వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభ‌జించిన పార్టీ, విభ‌జ‌న హామీలు నెర‌వేర్చ‌ని పార్టీ..!అందుకే బీజేపీకి పురంధేశ్వ‌రి గుడ్ బై..!!

|
Google Oneindia TeluguNews

దేశంలో రాజ‌కీయంగా గాని మ‌రే ఇత‌రత్రా గాని సంచ‌నాలు జ‌ర‌గాలంటే అందులో తెలుగు రాష్ట్రాల భాగ‌స్వామ్యం త‌ప్ప‌కుండా ఉండాల్సిందే..! రాజ‌కీయంగా దేశంలో ప్ర‌జ‌ల ద్రుష్టిని ఆక‌ర్శించే సంఘ‌న‌లు ఎక్క‌డైనా జ‌రుగుతాయా అంటే ఆ సంఘ‌ట‌న‌తో తెలుగురాష్ట్రాల‌కు సంబంధాలు ఖ‌చ్చితంగా ఉంటాయి. ఇక అస‌లు విష‌యానికి వ‌ద్దాం. కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా చ‌క్రం తిప్పిన ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి 2014 ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఓట‌మి పాలైన వెంట‌నే అదికార బీజేపీ పార్టీలో చేరిపోయారు. ఇది అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా త‌యార‌య్యింది. త‌ర్వాత ఏపి బీజేపి లో జ‌రుగుతున్న ప‌రిణామాల ప‌ట్ల క‌ల‌త చెందుతున్న చిన్న‌మ్మ బీజేపికి రాంరాం చెప్పాల‌నే యోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

 చిన్న‌మ్మ ముందు చూపు..! అందుకే బీజేపికి దూరం..!!

చిన్న‌మ్మ ముందు చూపు..! అందుకే బీజేపికి దూరం..!!

విభ‌జ‌న‌తో ఆగ్ర‌హానికి లోనై కాంగ్రెస్ పార్టీని అదఃపాతాళానికి తొక్కేసిన ఏపి ప్ర‌జ‌లు విభ‌జ‌న హామీల అమ‌లు ప‌ట్ల మీన‌మేషాలు లెక్కిస్తోన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌ట్ల కూడా అంతే ఆగ్ర‌హంతో ఉన్నార‌ని చిన్న‌మ్మ‌కు నివేదిక‌లు అందాయ‌ట‌. దీంతో ఏపిలో కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగితే ఎంత న‌ష్టం జ‌రుగుతుందో బీజేపిలో కొన‌సాగితే అంత‌కు రెట్టింపు న‌ష్టం జ‌రుగుతుంద‌ని పురంధేశ్వ‌రి విశ్వ‌శిస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న రాజ‌కీయ భ‌విశ్య‌త్తు సజావుగా సాగాలంటే మ‌రో ప్ర‌త్యామ్నాయ పార్టీలోకి మారిపోవ‌డ‌మే అనే నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట చిన్న‌మ్మ‌. తెలుగుదేశం పార్టీతో జీవితకాల వైరుద్యం నేప‌థ్యంలో ఆ పార్టీ లో చేరే అవకాశాలు లేవు. ఇక ఏపీలో మిగిలింది వైయ‌స్ఆర్సీపి మాత్ర‌మే..! చిన్న‌మ్మ చూపులు కూడా వైయ‌స్ఆర్సీపి పైనే ఉన్న‌ట్టు చ‌ర్చ జ‌రుగుతోంది.

పార్టీ గుర్తింపునిచ్చినా ప్ర‌జ‌ల‌ముందు ప‌రాభ‌వం త‌ప్ప‌దు..!

పార్టీ గుర్తింపునిచ్చినా ప్ర‌జ‌ల‌ముందు ప‌రాభ‌వం త‌ప్ప‌దు..!

దీంతో భార‌తీయ‌జ‌న‌తాపార్టీకి త్వ‌ర‌లో ఊహించ‌ని షాక్ త‌గులబోతోంది. పైగా దానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ వేదిక కావ‌ట‌మే బీజేపీ నేతల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తున్న విష‌యం. ఔను ఏపీలో అధికారం సంగ‌తి ఎలా వున్నా క‌నీసం కొన్ని సీట్లు గెలిచి నిరూపించుకుంటే చాలంటూ టీడీపీ ఏనాడో బీజేపీకు స‌వాల్ విసిరింది. ఏపీ ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో టీడీపీ, బీజేపీ మ‌ధ్య పొత్తు చివ‌ర‌కు చేరింది. కొద్ది నెల‌ల క్రితం ఇద్ద‌రూ క‌టీఫ్ చెప్పుకున్నారు. దీంతో ఒక‌రిపై ఒక‌రు ప‌గ సాధించేందుకు అటు మోదీ, ఇటు చంద్రబాబునాయుడు ఇద్ద‌రూ ఎవ‌రి ఎత్తులు వారు వేసుకునే ప‌నిలో ఉన్నారు.

 బీజేపి అదినాయ‌కత్వానిది ఏక‌ప‌క్ష దోర‌ణి..! ఏపిలో వ‌ర్కౌట్ కాదు..!

బీజేపి అదినాయ‌కత్వానిది ఏక‌ప‌క్ష దోర‌ణి..! ఏపిలో వ‌ర్కౌట్ కాదు..!

ఏపీ బీజేపి అద్య‌క్ష‌ప‌ద‌విని ఆశించిన చిన్న‌మ్మ అది వ‌రించ‌లేద‌ని ఎక్క‌డా అసంత్రుప్తి వ్య‌క్తం చేయ‌లేదు. పైగా అదిష్టానం నిర్ణ‌యాన్ని స్వాగ‌తించినా లోలోప‌ల ఇబ్బందిర‌కంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. అస‌లు ఏపీ బీజేపి అద్య‌క్షుడిగా క‌న్నా ఎంపిక వెన‌క రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి. కాపు వ‌ర్సెస్ క‌మ్మ రాజ‌కీయాల్లో తాము ల‌బ్ది పొందాల‌నేది బీజేపీ వ్యూహంగా క‌నిపిస్తుంది. అయితే.. అప్ప‌టి నుంచి కాస్త బెట్టుగా ఉంటున్న పురేందేశ్వ‌రీ ఎక్క‌డా త‌న అయిష్టాన్ని వ్య‌క్తం చేయ‌లేదు. హోదా విష‌యంలో బీజేపీపై ఏపీలో పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌తో త‌మ‌కు రాజ‌కీయంగా భ‌విష్య‌త్ ఉండ‌ద‌నే ఆలోచ‌న‌తో ద‌గ్గుబాటి కుటుంబం వైసీపీలోకి మారాల‌నే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తుంది. దీనిపై ఇప్ప‌టికే వైసీపీ అధినేత జ‌గ‌న్ తో పాటు కొంద‌రు సీనియ‌ర్లు పురందేశ్వ‌రీ, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుతో ట‌చ్‌లో ఉన్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఏం చేసినా రాజ‌కీయ‌మే..! త‌ర్వాతే రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు..!!

ఏం చేసినా రాజ‌కీయ‌మే..! త‌ర్వాతే రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు..!!

ఇదే జ‌రిగితే, బీజేపీ నుంచి మ‌రికొంద‌రు నేత‌లు కూడా అటు వైసీపీ, ఇటు టీడీపీలోకి చేర‌వ‌చ్చ‌ని ప్రచారం సాగుతుంది. దీనివల్ల ప్ర‌కాశం జిల్లాలో వైసీపీ మ‌రింత బ‌లోపేతం కావ‌చ్చ‌నేది జ‌గ‌న్ వ్యూహం. గుంటూరు, కృష్ణాజిల్లాలో క‌మ్మ‌సామాజిక‌వ‌ర్గం ఓట్ల‌ను దండుకోవ‌చ్చనే ప్లాన్ కూడా ఉంద‌ట‌. కాపుల ఓట్లు దూర‌మ‌వుతున్న స‌మ‌యంలో క‌మ్మ వ‌ర్గం ఓట్ల‌ను ద‌గ్గ‌రు చేర్చుకోవ‌టం ద్వారా రెండింటి మ‌ధ్య స‌మ‌తూకం ఉంటుంద‌నేది జ‌గ‌న్ ఆలోచ‌న‌. ఈ లెక్క‌న పురందేశ్వ‌రీ వైసీపీలోకి చేర‌టం, క‌మ‌ల‌నాధుల‌కు కోలుకోలేని దెబ్బ‌గానే పార్టీ భావిస్తుంది.

English summary
ap bjp leader purandeswari again changing the party. ap people angry on congress for devising the state. now bjp denying to implement promises which was kept in the bifurcation act. so ap public treating both bjp and congress same. so purandeswari again wants to shift into ysrcp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X