వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీతో ముప్పు: ఏ క్షణమైనా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై భౌతికదాడులు: అమిత్‌షాకు కన్నా లేఖ

|
Google Oneindia TeluguNews

గుంటూరు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితులు, దాడుల వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాంతక కరోనా వైరస్‌ను నియంత్రంచడంలో భాగంగా.. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కక్ష పెంచుకున్నారని ఆరోపిస్తోంది. ప్రభుత్వ పెద్దలే ఈ దాడులకు ప్రోత్సహిస్తుర్నారని విమర్శిస్తోంది.

ఏ క్షణమైనా భౌతిక దాడులకు అవకాశం..

ఇలాంటి పరిణామాల మధ్య వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల నుంచి రమేష్ కుమార్‌కు ముప్పు పొంచి ఉందని, ఆయనపై ఏ క్షణమైనా భౌతిక దాడులు జరిగే ప్రమాదం ఉందని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. వెంటనే రమేష్‌కుమార్‌కు సీఆర్పీఎఫ్‌ భద్రత కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను ఈ లేఖలో వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారనే అక్కసుతో అధికార పార్టీ అరాచకాలను సృష్టిస్లోందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.

BJP AP President Kanna Lakshminarayana writes to Amit Shah

అత్యున్నత స్థాయి అధికారికి కులాన్ని అపాదించారంటూ..

Recommended Video

Kanna Lakshmi Narayana Comments On AP CM YS Jagan

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాయి వ్యక్తి ఇప్పటికే రమేష్ కుమార్‌కు కులాన్ని అంటగట్టారని పేర్కొన్నారు. అత్యున్నత స్థాయి అధికారికి కులాన్ని అపాదించడం సరికాదని అన్నారు. 1856లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆరంభమైనప్పటి నుంచి ఇలాంటి భయానక పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడూ ఏర్పడలేదని చెప్పారు. వైఎస్ఆర్సీపీ నాయకులే స్వయంగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు చేయించారని ఆరోపించారు. ఇదే పరిస్థితి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కూ ఏర్పడిందని చెప్పారు. ముందుజాగ్రత్త చర్యగా ఆయనకు సీఆర్పీఎఫ్ భద్రత కల్పించాలని కోరారు.

English summary
Bharatiya Janata Party President Kanna Lakshminarayana writes a letter to Union Home Minister Amit Shah. He urged to Amit Shah that need a protection of CRPH to the State Election Commissioner Nimmagadda Ramesh Kumar due to verbal attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X