వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అది మా ప‌థ‌కం: ఎందుకు అమ‌లు చేయ‌రు?: సీఎంకు క‌న్నా బ‌హిరంగ లేఖ‌

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి: భార‌తీయ జ‌న‌తాపార్టీ మాంఛి ఊపు మీద క‌నిపిస్తోంది. తెలుగుదేశం పార్టీని ఖాళీ చేసే ప‌నిలో ప‌డ్డ బీజేపీ.. దానికి ప్ర‌త్యామ్నాయంగా ఎదిగే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇది ఎంత వ‌ర‌కు విజ‌య‌వంతం అవుతుందో తెలియ‌ట్లేదు గానీ.. రాష్ట్రంలో పుంజుకోవ‌డానికి అన్ని విధాలుగా త‌న‌వంతు కృషి చేస్తోంది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చిన బీజేపీ.. త‌న స్వ‌రాన్ని పెంచింది. ఆరోప‌ణ‌లకు ప‌దును పెడుతోంది.

బీజేపీ పాల‌న‌లో ఉండ‌టం కంటే చంద్ర‌మండ‌ల‌మే బెట‌ర్: టికెట్ కొనివ్వండి.. అక్క‌డికే వెళ్లిపోతా!బీజేపీ పాల‌న‌లో ఉండ‌టం కంటే చంద్ర‌మండ‌ల‌మే బెట‌ర్: టికెట్ కొనివ్వండి.. అక్క‌డికే వెళ్లిపోతా!

తాజాగా- బ‌హిరంగ లేఖ‌ల‌ను సంధించ‌డం ఆరంభించింది. కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు ప్ర‌వేశ‌పెట్టిన ఆర్థికంగా బ‌ల‌హీన వ‌ర్గాల (ఈడ‌బ్ల్యూఎస్‌) రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వాన్ని విమ‌ర్శిస్తోంది. ఈ ప‌థ‌కాన్ని రాష్ట్రంలో ఎందుకు అమ‌లు చేయ‌ట్లేద‌ని నిల‌దీస్తోంది. ఈ మేర‌కు బీజేపీ రాష్ట్ర‌శాఖ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ శుక్ర‌వారం వైఎస్ జ‌గ‌న్‌కు బ‌హిరంగ లేఖ రాశారు. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై బీజేపీ లేఖాస్త్రాల‌ను సంధించ‌డం ఇదే తొలిసారి.

BJP AP State President Kanna Lakshmi Narayana wrote a open letter to CM YS Jagan Mohan Reddy

ఆర్థికంగా బ‌ల‌హీన వ‌ర్గాల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను కల్పించాడానికి కేంద్రంలో అధికారంలో త‌మ ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని రూపొందించింద‌ని, అదొక చారిత్రాత్మ‌కమైన నిర్ణ‌య‌మ‌ని అన్నారు. ఈ ప‌థ‌కాన్ని రాష్ట్రంలో ఎందుకు అమ‌లు చేయ‌ట్లేద‌ని ఆయ‌న వైఎస్ జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించారు. ఆ ప‌థ‌కం త‌మ పార్టీ రూపొందించింద‌ని, దీని అమ‌లుపై ప్ర‌శ్నించే హ‌క్కు ఉంద‌ని అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ చొరవతో అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్ యువతకు వరంగా మారింద‌ని అన్నారు.

BJP AP State President Kanna Lakshmi Narayana wrote a open letter to CM YS Jagan Mohan Reddy

రాష్ట్రంలో ఇప్పటికీ ఈ ప‌థ‌కం అమ‌లుకు నోచుకోక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఆయ‌న ఈ లేఖ‌లో పేర్కొన్నారు. ఫ‌లితంగా- యువ‌త యువత నిరాశకు లోన‌వుతున్నార‌ని చెప్పారు. విద్య‌, ఉపాధి రంగాల్లో అవకాశాలు కోల్పోతున్నారు. దీనిపై వెంట‌నే స్పందించాల‌ని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ డిమాండ్ చేశారు. ఆర్థిక బ‌ల‌హీన వ‌ర్గాల కోసం ఉద్దేశించిన ఈ రిజర్వేషన్ల ప‌థ‌కాన్ని వెంట‌నే అమలు చేయాలని అన్నారు.

English summary
Bharatiya Janata Party (BJP) Andhra Pradesh State President Kanna Lakshmi Narayana has wrote a open letter to Chief Minister of AP YS Jagan Mohan Reddy. He mentioned in that letter that, 10% reservation for Economically weaker section in Upper cast why not implement in the State. He demand that to Chief Minister, immediately implement the 10% reservation to EWS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X