వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2019లో బిజెపి గెలవదు, అహంకారంతోనే పతనం, వైసీపీ ఫేక్ పార్టీ : బాబు

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: 2019 ఎన్నికల్లో బిజెపి గెలిచే పరిస్థితి లేదని ఏసీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. అహంకారపూరితంగా వ్యవహరించడం వల్లే బిజెపికి ఈ పరిస్థితి నెలకొందన్నారు. వైసీపీపై కూడ బాబు విమర్శలు గుప్పించారు.వైసీపీ ఫేక్ పార్టీ అంటూ చంద్రబాబునాయుడు ఆరోపించారు.

Recommended Video

రాష్ట్రంలోని కొన్ని పార్టీలు కేంద్రంతో కుమ్మక్కై రాష్ట్రానికి నష్టం చేస్తున్నారు : బాబు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు సోమవారం నాడు అమరావతిలో టిడిపి సమన్వయకమిటీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై బాబు చర్చించారు.

ప్రత్యేకహోదా ఇవ్వాలనే డిమాండ్‌తో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏప్రిల్ 20వ తేదిన ఒక్క రోజు నిరహరదీక్షకు దిగనున్నారు. సీఎం దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, టిడిపి ఎమ్మెల్యేలు, నేతలు దీక్షలకు దిగనున్నారు.

2019లో బిజెపి గెలవదు

2019లో బిజెపి గెలవదు

2019 ఎన్నికల్లో బిజెపి గెలవదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీ సమన్వయకమిటీ సమావేశంలో చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. అహంభావం ఎంతటివారినైనా పతనం చేస్తోందని ఆయన చెప్పారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో బిజెపికి చెందిన ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరును చంద్రబాబునాయుడు ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఆ రాష్ట్రంలో బిజెపి ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరుతో బిజెపిపై చెడు ప్రచారం జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బిజెపికి తిరుగులేదనుకొన్నారు. కానీ, పరిస్థితి ఇప్పుడు ఎదురు తిరిగిందన్నారు.

వైసీపీపై బాబు విమర్శలు

వైసీపీపై బాబు విమర్శలు

వైసీపీ ఫేక్ పార్టీ అంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. టీడిపి సమన్వయకమిటీ సమావేశంలో చంద్రబాబునాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఫేక్ ఫోటోలు, ఫేక్ వీడియోలు అంటూ ఫేక్ రాజకీయం చేస్తోందని వైపీసీపై చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. పార్టీ సమన్వయకమిటీ సమావేశంలో చంద్రబాబునాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.తప్పుడు ప్రచారం చేస్తోందని బాబు విమర్శలు చేశారు.

బాబుకు మద్దతుగా మంత్రుల దీక్షలు

బాబుకు మద్దతుగా మంత్రుల దీక్షలు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో చంద్రబాబునాయుడు ఒక్క రోజు పాటు నిరహర దీక్ష చేయనున్నారు. ఈ దీక్షకు మద్దతుగా ఏపీ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపి ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ నేతలు సామూహికంగా దీక్షలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలపై ప్రజలకు వివరించాలని బాబు పార్టీ నాయకులను ఆదేశించారు.13 జిల్లాల్లో మంత్రులు దీక్షలు చేయాలని ఆదేశించారు. మిగిలిన మంత్రులు విజయవాడలో దీక్షలో పాల్గొనాలని బాబు ఆదేశించారు.

టిడిపి సైకిల్ ర్యాలీలు

టిడిపి సైకిల్ ర్యాలీలు

ఏప్రిల్ 21 నుండి రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైకిల్ ర్యాలీలు నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఈ సైకిల్ ర్యాలీలను ఉపయోగించుకోవాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. ప్రత్యేక హోదా కోసం టిడిపి ఏం చేసిందనే విషయాన్ని కూడ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు.

English summary
AP CM Chandrababu Naidu said that the BJP does not win in the 2019 elections. TDP coordination committee meeting held at Amaravathi on Monday. Chandrababau naidu made allegations on Bjp and Ysrcp parties in this meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X