వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు బాటలోనే బిజెపి: కేబినెట్‌కు మాణిక్యాలరావు, కామినేని గుడ్‌బై

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ మంత్రివర్గం నుండి వైదొలగాలని బిజెపి నిర్ణయం తీసుకొంది.గురువారం నాడు చంద్రబాబునాయుడు కేబినెట్‌లో మంత్రులుగా కొనసాగుతున్న ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలు మంత్రి పదవులకు రాజీనామాలు సమర్పించనున్నారు. ఈ మేరకు బిజెపి ఎమ్మెల్యేల ఆకుల సత్యనారాయణ బుధవారం రాత్రి విజయవాడలో ప్రకటించారు.

Recommended Video

BJP strategy : Why BJP behave like this with Andhara Pradesh?

ఎన్డీఏకు టిడిపి కటీఫ్, ఇద్దరు కేంద్ర మంత్రుల రాజీనామాఎన్డీఏకు టిడిపి కటీఫ్, ఇద్దరు కేంద్ర మంత్రుల రాజీనామా

కేంద్రం ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలను అమలు చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తోంది బిజెపి నేతలు ప్రకటించారు. కానీ, టిడిపి నేతలు బిజెపిపై విమర్శలు చేయడం సరికాదని బిజెపి నేతలు అభిప్రాయపడ్డారు.

ప్రజల్లో చులకనభావం, తక్షణమే బయటకు, బిజెపితో పొత్తుపై బాబు కీలక ప్రకటన?ప్రజల్లో చులకనభావం, తక్షణమే బయటకు, బిజెపితో పొత్తుపై బాబు కీలక ప్రకటన?

కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలగాలని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించిన వెంటనే బిజెపి ప్రజా ప్రతినిధులు కూడ విజయవాడలో అత్యవసరంగా సమావేశమై ఈ నిర్ణయం తీసుకొన్నారు.

బాబు మంత్రివర్గం నుండి బయటకు బిజెపి

బాబు మంత్రివర్గం నుండి బయటకు బిజెపి


ఏపీ ప్రభుత్వంలో ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఈ ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలు బాబు మంత్రివర్గంలో ఉన్నారు. కామినేని శ్రీనివాసరావు వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగ కొనసాగుతున్నారు. మాణిక్యాల రావు దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. గురువారం నాడు ఈ ఇద్దరు మంత్రులు కూడ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు తమ రాజీనామా పత్రాలను సమర్పించనున్నారు.

బాబు నిర్ణయంపై బిజెపి నేతల అత్యవసర సమావేశం

బాబు నిర్ణయంపై బిజెపి నేతల అత్యవసర సమావేశం


కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై టిడిపి తీవ్ర అసంతృప్తితో ఉంది. దీనిపై కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలగాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు.ఈ నిర్ణయం విషయమై చంద్రబాబునాయుడు మీడియా సమావేశం వివరాలు తెలుసుకొన్న బిజెపి నేతలు విజయవాడ హోటల్‌లో సమావేశమయ్యారు. రాష్ట్ర కేబినెట్ నుండి కూడ వైదొలగాలని నిర్ణయం తీసుకొన్నారు.

మాణిక్యాలరావు అందుబాటులోకి రాలేదు

మాణిక్యాలరావు అందుబాటులోకి రాలేదు

బిజెపి నేతలు విష్ణుకుమార్ రాజు, ఆకుల సత్యనారాయణ, సోము వీర్రాజు, మాధవ్ తదితరులు సమావేశమయ్యారు. రాష్ట్ర కేబినెట్ సమావేశం నుండి వైదొలగాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. అయితే దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావుతో సంప్రదించేందుకు బిజెపి నేతలు ప్రయత్నించారు. కానీ ఆయన అందుబాటులోకి రాలేదని బిజెపి నేతలు చెప్పారు. దీంతో గురువారం నాడు మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాసరావులు రాజీనామా చేస్తారని బిజెఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు ప్రకటించారు.

రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడ్డాం

రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడ్డాం

రాష్ట్ర ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నట్టుగా ఏపీ రాష్ట్రానికి చెందిన బిజెపి నేతలు ప్రకటించారు. ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేసేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని బిజెపి నేతలు ప్రకటించారు. గురువారం నాడు ఏపీ బడ్జెట్ సందర్భంగా జరిగే కేబినేట్ సమావేశానికి తమ మంత్రులు దూరంగా ఉంటారని బిజెఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు ప్రకటించారు.

English summary
Bjp leaders decided to quit from Chandrababu naidu cabinet . After Tdp chief Chandrababu Naidu key announcement Bjp leaders met in a hotel at Vijayawada on Wednesday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X