• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పిక్చర్ క్లియర్: వైసీపీ ఒకవైపు: టీడీపీ-కమ్యూనిస్టులు, జనసేన-బీజేపీ మరోవైపు

|

అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లు శాసనసభలో ఆమోదం పొందిన నేపథ్యంలో.. రాష్ట్ర రాజకీయ వాతావరణం, సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై దాడులు తీవ్రం కానున్నాయి. అటు తెలుగుదేశం పార్టీ-సీపీఐ, ఇటు బీజేపీ-జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది. సీపీఎం తన వైఖరిని స్పష్టం చేయాల్సి ఉంది. అమరావతి గ్రామాలతో సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నిరసన ప్రదర్శనలను నిర్వహించాలని భావిస్తున్నాయి.

యాక్షన్ టైమ్: మా పార్టీ గుర్తుపై గెలిచి, వైసీపీకి మద్దతా? రాపాకపై చర్యలను తప్పుపట్టిన జనసేన..!

రెండు పార్టీలదీ ఒకే బాట.. ఒకే మాట..

రెండు పార్టీలదీ ఒకే బాట.. ఒకే మాట..

మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో బీజేపీ, జనసేన ఒకే బాటలో సాగుతున్నాయి. మూడు రాజధానులను ఏర్పాటు చేయకూడదని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కొద్దిరోజుల కిందటే ఓ రాజకీయ తీర్మానాన్ని సైతం ఆమోదించింది. మూడు రాజధానుల ఏర్పాటుపై ఇదివరకు బీజేపీలో భిన్నాభిప్రాయాలు వినిపించినప్పటికీ..రాజకీయ తీర్మానం అనంతరం.. అవన్నీ మూగబోయాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే సమైక్య గళాన్ని వినిపిస్తున్నాయి.

జనసేన పార్టీ సిద్ధాంతమూ అదే..

జనసేన పార్టీ సిద్ధాంతమూ అదే..

పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ సిద్ధాంతం కూడా అమరావతినే రాజధానిగా కొనసాగించాలనే. మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నప్పటి నుంచీ జనసేన పార్టీ దాన్ని వ్యతిరేకిస్తూనే వస్తోంది. ఆ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు అమరావతి గ్రామాల్లో నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. రిలే నిరాహార దీక్షలనూ చేపట్టారు.

వేర్వేరుగా కాకుండా.. ఉమ్మడిగా..

వేర్వేరుగా కాకుండా.. ఉమ్మడిగా..

రాజకీయంగా గానీ, రాజధాని రైతుల నుంచి గానీ ఎదురైన ప్రతిఘటనలను రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని, వాటన్నింటిని తోసిపుచ్చుతూ.. ఏకపక్షంగా అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేసుకుందనే అభిప్రాయం బీజేపీ, జనసేన నేతల్లో వ్యక్తమౌతోంది. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి పోరాటాలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నాయి. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండాలనే అంశంపై మంగళవారం ఈ రెండు పార్టీల నాయకులు సమావేశం కానున్నారు.

టీడీపీ-సీపీఐ జట్టుగా..

టీడీపీ-సీపీఐ జట్టుగా..

మరోవంక.. టీడీపీ-సీపీఐ ఒక జట్టుగా ఏర్పడబోతున్నాయి. ఇదివరకే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన జోలె ఉద్యమాల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ భాగస్వామి అయ్యారు. చంద్రబాబు జోలె పట్టిన ప్రతీచోటా ఆయనా కనిపించారు. రాష్ట్ర స్థాయి కార్యదర్శే టీడీపీ చేపట్టిన ఉద్యమంలో పాల్గొనడం ఆ పార్టీ వైఖరి ఏమిటో స్పష్టం చేసినట్టయింది. సీపీఎం నిర్ణయం ఎలా ఉంటుందనేది తేలాల్సి ఉంది.

సిద్ధాంతపరంగా వ్యతిరేకించే అవకాశం..

సిద్ధాంతపరంగా వ్యతిరేకించే అవకాశం..

పీ మధు సారథ్యంలోని సీపీఎం తన వైఖరి ఏమిటనే విషయాన్ని ఇంకా ఎక్కడా వెల్లడించలేదు. ప్రతి విషయాన్నీ ఆ పార్టీ నిశితంగా పరిశీలిస్తోంది.. అధ్యయనం చేస్తోంది. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నడచుకోవాలా? లేక అధికార పార్టీ తీసుకునే నిర్ణయాన్ని సిద్ధాంతపరంగా వ్యతిరేకించాలా? అనే విషయంపై సీపీఎం రాష్ట్రశాఖలో చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై పార్టీ వైఖరి ఏమిటనేది తేలిన తరువాతే ప్రత్యక్ష పోరాటాలకు దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

English summary
Bharatiya Janata Party, Jana Sena Party likely to meet to discuss action plan for oppose the Decentralisation Act on today. Recently, Jana Sena Party alliance with BJP for contesting upcoming elections at any stage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X