వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ దారిలోనే టిడిపికి చెక్: అసెంబ్లీలో బిజెపి విపక్ష పాత్ర

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో బిజెపి విపక్షంగా వ్యవహరించనుంది. ఏపీ ప్రభుత్వంలో బిజెపి కూడ భాగస్వామ్యం పంచుకొంది. ఈ అసెంబ్లీ సమావేశాలకు కూడ వైసీపీ హజరుకావద్దని నిర్ణయం తీసుకొంది. ఈ తరుణంలో అసెంబ్లీలో విపక్షంగా వ్యవహరించాలని బిజెపి ప్లాన్ చేస్తోంది.

టిడిపి బాటలోనే బిజెపి: అసెంబ్లీలో నిరసనకు కమలం యోచన, విశాఖలో కీలక సమావేశంటిడిపి బాటలోనే బిజెపి: అసెంబ్లీలో నిరసనకు కమలం యోచన, విశాఖలో కీలక సమావేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా విషమయై బిజెపి అనుసరిస్తున్న తీరును అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. టిడిపి కూడ బిజెపి వ్యవహరశైలిని తీవ్రంగా విమర్శిస్తోంది. ఏపీ పునర్విభ.జన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది.

మరో వైపు ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలను నెరవేర్చామని బిజెపి నేతలు ఇప్పటికే ప్రకటించారు. టిడిపి నేతల విమర్శలను తిప్పికొడుతున్నారు. అంతేకాదు టిడిపి, బిజెపి నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. మరో వైపు విశాఖపట్టణంలో శనివారం నాడు నిర్వహించిన బిజెపి శాసనసభపక్షం సమావేశంలో అసెంబ్లీలో విపక్షంగా వ్యవహరించాలని బిజెపి నిర్ణయం తీసుకొంది.

 అసెంబ్లీలో విపక్ష పాత్ర పోషించాలని బిజెపి నిర్ణయం

అసెంబ్లీలో విపక్ష పాత్ర పోషించాలని బిజెపి నిర్ణయం

ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషించాలని బిజెపి నిర్ణయం తీసుకొంది. వైసీపీ ఈ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకొంది. ఏపీకి నిధుల కేటాయింపు విషయంలో బిజెపి నేతలు వ్యవహరిస్తున్న తీరు పట్ల టిడిపి నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో రెండు పార్టీల మధ్య అగాధం చోటు చేసుకొంది. ఈ తరుణంలోనే టిడిపి ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా ఉన్నప్పటికీ అసెంబ్లీలో విపక్షంగా వ్యవహరించాలని బిజెపి శాసనసభపక్ష సమావేశం నిర్ణయం తీసుకొంది.

పార్లమెంట్‌లో టిడిపి, అసెంబ్లీలో బిజెపి

పార్లమెంట్‌లో టిడిపి, అసెంబ్లీలో బిజెపి

ఏపీ రాష్ట్రానికి నిధుల విషయమై పార్లమెంట్‌లో టిడిపి ప్రజాప్రతినిధులు ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.మరో వైపు ఏపీకి నిధులు కేటాయించామని బిజెపి నేతలు అసెంబ్లీలో తమ పార్టీ వాణిని విన్పించనున్నారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధుల విషయంలో అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టనున్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన నిధుల విషయాన్ని కూడ ప్రస్తావించే అవకాశం ఉంది.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వేడి వేడిగా

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వేడి వేడిగా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వేడి వేడిగా జరిగే అవకాశం కన్పిస్తోంది. టిడిపి, బిజెపి నేతల మధ్య మాటల యుద్దం కొంత అసెంబ్లీలో వేడిని పుట్టించే అవకాశం కన్పిస్తోందని నేతలు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.అసెంబ్లీ సమావేశాల్లో బిజెపి విమర్శలను టిడిపి ఏ రకంగా తిప్పికొడుతోందో చూడాలి

టిడిపిపై ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలకే అవకాశం

టిడిపిపై ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలకే అవకాశం


ఏపీ రాష్ట్రంలో బిజెపి కూడ భాగస్వామ్యంగా ఉంది. ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలు టిడిపి ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతున్నారు. అయితే అసెంబ్లీలో వీరిద్దరూ కూడ ప్రభుత్వంపై విమర్శలు చేసే పరిస్థితి ఉండదు. అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేలకు ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశం ఉంది. బిజెపి శాసనసభపక్షనేత విష్ణుకుమార్ రాజు, మరో ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణకు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే అవకాశం దక్కనుంది.

English summary
Bjp decided to play opposition role in Ap Assembly .Bjlp meeting held at Vishakapatnam on Saturday. Ap assembly sessions will start on March 5
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X