వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి బాటలోనే బిజెపి: అసెంబ్లీలో నిరసనకు కమలం యోచన, విశాఖలో కీలక సమావేశం

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:ఏపీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాల్లో వేగంగా మారుతున్నాయి. పార్లమెంట్‌ సమావేశాల్లో బిజెపిని ఇరుకున పెట్టేందుకు టిడిపి అనుసరిస్తున్న వ్యూహనికి విరుడుగా రాష్ట్ర అసెంబ్లీలో బిజెపి కూడ అదే రకమైన వ్యూహన్ని అనుసరించాలని యోచిస్తున్నట్టు సమాచారం. బిజెపి ప్రజాప్రతినిధుల కీలక సమావేశం శనివారం నాడు విశాఖలో జరగనుంది.

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో అన్యాయం జరిగిందని అన్ని పార్టీలు ఆందోళన బాట పట్టాయి. పార్లమెంట్‌లో టిడిపి నిరసనలు వ్యక్తం చేసింది. మరో వైపు మార్చి 5వతేది నుండి జరిగే రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో కూడ పోరాటం కొనసాగించాలని టిడిపి నిర్ణయం తీసుకొంది.

కేంద్రానికి గుడ్‌బై చెప్పినా ఏం కాదు, బాబు సహనాన్ని ఎంతో కాలం పరీక్షించలేరు: జెసి సంచలనంకేంద్రానికి గుడ్‌బై చెప్పినా ఏం కాదు, బాబు సహనాన్ని ఎంతో కాలం పరీక్షించలేరు: జెసి సంచలనం

మరోవైపు ఏపీ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అన్ని పార్టీలకు లేఖలు రాయాలని కూడ టిడిపి నాయకత్వం నిర్ణయించింది. మొత్తంగా ఈ పరిణామాలు బిజెపి టిడిపి ల మధ్య అగాధాన్ని మరింత పెంచుతున్నాయి. అయితే పార్లమెంట్‌లో టిడిపి అనుసరించే వ్యూహన్ని ఏపీ అసెంబ్లీలో అనుసరించాలని బిజెపి వ్యూహ రచన చేస్తోంది.

టిడిపిని ఇరుకున పెట్టనున్న బిజెపి

టిడిపిని ఇరుకున పెట్టనున్న బిజెపి

ఏపీకి ఎన్నికల సమయంలో బిజెపి ఇచ్చిన హమీలను నెరవేర్చాలని టిడిపి డిమాండ్ చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను నెరవేర్చలేదని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్లమెంట్‌లో టిడిపి నేతలు బిజెపిని ఇరుకున పెట్టేలా వ్యవహరించాలని నిర్ణయం తీసుకొన్నాయి. అయితే బిజెపి కూడ ఏపీ రాష్ట్ర అసెంబ్లీలో అదే వ్యూహన్ని అనుసరించాలని నిర్ణయం తీసుకొంది. రాష్ట్ర అసెంబ్లీలో టిడిపి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేయాలని బిజెపి భావిస్తోందని సమాచారం.

Recommended Video

YSRCP MLA's Resignation...Is It True?
టిడిపి, బిజెపి మధ్య పెరుగుతున్న అగాధం

టిడిపి, బిజెపి మధ్య పెరుగుతున్న అగాధం

ఏపీ రాష్ట్రంలో టిడిపి, బిజెపి నేతల మధ్య అగాధం పెరుగుతోంది. ఏపీకి నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ టిడిపి నేతలు ఆందోళన బాట పట్టారు. అయితే ఏపీకి ఇచ్చిన హమీల్లో 85 శాతం ఇప్పటికే అమలు చేశామని బిజెపి నేతలు చెబుతున్నారు. పార్లమెంట్‌ను స్థంభింపజేయాలని టిడిపి నిర్ణయం తీసుకొంది. అయితే అదే తరహ విధానాన్ని ఏపీ అసెంబ్లీలో అనుసరించాలని బిజెపి నేతలు కూడ యోచిస్తున్నారు. రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఈ తరుణంలో రెండు పార్టీల మధ్య అగాధం పెరుగుతూ వస్తోంది.

విశాఖలో బిజెపి ప్రజాప్రతినిధుల సమావేశం

విశాఖలో బిజెపి ప్రజాప్రతినిధుల సమావేశం

విశాఖలో బిజెపి ప్రజాప్రతినిధుల సమావేశం మార్చి 3న ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ఏపీ అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.ఇప్పటికే ఏపీకి బిజెపి అన్యాయం చేసిందని మిత్రపక్షమైన టిడిపి సహ అన్ని పార్టీలు విమర్శిస్తున్న నేపథ్యంలో రాజకీయంగా నష్టం వాటిల్లకుండా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరగనుంది

అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరగనుంది

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో బిజెపి ఏ రకంగా వ్యవహరించనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించింది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో బిజెపి, టిడిపి సభ్యులు మాత్రమే ఉన్నారు. అయితే బిజెపి టిడిపికి వ్యతిరేకంగా నిరసన గళం విప్పుతోందా లేదా అనే విషయాలపై ఆసక్తి నెలకొంది. బిజెపి కూడ అసెంబ్లీలో పోరాటం చేస్తే రాజకీయ పరిణామాల్లో మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Bjp MP and MLA's meeting will be held at Vishakapatnam on March 3.bjp planning to protest in upcoming Assembly sessions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X