గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కన్నాతో మరోసారి టచ్‌లోకి టిడిపి: రామ్ మాధవ్ ఫోన్, పయనమెటు?

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరతారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. వైసీపీలో చేరాలని ముహుర్తంగా నిర్ణయించుకొన్నా రోజునే తీవ్ర అస్వస్థతకు గురైన కన్నా లక్ష్మీనారాయణ ఆసుపత్రిలో చేరారు. దీంతో కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరడం వాయిదా పడింది. దీంతో మరోసారి టిడిపి నేతలు కొందరు కన్నా లక్ష్మీనారాయణతో సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం సాగుతోంది.

2014 ఎన్నికల సమయంలో కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన బిజెపిలో చేరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తోందని భావించారు. సమీకరణాలు మారడంతో ఆ పదవి దక్కదని తెలిసి పార్టీ మారాలని నిర్ణయం తీసుకొన్నారు.

ఇటీవల తన అనుచరులతో కన్నా లక్ష్మీనారాయణ సమావేశమయ్యారు. వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. ముహుర్తం కూడ ఫిక్స్ చేసుకొన్నారు. అయితే అనుహ్యంగా అదే రోజు కన్నా లక్ష్మీనారాయణ అస్వస్థతకు గురికావడంతో వైసీపీలో చేరిక వాయిదా పడింది.

కన్నాతో టిడిపి నేతల రాయబారాలు

కన్నాతో టిడిపి నేతల రాయబారాలు

అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడంతో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరిక తాత్కాలికంగా వాయిదా పడింది. అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మళ్ళీ టిడిపి నేతలు రంగంలోకి దిగారని ప్రచారం సాగుతోంది. తమ పార్టీలోకి రావాలని కన్నా లక్ష్మీనారాయణను ఆహ్వానిస్తున్నట్టు సమాచారం. కన్నా లక్ష్మీనారాయణ కోరే డిమాండ్లపై పార్టీ నాయకత్వం ఏ రకంగా స్పందిస్తోందనేది ఆసక్తిగా మారింది. కాపు సామాజికవర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ పార్టీలోకి వస్తే మరింత బలోపేతమయ్యేందుకు అవకాశాలుంటాయని ఆ పార్టీలో కొందరు నేతలు అభిప్రాయంగా కన్పిస్తోంది. కన్నాతో మళ్ళీ టచ్‌లోకి వెళ్ళారని సమాచారం.

టిడిపి నేతల రాయబారం విఫలం

టిడిపి నేతల రాయబారం విఫలం


మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను టిడిపిలోకి ఆహ్వానించేందుకు కొందరు టిడిపి నేతలు చేసిన ప్రయత్నాలు తొలిసారి అంతగా సక్సెస్ కాలేదు. రాష్ట్ర మంత్రి ఒకరు కన్నా లక్ష్మీనారాయణను టిడిపిలోకి రప్పించేందుకు ప్రయత్నాలు చేశారని టిడిపి వర్గాల్లో ప్రచారంలో ఉంది. అయితే కన్నా లక్ష్మీనారాయణ చేసిన డిమాండ్ల విషయమై చంద్రబాబుతో చర్చించి చెబుతామన్నారు. కానీ ఈ విషయమై కన్నాకు సదరు మంత్రి నుండి ఫోన్ రాకపోవడంతో ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారని సమాచారం.

కన్నాకు వైసీపీ ఒకే

కన్నాకు వైసీపీ ఒకే

బిజెపి నుండి బయలకు రావాలనుకొన్న కన్నా లక్ష్మీనారాయణకు వైసీపీ నాయకత్వం మంచి ఆఫర్ ఇచ్చేందుకు సిద్దమైందని రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. కన్నా లక్ష్మీనారాయణ కోరుకొనే పెదకూరపాడు టిక్కెట్టుతో పాటు మరో టిక్కెట్టును తాను సూచించిన అభ్యర్ధికి ఇచ్చేందుకు వైసీపీ సానుకూలంగా స్పందించినట్టు ప్రచారం సాగుతోంది. దీంతో వైసీపీలో చేరేందుకు కన్నా లక్ష్మీనారాయణ ఓకే చెప్పారని అంటున్నారు. అయితే అదే సమయంలో తొలుత టిడిపి నేతలు జరిపిన రాయబారంలో టిక్కెట్టు విషయమై స్పష్టత లేకపోవడంతో వారి ప్రయత్నం విఫలమైంది.

కన్నాకు రామ్ మాధవ్ ఫోన్

కన్నాకు రామ్ మాధవ్ ఫోన్

మాజీ మంత్రి బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారాలని నిర్ణయం తీసుకొన్నారని వార్తలు వెలువడిన తరుణంలో ఆ పార్టీ ఏపీ రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జీగా ఉన్న రామ్ మాధవ్ కన్నా లక్ష్మీనారాయణకు ఫోన్ చేశారని సమాచారం. పార్టీలోనే కొనసాగాలని కన్నా లక్ష్మీనారాయణను కోరారు.అయితే మొత్తంగా కన్నాను తమ పార్టీల్లో చేర్చుకొనేందుకు అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.

English summary
Guntur politics are turning hot as elections are closing in, leaders are trying to shift their loyalties. Kanna has won five times and has good strength among Kapus. The leader has lost Guntur West Assembly seat in 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X