విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్, బెంగళూరును తలదన్నేలా.. విశాఖ: హరీష్ రావుకు ఏపీ బీజేపీ నేత కౌంటర్..!

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీలో నెలకొన్న పరిస్థితులు హైదరాబాద్ కు అనుకూలంగా మారాయని, పెట్టుబడులు పెట్టడానికి గానీ, రియల్ ఎస్టేట్ కార్యకలాపాల్లో గానీ భాగ్యనగరం అత్యుత్తమమంటూ తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ పడింది. హరీష్ రావు వేసిన అంచనా పొరపాటు అని భారతీయ జనతా పార్టీ నాయకుడు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు.

అన్నింటికీ హైదరాబాద్ అనుకూలం.. స్వల్పకాలమే

అన్నింటికీ హైదరాబాద్ అనుకూలం.. స్వల్పకాలమే

అన్ని రంగాల వారికీ హైదరాబాద్ అనుకూల నగరమని హరీష్ రావు వెల్లడించిన విషయం తెలిసిందే. చెన్నైలో మంచినీరు దొరకదని, బెంగళూరులో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉందని, ఢిల్లీలో కాలుష్యం అత్యధికమని, ముంబైలో అధిక ధరల సమస్యలు వేధిస్తున్నాయని ఆయన ఓ సదస్సులో చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో మాత్రం ఇలాంటి మౌలికపరమైన సమస్యల ఏవీ లేవని, పైగా తమ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ రంగానికి అనుకూలంగా ఉందని అన్నారు.

విశాఖ కుదురుకుంటే చాలు..

విశాఖ కుదురుకుంటే చాలు..

హరీష్ రావు వెల్లడించిన ఈ వివరాలపై ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల వల్ల హైదరాబాద్ కు స్వల్పకాలానికి మాాత్రమే లాభిస్తుందని, దీర్ఘకాలానికి ఉపయోగపడకపోవచ్చని చెప్పారు. ఏపీలో నెలకొన్న అనిశ్చితి ఎక్కువ రోజులు కొనసాగదని, త్వరలోనే దానికి తెర పడుతుందని అన్నారు. ఈ దిశగా ఏపీ ప్రభుత్వం త్వరితగతిన చర్యలను తీసుకుంటోందని వ్యాఖ్యానించారు.

ముంబైకి ధీటుగా ఎదగడం ఖాయం..

ముంబైకి ధీటుగా ఎదగడం ఖాయం..

విశాఖపట్నం ఏపీ రాజధానిగా అభివృద్ధి చెందినప్పుడు దానికి సరిసాటి రాగల మరో నగరం దక్షిణాది రాష్ట్రాల్లో ఉండకపోవచ్చని ఐవైఆర్ అన్నారు. ఒక్కసారి విశాఖపట్నం ఏపీ రాజధానిగా కుదురుకుంటే.. ఇక ఆ నగరాభివృద్ధిని ఎవరూ ఆపలేరని చెప్పారు. హైదరాబాద్, బెంగళూరులను సైతం తలదన్నేలా విశాఖపట్నం ఎదుగుతుందని అన్నారు. దేశ ఆర్థిక రాజధానిగా పేరు పొందిన ముంబైకి ధీటుగా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందని ఐవైఆర్ అంచనా వేశారు.

కలిసి వచ్చే తీర ప్రాంతం..

కలిసి వచ్చే తీర ప్రాంతం..

తూర్పు తీర ప్రాంతంలో మరో ముంబై నగరంలా విశాఖపట్నం పురోగమిస్తుందని అన్నారు. విశాఖపట్నానికి తీర ప్రాంతం ఉండటం కలిసి వచ్చే అంశమని చెప్పారు. తీర ప్రాంత నగరం కావడం కూడా ముంబై అభివృద్ధి చెందిందని, అదే తరహా భౌగోళిక పరిస్థితులు, వాతావరణం విశాఖపట్నంలో ఉన్నాయని చెప్పారు. ఈ దిశగా ఏపీ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుందని ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు.

English summary
Bharaitya Janata Party leader and Ex IAS Officer IYR Krishna Rao supported Visakhapatnam as executive capital of Andhra Pradesh. He deferred Telangana Minister T Harish Rao comments as Hyderabad is the best Capital city in South India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X