• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీ బీజేపీలో సమూల మార్పులు- ఒకరికి ఒకే పదవి- ఢిల్లీలో ఫైనల్‌ చేయనున్న నడ్డా..

|

దశాబ్దాలుగా ఏపీలో ఎదుగూ బొదుగూ లేకుండా సాగిపోతున్న బీజేపీకి జవసత్వాలు నింపే లక్ష్యంతో అధిష్టానం తాజాగా పలు మార్పులకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే యాక్టివ్ గా ఉన్న పలు నేతలకు అవకాశాలు కల్పిస్తూ 2024 నాటికి రాష్ట్రంలో బలమైన పార్టీగా మార్చేందుకు వీలుగా రాష్ట్ర కమిటీ ఎంపికకు సిద్ధమైంది. కమిటీ ఎంపికలో పనితీరుతో పాటు జిల్లాల వారీగా అవకాశాలకు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆశావహుల జాబితాలో ఢిల్లీ చేరుకున్నారు. ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సమావేశంలో తుది జాబితా ఖరారు చేస్తారు.

 ఏపీ బీజేపీలో కొత్త శకం..

ఏపీ బీజేపీలో కొత్త శకం..

ఏపీలో 2024 ఎన్నికలే లక్ష్యంగా పలు మార్పులు చేస్తున్న బీజేపీ అధిష్టానం.. ఇప్పుడు రాష్ట్ర కమిటీ ఏర్పాటుకు సిద్దమైంది. ఇందులో పలు కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం పనిచేస్తున్న నేతలను ఇప్పటికే గుర్తించిన అధిష్టానం వారి సేవలను ఎలా వినియోగించుకోవాలనే విషయంలో ఓ క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో టీడీపీకి తోక పార్టీగా వచ్చిన చెడ్డపేరును పోగొట్టుకునేలా స్వేచ్ఛగా పనిచేసే అవకాశం కల్పించాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి రాష్ట్ర కమిటీ ఎంపిక ఆసక్తికరంగా మారింది.

ఈసారి 25 మందికే ఛాన్స్‌...

ఈసారి 25 మందికే ఛాన్స్‌...

గతంలో బీజేపీ రాష్ట్ర కమిటీ ఎంపిక ఓ ప్రహసనంలా సాగేది. జంబో కార్యవర్గం ఏర్పాటు చేసి అందరినీ సంతృప్తిపరచాలని భావించే వారు. కానీ ఇప్పుడు పరిస్ధితి మారింది. పార్టీలోకి చేరికలు పెరిగాయి. నేతల పనితీరులోనూ మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీతో తెగదెంపులు చేసుకున్నాక నేతల్లో పలు అంశాలపై క్లారిటీ వచ్చేసింది. నేతలపై అధిష్టానంలోనూ క్లారిటీ కనిపిస్తోంది. దీంతో ఈసారి 25 మందితోనే రాష్ట్ర కమిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారీ కమిటీల వల్ల ప్రయోజనం లేదని, అన్నివర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ పరిమితంగానే ఉంటే మంచిదన్న అధిష్టానం సూచనతో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

పార్లమెంటు స్ధానానికో పదవి...

పార్లమెంటు స్ధానానికో పదవి...

ఈసారి రాష్ట్ర కమిటీ ఎంపికలో ఏపీలోని 13 జిల్లాలకూ దాదాపుగా ప్రాతినిధ్యం ఉండేలా మార్పులు చేస్తున్నారు. ప్రతీ జిల్లాలోని ప్రతీ పార్లమెంటు స్ధానానికి కనీసం ఓ కార్యదర్శి లేదా ఉపాధ్యక్ష పదవి దక్కబోతోంది. ఇందులో ఇప్పటికే ఆశావహులుగా ఉన్న వారి జాబితా సిద్ధమైంది. వీరిలో పలువురు నేతలు గతంలో కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు లేదా ప్రజాప్రతినిధులుగా పనిచేసిన అనుభవం ఉన్నవారే ఉంటారని కూడా తెలుస్తోంది. దీంతో అన్ని జిల్లాలకూ దాదాపు సమాన ప్రాతినిధ్యం దక్కేలా కొత్త కమిటీ ఏర్పాటు కాబోతోంది.

గత కమిటీలో ఉన్న సీనియర్లందరికీ మరోసారి ఛాన్స్‌ దక్కవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో యువ నేతల పేర్లూ తెరపైకి వస్తున్నాయి.

  AP 3 Capitals పై High Court స్టేటస్ కో మళ్లీ పొడిగింపు- ఏపీ వికేంద్రీకరణ! || Oneindia Telugu
  ఆశావహులు వీరే...

  ఆశావహులు వీరే...

  ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కమిటీలో సీనియర్లతో పాటు యువనేతలకూ ఈసారి ప్రాతినిధ్యం దక్కబోతోంది. తాజాగా బీజేపీతో జరుగుతున్న మార్పులతో చాలా మంది యువనేతలు యాక్టివ్‌ అయ్యారు. వీరందరికీ దాదాపుగా అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. వీరిలో నెహ్రూ యువకేంద్రం వైస్‌ ఛైర్మన్‌గా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి, యువమోర్చా నేత నాగోతు రమేష్‌ నాయుడు, రావెల కిషోర్‌ బాబు, మధుకర్, తురగా నాగభూషణం, తిరుపతిరావుతో పాటు గత ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు నేతలకు కూడా అవకాశం దక్కబోతోంది. ఇందులో సామాజిక సమీకరణాలు కూడా కీలకం కానున్నాయి. ఈ మేరకు జాబితాను రెడీ చేసిన సోము వీర్రాజు ఇప్పటికే ఢిల్లీలో కిషన్‌రెడ్డి, గడ్కరీతో సంప్రదింపులు పూర్తి చేశారు. ఇవాళ నడ్డా సమక్షంలో ఈ జాబితా ఫైనల్‌ కానుంది.

  English summary
  bjp chief jp nadda to finalise andhra pradesh state committee today with key changes. state unit president somu veerraju has arrived in delhi to discuss on final list.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X