వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్థానిక పోరుపై భేటీ అయిన బీజేపీ, జనసేనలు .. 12 న ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఎన్నికల సమరం జరుగుతుంది. స్థానిక పోరుకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఇటీవల పొత్తు పెట్టుకున్న బీజేపీ , జనసేన పార్టీలు ఎన్నికలకు సంబంధించికసరత్తులు చేస్తున్నాయి. ఇక నేడు దీనికి సంబంధించి బీజేపీ ,జనసేన పార్టీలు ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి. అందుకోసం నేడు కీలక భేటీ నిర్వహించాయి.

స్థానిక సంస్థల ఎన్నికలు .. ఆ పని చేస్తే అదిరిపోయే ఆఫర్ అంటున్న వైసీపీ సర్కార్స్థానిక సంస్థల ఎన్నికలు .. ఆ పని చేస్తే అదిరిపోయే ఆఫర్ అంటున్న వైసీపీ సర్కార్

ఈ నెల 12న ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయనున్న బీజేపీ, జనసేన

ఈ నెల 12న ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయనున్న బీజేపీ, జనసేన

ఏపీలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెల 12న ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు బీజేపీ, జనసేన నేతలు ప్రకటించారు. విజయవాడలో ఇరు పార్టీల ముఖ్య నాయకులు సమావేశమై స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. ఎవరు ఎక్కడ పోటీ చేయాలి..? ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు. ఏ విధంగా ప్రజా క్షేత్రంలోకి వెళ్ళాలి అని అన్ని విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు.

 ఇరు పార్టీ మధ్య సమన్వయ కమిటీలు ఏర్పాటు

ఇరు పార్టీ మధ్య సమన్వయ కమిటీలు ఏర్పాటు

సమావేశం అనంతరం బీజేపీ నాయకురాలు పురంధరేశ్వరి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ జిల్లా, అసెంబ్లీ, మండల స్థాయిలో ఇరు పార్టీ మధ్య సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు వారు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు బీజేపీ నేత పురంధరేశ్వరి.

అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్న బీజేపీ, జనసేనలు

అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్న బీజేపీ, జనసేనలు

ప్రజలకు ప్రస్తుత ప్రభుత్వానికి బుద్ధి చెప్పటానికి ఇదే సరైన తరుణం అని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకే ఇంత తక్కువ సమయంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.ఇక ఏపీలో ప్రజా పక్షాన పోరాటాలు చేస్తున్న తమ కూటమిని ప్రజలు ఆశీర్వదిస్తారన్నారు ఇరు పక్షాల నాయకులు. భవిష్యత్తులో కూడా ఈ పొత్తును మరింత దృఢంగా, విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు.

English summary
The election campaign will be held in AP. All major political parties are preparing for the local conflict. In particular, the BJP and the Jana Sena, which have recently formed alliances in the AP, are conducting elections. Today, the BJP and Jana Sena are jointly planning on this. A key meeting was held today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X