విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహాన్యూస్ ను బహిష్కరించిన బిజెపి,టీడీపీ పాలనలో అంతా అవినీతే:మాణిక్యాలరావు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విజయవాడ:అమరావతి:రాష్ట్రంలో టీడీపీ హయాంలో అనేక శాఖల్లో అవినీతి యథేచ్ఛగా జరుగుతోందని మాజీ మంత్రి,బిజెపి ఎమ్మెల్యే మాణిక్యాల రావు ఆరోపించారు. ఉచిత ఇసుక పేరుతో ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారన్నారు.

ఏపీకి కేంద్రం ఎంతో సాయం చేసినా చంద్రబాబు అదంతా తన గొప్పగా చెప్పుకుంటున్నారని మాణిక్యాలరావు మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తామని మాజీ మంత్రి మాణిక్యాలరావు స్పష్టం చేశారు. మరోవైపు బిజెపిపై అబద్దపు ప్రచారం చేస్తుందనే ఆరోపణతో మహా న్యూస్ ఛానెల్ ను బిజెపి బహిష్కరించినట్లు తెలిసింది.

BJP expelled Mahanews Channel

విజయవాడ వేదికగా జరిగిన బీజేపీ రాష్ట్ర స్ధాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అయితే బిజెపి తమ ఛానెల్ ను బహిష్కరించడంపై మహా న్యూస్ ప్రతినిధిలు స్పందిస్తున్నారు. ఈ బహిష్కరణపై సోషల్ మీడియాలో బిజెపి పై దుమ్మెత్తిపోస్తున్నారు.
ప్రజల గొంతుకుగా ఉన్న మీడియాపై బిజెపి జులుం చూపించిందని, ఇచ్చిన హామీలు నేరవేర్చని కారణంగా దాన్ని ప్రశ్నించినందుకు మహా న్యూస్ ని బిజెపి బాయ్ కాట్ చేసిందని ఆరోపిస్తున్నారు.

ఐదు కోట్ల మంది ఆంధ్రా ప్రజల పక్షాన పోరాటం చేసినందుకు మీడియాకి దొరికిన ఒక అరుదైన గౌరవం

ఇదని బిజెపిని ఎద్దేవా చేశారు.

ఇక మీదట మహా న్యూస్ చర్చ కార్యక్రమాలతో ఈ ఛానెల్ నిర్వహించే ఇతరత్రా అన్ని కార్యక్రమాలకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరు కాకూడదని తీర్మానం చేసుకున్నారు
ట. విజయవాడ వేదికగా జరిగిన బీజేపీ రాష్ట్ర స్ధాయి సమావేశంలో మహా న్యూస్ పై ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని మహా న్యూస్ ప్రతినిధులే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మహా న్యూస్ డిబేట్స్ కి వచ్చిన బీజేపీ నాయకులను ఏపీ కి ఇచ్చిన హామీలను ఎందుకు నేరవేర్చ లేక పోయారని ప్రశ్నిస్తుండటంతో...అందుకు సమాధానం చెప్పలేక వారు ఈ విధంగా మొహం చాటేస్తున్నారని మహా న్యూస్ ప్రతినిథులు ఆరోపిస్తున్నారు. బీజేపీ తాటాకు చప్పుళ్లకు మహా టీం భయపడదని...తాము ప్రజల పక్షాన చేసిన పోరాటాన్ని ఎవరూ మర్చిపోరని అంటున్నారు. మహా టీవీ కి ప్రజల మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని...బీజేపీ బెదిరింపులకు తాము బెదరం...అదరం; తాము ఇప్పుడు, ఎప్పుడు , ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని
మహా టీం ప్రతినిథులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

English summary
Amaravati: Former minister and BJP MLA Manikyala Rao alleges that corruption in all departments during the TDP rule in the stateOn the other hand, the BJP has boycotted the Maha News channel with the allegation that it will campaign against the BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X