వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోవాలో ఆ దమ్ముందా?: బీజేపీకి పవన్ ఐదు ప్రశ్నలు, రోజుకొకటి..

|
Google Oneindia TeluguNews

విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ ద్వారా బీజేపీని నిలదీశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ - టీడీపీ కూటమికి మద్దతు పలికిన పవన్.. పలు సమస్యల పైన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను నిలదీస్తున్నారు.

'కేంద్రం దులిపేసుకుంది, బాబు ఏంచేస్తారు: దేశం, ఏపీ సర్వనాశనం'కేంద్రం దులిపేసుకుంది, బాబు ఏంచేస్తారు: దేశం, ఏపీ సర్వనాశనం

తాజాగా, ఆయన వరుస ట్వీట్లు చేశారు. 2014లో ఎన్నికల్లో జనసేన పార్టీ టిడిపి - బిజెపి కూటమికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో మద్దతు పలికిందని పేర్కొన్నారు. కర్నాటకలో బీజేపీకి మద్దతు పలికినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రానికి పవన్ ఐదు ప్రశ్నలు వేశారు.

1. గోవధ, 2. రోహిత్ వేముల ఆత్మహత్య, 3. దేశభక్తి, 4. నోట్ల రద్దు, 5. ఏపీకి ప్రత్యేక హోదా పైన ఆయన ట్విట్టర్లో ప్రశ్నలు కురిపించారు.

ఈ పై ఐదు అంశాలు చాలా కీలకమైనవని చెప్పారు. తాను పలువురు మేథావులు, సీనియర్ రాజకీయ నాయకులు, జర్నలిస్టులు తదితరుల నుంచి లోతుగా వీటి గురించి అడిగానని, తాను బీజేపీకి ఓటు వేసిన వారి నుంచి అడిగానని చెప్పారు.

గోవధపై నిలదీత

బీజేపీ అధికారంలో ఉన్న గోవాలో దమ్ముంటే గోవధను నిషేధించాలని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. బీజేపీ నేతలు లెదర్ బూట్లు, లెదర్ షూలు వేసుకోవద్దని సవాల్ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో గోవధను ఎందుకు నిషేధించలేదో చెప్పాలని నిలదీశారు. విభజన రాజకీయాలు సరికాదని అభిప్రాయపడ్డారు.

'ప్రపంచంలో చేయలేని పనులు, జగన్ సీఎం కాలేరు, రాజారెడ్డి నుంచి ఇదే''ప్రపంచంలో చేయలేని పనులు, జగన్ సీఎం కాలేరు, రాజారెడ్డి నుంచి ఇదే'

తమ పార్టీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు లెదర్ బూట్లు, లెదర్ షూలు వేసుకోవద్దని బీజేపీ ఆదేశాలు జారీ చేయగలదా అని ప్రశ్నించారు. గో రక్షణ కోసం తాను ఓ సూచన చేశానని, ప్రతి బీజేపీ కార్యకర్త ఓ గోవును దత్తత తీసుకోవాలని చెప్పానని అన్నారు.

అప్పుడే గోవధ పైన సీరియస్ నెస్ కనిపిస్తుందన్నారు. కాగా, ఈ రోజు గోవధ పైన మాట్లాడిన పవ్న రేపు వేముల రోహిత్ ఇష్యూ పైన మాట్లాడుతానని ట్వీట్ చేశారు. మిగతా మూడు అంశాల పైన రోజుకొకటి చొప్పున మాట్లాడనున్నారు.

English summary
BJP could have implemented beef ban in Goa, Pawan Kalyan tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X