వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకయ్య తర్వాత.. బాబుకు ఝలక్: ఢిల్లీలో వారి చక్రం, జగన్ వ్యాఖ్యల్లో నిజముందా?

ఏపీలో టిడిపి - బిజెపి మధ్య మిత్రబంధం తెగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయా? కాంగ్రెస్ నుంచి వచ్చి బిజెపిలో చేరిన నేతలు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీలో టిడిపి - బిజెపి మధ్య మిత్రబంధం తెగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయా? కాంగ్రెస్ నుంచి వచ్చి బిజెపిలో చేరిన నేతలు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

'సాక్షి' ఇంత దుర్మార్గమా, తెలంగాణలో ఆంధ్రులను దొంగలంటారా: బాబు, జగన్ సెల్ఫ్‌గోల్'సాక్షి' ఇంత దుర్మార్గమా, తెలంగాణలో ఆంధ్రులను దొంగలంటారా: బాబు, జగన్ సెల్ఫ్‌గోల్

ముఖ్యంగా వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లిన తర్వాత ఏపీలో లోలోన కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. 2019లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు.

మీరేంటో అర్థంకావట్లేదు, అడగరా?: బాబుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం, బిజెపి బలపడాలంటే..మీరేంటో అర్థంకావట్లేదు, అడగరా?: బాబుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం, బిజెపి బలపడాలంటే..

ఆ దెబ్బకి బిజెపి తగ్గిందనుకున్నారు

ఆ దెబ్బకి బిజెపి తగ్గిందనుకున్నారు

అందుకు గత కొద్ది రోజులుగా బిజెపి నేతల మాటలే నిదర్శనం అంటున్నారు. గతంలో బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా వచ్చి.. టిడిపిని ఏమీ అనవద్దని పార్టీ నేతలకు క్లాస్ పీకారు. అప్పుడు మౌనం దాల్చారు. ఆ తర్వాత నంద్యాల ఉప ఎన్నికలు, కాకినాడ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం కూడా పెదవి విప్పలేదు. దీంతో ఈ గెలుపు దెబ్బకు బిజెపి.. టిడిపికి దూరం కావొద్దని భావిస్తున్నదనే ప్రచారం సాగింది.

బిజెపి మాటలో తేడా

బిజెపి మాటలో తేడా

కానీ లోలోన బిజెపి తన వ్యూహానికి పదును పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. క్రమంగా బిజెపి మాటలో తేడా కనిపిస్తోందని అంటున్నారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు ఇటీవల విశాఖలో మాట్లాడారు. టిడిపితో స్నేహం తమ ఎదుగుదలకు అడ్డు కాదని చెప్పారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో అసలు చంద్రబాబుకే తమతో ఉండటం ఇష్టం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు.

వారు చక్రం తిప్పుతున్నారా?

వారు చక్రం తిప్పుతున్నారా?

ఏపీలో బిజెపి సొంతగా ఎదగాలని కోరుకునే నేతలకు తోడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నేతలు క్రమంగా ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లాక అది మరింత వేగమైందని అంటున్నారు.

ఆ ప్రయత్నాలు సఫలమవుతున్నాయా?

ఆ ప్రయత్నాలు సఫలమవుతున్నాయా?

టిడిపికి దూరమవ్వాలనుకున్న నేతల ప్రయత్నాలు కొంత సఫలమవుతున్నట్లుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. అందుకే అధిష్టానం ఎంతగా చెప్పిన బిజెపి నేతలు టిడిపి ప్రభుత్వంపై సమయం వచ్చినప్పుడు విమర్శలు చేస్తున్నారని అంటున్నారు.

అధిష్టానం ఆరా, వ్యూహంలో భాగమేనా?

అధిష్టానం ఆరా, వ్యూహంలో భాగమేనా?

2019లో జగన్‌తో వెళ్తే మంచిదా, చంద్రబాబుతో వెళ్తే మంచిదా అనే విషయమై అధిష్టానం ఆరా తీస్తోందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వివరాలు, లెక్కలు కూడా అడిగిందని తెలుస్తోంది. కాగా, బిజెపి పెద్దలు చంద్రబాబుకు అనుకూలంగా ఉండటం, రాష్ట్రస్థాయి నేతలు కొందరు సమయం వచ్చినప్పుడు విమర్శలు చేయడం బిజెపి వ్యూహంలో భాగమే కావొచ్చునని అంటున్నారు.

జగన్ వ్యాఖ్యల్లో నిజముందా?

జగన్ వ్యాఖ్యల్లో నిజముందా?

నంద్యాల ఉప ఎన్నికల తర్వాత జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వేరు, రాష్టమంతా వేరు అని తెలిపారు. కనీసం పార్టీ ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, అప్పుడు చంద్రబాబు తన సత్తా నిరూపించుకోవాలని, అప్పుడు ఎవరి బలమెంతో తేలుతుందన్నారు. పైగా అధికార పార్టీకే గెలుపు అవకాశాలు ఉంటాయని వెల్లడించారు.

జగన్ మాటను పల్లె వేశారా

జగన్ మాటను పల్లె వేశారా

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అదే చెప్పారు. ఇదే విషయాన్ని.. చంద్రబాబుతో దోస్తీ వద్దనుకునే బిజెపి నేతలు అధిష్టానం వద్ద చెప్పి చక్రం తిప్పుతున్నారా అనే చర్చ సాగుతోంది.

English summary
It is said that Bharatiya Janata Party (BJP) have a game plan conquer Andhra Pradesh. Some leaders are demanding high command to leave Telugu Desam for 2019 general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X