• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కొడాలి నానీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ .. జగన్ వారిని కట్టడి చెయ్యాలి .. లేదంటే అంటూ వార్నింగ్

|

తిరుమలలో అన్య మతస్థుల డిక్లరేషన్ విషయంపై ఏపీలో రగడ కొనసాగుతూనే ఉంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి డిక్లరేషన్ అవసరం లేదంటూ, స్వామిపై విశ్వాసం ఉంటే చాలంటూ టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో మొదలైన రగడ నేటికీ కొనసాగుతోంది. ఇక తాజాగా కొడాలి నానీ వ్యాఖ్యలు అగ్నికి ఆర్ఘ్యం పోసినట్టు అయ్యింది . దీంతో ఏపీ బీజేపీ నేతలు ఏపీ సర్కార్ పై , కొడాలి నానీపై భగ్గుమంటున్నారు.

  Tirumala Declaration: డిక్లరేషన్ విధానాన్ని పూర్తిగా రద్దు చెయ్యాలి! - కొడాలి నాని

  తిరుమల డిక్లరేషన్ రగడ ... నిబంధన మార్చటం అనాచారం .. చంద్రబాబు , రఘురామ ఫైర్

  తిరుమలలో డిక్లరేషన్ తొలగించాలని కొడాలి నానీ వ్యాఖ్యలు

  తిరుమలలో డిక్లరేషన్ తొలగించాలని కొడాలి నానీ వ్యాఖ్యలు

  తిరుమల డిక్లరేషన్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారగా డిక్లరేషన్ తొలగిస్తామని తాము అనలేదని, ప్రతి ఒక్కరి నుండి డిక్లరేషన్ తీసుకోవడం సాధ్యం కాదని మాత్రమే అన్నానని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చినా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలతో తాజాగా వివాదం మరింత ముదిరింది. మంత్రి కొడాలి నాని తిరుమల డిక్లరేషన్ ఎందుకు అని ప్రశ్నిస్తూ ఇతర ఆలయాలు, చర్చిలు, మసీదులలో ఎక్కడా డిక్లరేషన్ విధానం లేదని, ఈ విధానాన్ని తిరుమలలో కూడా తొలగించాలంటూ డిమాండ్ చేశారు. హిందూ ఆలయాల్లో దాడులు జరిగితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని లెక్కలు చెప్పారు .

   మండిపడుతున్న బీజేపీ .. ప్రకటన విడుదల

  మండిపడుతున్న బీజేపీ .. ప్రకటన విడుదల

  కొడాలి నానీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నాయకులు. అధికార మదంతో, నిలువెల్లా అహంకారంతో హిందూ దేవుళ్లను, హిందువుల సాంప్రదాయాలను అవమానపరుస్తూ కొడాలి నాని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ బిజెపి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. నేడు పార్టీ తరఫున ఒక ప్రకటన విడుదల చేసిన ఏపీ బీజేపీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ మంత్రులను, నాయకులను కట్టడి చేస్తే మంచిదంటూ హెచ్చరించారు. వెంకటేశ్వర స్వామి పై పిచ్చి వాగుడు వాగితే హిందువులు తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.

  సీఎం జగన్ తమ మంత్రులను , నేతలను కంట్రోల్ చెయ్యాలని డిమాండ్

  సీఎం జగన్ తమ మంత్రులను , నేతలను కంట్రోల్ చెయ్యాలని డిమాండ్

  పరిస్థితి అంత వరకు రాకముందే సీఎం జగన్ తమ పార్టీ నాయకులను కంట్రోల్లో పెట్టుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పార్టీ తరఫున నేతలు హెచ్చరికలు జారీ చేశారు. అంతర్వేది రథం దగ్ధం ఘటన జరిగితే, దుర్గగుడిలో సింహాలు మాయమైతే, ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేస్తే పోయేది ఏమీ లేదా ? అంటూ ప్రశ్నించారు. వాటిని డబ్బుతో వెల కడతారా నానీ అంటూ బీజేపీ నేతలు మండిపడ్డారు.

  తిరుమలపై అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేయడం మంచిది కాదంటూ వార్నింగ్

  తిరుమలపై అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేయడం మంచిది కాదంటూ వార్నింగ్

  అంతర్వేది చర్చిలో రెండు అద్దాలు పగిలితే 41 మందిపై కేసులు ఎందుకు పెట్టారంటూ ప్రశ్నించారు అద్దాలు పగిలిన దానికి వెయ్యి ,రెండు వేలు ఇస్తే సరిపోయేది కదా అంటూ బిజెపి నాయకులు ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. హిందూ దేవాలయాల పై, తిరుమలపై అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేయడం మంచిది కాదంటూ వార్నింగ్ ఇచ్చారు. తిరుమలలో డిక్లరేషన్ కొనసాగవలసిందే అంటూ ఏపీ బీజేపీ డిమాండ్ చేసింది. ఏపీలో గత కొంత కాలంగా దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఏపీ బీజేపీ నిప్పులు చెరుగుతుంది. దేవాలయాల పరిరక్షణ కోసం ఏపీ బీజేపీ చివరి వరకు పోరాటం సాగిస్తామని చెప్తుంది .

  English summary
  BJP leaders are angry over Kodali Nani's remarks. The Andhra Pradesh BJP has flagged that Kodali Nani is making insulting remarks to Hindu gods and Hindu traditions with arrogance. In a statement issued on behalf of the party today, AP BJP AP CM Jagan Mohan Reddy warned that it would be better if their party ministers and leaders were calm on particular issues.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X