వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కల్యాణ్ జోలికొస్తే ఖబర్దార్: సీపీఐ నారాయణకు బీజేపీ సోము వీర్రాజు వార్నింగ్

|
Google Oneindia TeluguNews

విమర్శించడానికి అంశాలేవీ దొరకనట్లు ఇతర పార్టీల నేతలు.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తుండటం, పవన్ మూడు పెళ్లిళ్ల విషయాన్ని పదే పదే ప్రస్తావింస్తుండంపై జనసేన రాజకీయ మిత్రులైన బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇటీవల మరోసారి పవన్ మూడు పెళ్లిళ్ల అంశాన్ని ప్రస్తావించడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన మౌనం వహించినప్పటికీ, బీజేపీ మాత్రం సీపీఐ నేతకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. గురువారం మీడియాతో మాట్లాడిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.

మీకు బైక్,కారు ఉందా?వాహన చట్టంలో నేటి నుంచే కీలక మార్పులు - ఇక కరోనాకూ హెల్త్ ఇన్సురెన్స్మీకు బైక్,కారు ఉందా?వాహన చట్టంలో నేటి నుంచే కీలక మార్పులు - ఇక కరోనాకూ హెల్త్ ఇన్సురెన్స్

అసలు నారాయణ ఏమన్నారంటే..

అసలు నారాయణ ఏమన్నారంటే..

కేంద్ర తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా మంగళవారం విశాఖపట్నంలో లెఫ్ట్ పార్టీలు నిర్వహించిన నిరసనలో సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ ఒకేతానులో ముక్కల్లా వ్యవహరిస్తున్నాయని, కేసుల భయంతో ఎక్కడ జైలుకు పంపుతారనే ఒత్తిడిలోనే జగన్, చంద్రబాబులు ప్రధాని మోదీకి గులాములయ్యారని, పవన్ కల్యాణ్ సైతం ప్రధాని కాళ్లపై పడ్డారని నారాయణ విమర్శించారు. అంతటితో ఆగకుండా, పవన్ ఇటీవల దీక్షలు, మాసికాలు చేస్తుండటాన్ని తప్పు పడుతూ.. ‘‘మాసికాలు ఎవరు చేస్తారండి? పెళ్లికానివాళ్లు, సన్యాసులు చేస్తారు. పవన్ కల్యాణ్ మాత్రం మూడు పెళ్లిళ్లు చేసుకుని మాసికాలు చేస్తున్నాడు. గత ఎన్నికల్లో బుద్ధితక్కువై కమ్యూనిస్టు పార్టీలు జనసేనతో పొత్తుపెట్టుకున్నాయి. అందుకు ఎంతగానో చింతిస్తున్నాం'' అని సీపీఐ నేత వ్యాఖ్యానించారు.

ఏడాదికి 10మందిని గర్భవతులు చేస్తూ - ఇప్పటికే 150 మంది పిల్లలు - లాక్‌డౌన్‌లోనూ నేరుగా సెక్స్ఏడాదికి 10మందిని గర్భవతులు చేస్తూ - ఇప్పటికే 150 మంది పిల్లలు - లాక్‌డౌన్‌లోనూ నేరుగా సెక్స్

పవన్ జోలికొస్తే ఊరుకోం..

పవన్ జోలికొస్తే ఊరుకోం..

పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయాలపై మాట్లాడే నైతిక హక్కు నారాయణకు లేదని, గత ఎన్నికల్లో పవన్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు మీరు మీ యొక్క జ్ఞాపకశక్తిని కోల్పోయారా? అని వీర్రాజు మండిపడ్డారు. బాబ్రీ మసీదు కేసులో అద్వానీని నిర్దోషిగా విడుదల చేయడంపైనా నారాయణ అవాకులు చెవాకులు పేలడం తగదని హెచ్చరించారు. కాగా, 1992, డిసెంబర్ 6నాటి కరసేవకుల ఛలో అయోధ్యకు సంబంధించి వీర్రాజు పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. అవేంటంటే..

Recommended Video

Andhra Pradesh లో బలపడుతున్న మూడో ప్రత్యామ్నాయ వర్గం | Somu Veerraju | Pawan Kalyan
తూ.గో నుంచి 860 మంది..

తూ.గో నుంచి 860 మంది..


‘‘రామ మందిరం ఉద్యమంలో భాగంగా, 1992, డిసెంబర 6న అయోధ్యలో జరిగిన కార్యక్రమానికి ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా నుంచే 860 మంది కరసేవకులు వెళ్లారు. నాటి కార్యక్రమలో ఆంధ్రప్రదేశ్ నేతల్ని సైతం నాయకత్వం వహించమన్నారు. అక్కడ మట్టిని తీసుకోవడం తప్ప మరే ఇతర కార్యక్రమానికి పెద్దల మద్దతు లేదు. అయినాసరే, అద్వానీ, జోషి లాంటి నేతలపై కేసులు పెట్టి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వేదనకు గురిచేసింది. బాబ్రీ మసీదు కేసులో తాజా తీర్పు నాకు చాలా సంతోషం కలిగించింది. దీనిపై సీపీఐ నారాయణ లాంటి వ్యక్తులు మాటలు అర్ధరహితంగా అనిపిస్తున్నాయి'' అని సోము వీర్రాజు తెలిపారు.

English summary
AP BJP chief Somu Veerraju has blamed CPI national secretary Narayana for criticizing Janasena chief Pawan Kalyan. Veerraju was angry that Narayana did not have the moral right to speak on Pawan Kalyan's personal matters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X