తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైకోర్టుకు చేరిన తిరుపతి ఉపఎన్నిక- రద్దు కోరిన రత్నప్రభ-తీర్పుపై ఉత్కంఠ

|
Google Oneindia TeluguNews

హోరాహోరీగా సాగిన తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో విపక్ష టీడీపీ, బీజేపీ తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయి. పోలింగ్ రోజు స్వయంగా నకిలీ ఓటర్లను పట్టుకున్న ఆయా పార్టీలు.. వారిని పోలీసులకు అప్పగించినా చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో బీజేపీ అభ్యర్ది రత్నప్రభ హైకోర్టును ఆశ్రయించారు. తిరుపతి ఉపఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై త్వరలో విచారణ జరగనుంది. దీంతో కొత్త ఉత్కంఠ మొదలైంది.

తిరుపతిలో నకిలీ ఓట్ల వివాదం

తిరుపతిలో నకిలీ ఓట్ల వివాదం

ప్రతిష్టాత్మకంగా మారిన తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో పోలింగ్‌ శాతం పెరిగితే తప్ప అధికార పార్టీ అభ్యర్ధి గురుమూర్తికి మెజారిటీ రాదని గుర్తించిన వైసీపీ నేతలు భారీ ఎత్తున నకిలీ ఓటర్లను పోలింగ్‌ బూత్‌లకు తరలించారు. పలుచోట్ల ఇలాంటి నకిలీ ఓటర్లను గుర్తించి టీడీపీ, బీజేపీ అభ్యర్దులు పనబాక లక్ష్మి, రత్నప్రభ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరిని నేరుగా పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసులు మాత్రం ప్రతిగా టీడీపీ, బీజేపీ నేతలపైనే కేసులు నమోదు చేశారు. గతంలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఇంత నేరుగా నకిలీ ఓట్లు వేసిన దాఖలాలు లేకపోవడంతో ఇరు పార్టీలు పోరాటానికి సిద్దమయ్యాయి. ఉపఎన్నిక రద్దు చేయాలంటూ ఈసీకి లేఖలు కూడా రాశాయి.

హైకోర్టులో బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ పిటిషన్‌

హైకోర్టులో బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ పిటిషన్‌


భారీగా నకిలీ ఓట్లు పోలైన తిరుపతి ఉపఎన్నిక రద్దు చేయాలని కోరుతూ బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు.
ఈ మేరకు ఆమె పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టులో త్వరలో విచారించబోతోంది. తన పిటిషన్‌లో రత్నప్రభ పలు అంశాలను హైకోర్టు దృష్టికి తెచ్చారు. తిరుపతి ఉపఎన్నిక జరిగిన విధానం, దొంగ ఓట్లు వేసుకున్న తీరు, వారిలో కొందరిని తాను పట్టుకోవడం వంటి అంశాలను రత్నప్రభ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో హైకోర్టు ఈ వ్యవహారంలో ఏం చేయబోతోందన్న ఉత్కంఠ మొదలైంది.

 రత్నప్రభ పిటిషన్‌లో అంశాలివే

రత్నప్రభ పిటిషన్‌లో అంశాలివే


హైకోర్టులో రత్నప్రభ దాఖలు చేసిన పిటిషన్‌లో తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న పలు ఘటనలను ప్రస్తావించారు. ఇందులో తిరుపతి పోలింగ్‌ సందర్భంగా ఓటేసేందుకు భారీ ఎత్తున నకిలీ ఓటర్లు వచ్చారని, వారంతా తమ పేరు, తల్లితండ్రుల పేర్లు కూడా చెప్పలేకపోయారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం, పోలీసులు చెక్‌పోస్టులు, బారికేడ్లను తొలగించి మరీ తిరుపతిలో నకిలీ ఓటర్లను బస్సుల్లో వచ్చేందుకు సహకరించారని పేర్కొన్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కానీ, ప్రధాన ఎన్నికల అధికారి కానీ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని తెలిపారు. అందుకే హైకోర్టును ఆశ్రయించినట్లు రత్నప్రభ పేర్కొన్నారు.

 హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ


తిరుపతి ఉపఎన్నికలో అధికార వైసీపీ భారీ ఎత్తున నకిలీ ఓటర్లను తరలించి దొంగ ఓట్లు వేయించుకుందని ప్రధాన పార్టీలైన టీడీపీ, బీజేపీ ఇద్దరూ ఆరోపిస్తున్నారు. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్ధులు సైతం ఇదే వాదన వినిపిస్తున్నారు. పోలింగ్‌ రోజే టీడీపీ, బీజేపీ నేతలు పలువురు దొంగ ఓటర్లను పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఉపఎన్నికలో కొన్ని చోట్ల అయినా రీపోలింగ్‌ పెడతారని భావించినా ఎన్నికల అధికారులు మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు ఈ కేసులో వైసీపీ మినహా మిగతా పార్టీలు వాదిస్తున్న దొంగ ఓట్ల వ్యవహారాన్ని హైకోర్టు సీరియస్‌గా తీసుకుంటే మాత్రం చర్యలు తప్పవు. దీంతో హైకోర్టు ఇచ్చే ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కౌంటింగ్‌కు చాలా సమయం ఉన్నందున హైకోర్టు నిర్ణయం కీలకంగా మారింది.

English summary
tirupti byelection bjp candidate ratnaprabha filed a petition in andhra praedesh high court to cancel the polling in wake of fake votes polled in huge number.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X