వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్.పి.ఆర్.ను తిరస్కరించే అధికారం జగన్ కు లేదంటున్న బీజేపీ నేత

|
Google Oneindia TeluguNews

జాతీయ జనాభా పట్టిక ఎన్.పి.ఆర్ ను తిరస్కరించే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ లేదని బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. ఎన్.పి.ఆర్ ను అడ్డుకునే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉందన్నారు.

ఎన్.పి.ఆర్ ను జగన్ అమలు చేయాల్సిందే

ఎన్.పి.ఆర్ ను జగన్ అమలు చేయాల్సిందే

ఏపీలో జాతీయ జనాభా పట్టిక ఎన్.పి.ఆర్ ను ప్రస్తుత ఫార్మాట్ లో అమలు చేయకూడదని నిన్న ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ సీనియర్ నేత, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తప్పుబట్టారు. ఎన్.పి.ఆర్ ను అమలు చేయబోమంటూ కొన్ని రాష్ట్రాలు చేస్తున్న ప్రకటనలను ఆయన ఖండించారు. సీఏఏ చట్టం మీద రాష్ట్రాలకు ఎలాంటి అధికారం లేదన్నారు. ఈ విషయం తెలిసి కూడా నాయకులు ప్రజలను ఇంకా మభ్య పెడుతున్నారన్నారు.

ఎన్.పి.ఆర్ సెన్సస్ కమిషనర్ పరిధిలోనే

ఎన్.పి.ఆర్ సెన్సస్ కమిషనర్ పరిధిలోనే

ఎన్.పి.ఆర్ ను రాష్ట్రాల్లో అమలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే సెన్సస్ కమిషనర్ కు మాత్రమే ఉందని ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. ఎన్‌పీఆర్ పౌరసత్వ చట్టం కింద రూపొందించిన రూల్స్ కి అనుగుణంగా ఏర్పాటయింది. ఈ చట్టం మీద రాష్ట్రానికి ఎటువంటి అధికారం లేదు' అని తెలిపారు.

'ఇక దీనిని అమలు చేసేది సెన్సెస్ కమిషనర్. సెన్సెస్ చట్టం కింద ఈయన కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే పని చేస్తాడు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సెన్సెస్ పని వరకు ఆయన పరిధిలోనే పని చేస్తారు. సహాయ సహకారాలు అందించడమే కానీ సెన్సెస్ వరకు వారిని నియంత్రించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు' అని చెప్పారు.

లేని అధికారాలు ఉన్నట్లు ప్రకటనలు ఇస్తూ ఈ నాయకులు ప్రజలను మభ్య పెడుతూ ఉన్నారు. సెన్సెస్ విషయంలో సహకరించకపోతే పౌరుల పైన అధికారుల పైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం సెన్సెస్ కమిషనర్ కు ఉంది. ప్రజలు ఈ అంశాన్ని గ్రహిస్తే రాజకీయ నాయకులు ఎట్లా రెచ్చగొట్టినా సమస్యలకు తావుండదు అని తెలిపారు.

Recommended Video

Hyderabad May Be The Second Capital Of India Says CH Vidyasagar Rao || Oneindia Telugu
 మైనారిటీ ఓటుబ్యాంకు కోసమే జిమ్మిక్కులు

మైనారిటీ ఓటుబ్యాంకు కోసమే జిమ్మిక్కులు

జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) నవీకరణ ప్రక్రియ చేపట్టలేమంటూ పలు రాష్ట్రాల సీఎంలు చేస్తోన్న ప్రకటనలపై ఐవైఆర్ విమర్శలు గుప్పించారు. జగన్, కేసీఆర్, మమతా బెనర్జీ ఇంకా కొందరు ముఖ్యమంత్రులు తమ మైనారిటీ ఓటు బ్యాంకు పదిలపరచుకోవడం కోసం ఎన్‌పీఆర్ అమలు చేయమంటూ ప్రకటనలు చేస్తున్నారు. వాస్తవాలను ప్రజలకు చేరకుండా ఎంతోకాలం వీరు దాచలేరన్నారు.

English summary
BJP leader IYR Krishna Rao says Jagan Govt has no powers to oppose NPR
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X