాన్ని గత ప్రభుత్వం ఏటీఎంగా..పర్యాటక ప్రాంతంగా చూస్తే... ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిచేయకుండా మరోలా చూస్తోందని దుయ్య‌బ్టారు. బీజేపీ మాత్రం రాష్ట్రా నికి ఈ ప్రాజెక్టును గుండెకాయగా చూస్తోందని... దీనిపై రాజకీయాలను పక్కనపెట్టి అందరూ ఒక్కటిగా ఉండాలంటూ క‌న్న సూచిస్తున్నారు..

 చంద్ర‌బాబు చేసిన చట్టం స‌రైన‌దే..

చంద్ర‌బాబు చేసిన చట్టం స‌రైన‌దే..

కేంద్రం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాలకు కొంత వెసులుబాటు కల్పించిందంటున్న క‌న్నా దీని పైన జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌ది కాదంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కాపుల పరిస్థితులను దృష్టి లోపెట్టుకుని 5 రిజర్వేషన్‌ అమలుచేస్తూ చట్టంచేసిందని..అది. చట్టపరంగా అదికరెక్టే అని స‌మ‌ర్ధించారు. కానీ, జగన్‌ ప్రభుత్వం ఆ చ ట్టాన్ని రద్దుచేస్తూ జీవో ఇవ్వడం సబబు కాదని వ్యాఖ్యానించారు. అయితే, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాత్రం దీనిపైన వివ‌ర‌ణ ఇచ్చారు. చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యంతో అస‌లు కాపులు ఓసీల్లో ఉన్నారా..లేక బీసీల్లో ఉన్నారా అనే సందిగ్దత ఏర్ప‌డింద‌ని వ్యాఖ్యానించారు. కోర్టుల్లో ఉన్న కేసుల కార‌ణంగా చంద్ర‌బాబు హాయంలో తీసు కున్న నిర్ణ‌యాన్ని అమ‌లు చేయ‌లేమ‌ని స్ప‌ష్టం చేసారు. అదే స‌మ‌యంలో మంజునాధ క‌మిటీ నివేదిక అధ్య‌య‌నం కోసం ముగ్గురు స‌భ్యుల‌ను జ‌గ‌న్ నియ‌మించారు.

మోదీ-వైఎస్‌ఆర్‌ రైతు భరోసాగా పేరు మార్చాలి..

మోదీ-వైఎస్‌ఆర్‌ రైతు భరోసాగా పేరు మార్చాలి..

ఇక‌, రాష్ట్ర ప్ర‌భుత్వం వైయ‌స్సార్ రైతు భ‌రోసా పేరుతో రైతుల‌కు అందిస్తున్న ప‌ధ‌కం మీద బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ ప‌ధ‌కం కింద రూ.12,500 అందిస్తామ‌ని ప్ర‌క‌ట‌న చేసింది. అయితే, ఇందులోనే కేంద్రం అందిస్తున్న ఆరు వేలు కూడా రైతుల‌కు న‌గ‌దు అందుతోంద‌ని..దీని ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వం ఇస్తున్న‌ది రూ.6,500 మాత్ర‌మే ఇస్తోంద‌నే వాద‌న మొద‌లైంది. దీంతో..ఇప్పుడు బీజేపీ రైతులకు రూ.6 వేలు ఇవ్వాలన్న నిర్ణయం మోదీ ప్రభుత్వానిది. నేరుగా రైతు ఖాతాకే జమవుతుంది. ఒకవేళ రాష్ట్రం ఇస్తానంటున్న రూ.12,500లో కేంద్రం సొమ్ము కలిపితే మాత్రం పథకం పేరు ‘మోదీ-వైఎస్‌ఆర్‌ రైతు భరోసా'గా మార్చాల్సిందే నంటూ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ డిమాండ్ చేస్తున్నారు. మొత్త‌గా టార్గెట్ జ‌గ‌న్ నినాదంతో బీజేపీ నేత‌లు ఇప్పుడు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

English summary
BJP AP Chief Kanna Lakhsmi Narayana key comments on CM Jagan and his decisions in two months administration. Kanna supported Chandra babu decision on Kapu reservations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X