వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో శాంతి భద్రతలు కనుమరుగు...ఎన్టీఆర్ బయోపిక్‌లు అలా ఉండొద్దు:పురందేశ్వరి;మాణిక్యాలరావు ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

తిరుపతి:ఆంధ్రప్రదేశ్ లోని టిడిపి ప్రభుత్వంపై బిజెపి మహిళా నేత పురంధేశ్వరి మండిపడ్డారు. ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. బుధవారం తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు కనుమరుగయ్యాయని ఆరోపించారు.

ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగితే కత్తి అంగుళం దిగిందా...అర అంగుళం దిగిందా అంటూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరైంది కాదని విమర్శించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు కనుమరుగయ్యాయని ఆమె ఆరోపించారు. బిజెపి నేత అమిత్‌ షా, కన్నా లక్ష్మీనారాయణలపై దాడి జరిగిందంటేనే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతమాత్రం అదుపులో ఉన్నాయో అర్దమవుతుందన్నారు. జగన్‌పై దాడి చేసిన వ్యక్తి మంచివాడంటూ పోలీసులే సర్టిఫికెట్లు ఇస్తున్నారన్నారు.

మోడీని...గద్దె దించలేరు

మోడీని...గద్దె దించలేరు

జగన్‌పై దాడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు ఏ మాత్రం సమంజసంగా లేదన్నారు. పైగా జగన్ పై దాడి చేసిన వ్యక్తి మంచివాడంటూ పోలీసులే సర్టిఫికెట్లు ఇస్తున్నారన్నారు. దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించే దిశగా ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని పురంధేశ్వరి కొనియాడారు. బీజేపీని ఓడించడం...మోడీని గద్దె దించడం ఎవరి వల్ల కాదన్నారు.

ఎన్టీఆర్ బయోపిక్‌లు...అలా ఉండకూడదు

ఎన్టీఆర్ బయోపిక్‌లు...అలా ఉండకూడదు

స్వామి పరిపూర్ణనంద ఇష్టపడే బీజేపీలో చేరారని ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయరని పురంధరేశ్వరి స్పష్టం చేశారు. తనను పార్టీ అధిష్టానం ఎక్కడ పోటీచేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని పురందేశ్వరి చెప్పారు. ఎన్టీఆర్‌ జీవితం తెరచిన పుస్తకమని, ఆయన గౌరవాన్ని దిగజార్చే విధంగా బయోపిక్‌లు ఉండకూడదని పురందేశ్వరి వ్యాఖ్యానించారు.

మాణిక్యాలరావు...మండిపాటు

మాణిక్యాలరావు...మండిపాటు

మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు ప్రభుత్వ అధికారులపై మండిపడ్డారు. మంగళవారం పెంటపాడు మండలం జట్లపాలెంలో సీసీ రహదారుల ప్రారంభం కోసం వచ్చిన ఆయనకు ఒక్క ఆర్ఐ మినహా గ్రామంలో అధికారులెవరూ ఆ కార్యక్రమానికి హాజరుకాకపోవడం ఆగ్రహం రప్పించింది. అలాగే వల్లూరుపల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమానికి కూడా ఇద్దరు అధికారులు మాత్రమే హాజరయ్యారు. దీంతో ప్రజా కార్యక్రమాలకు అధికారులు హాజరకాకపోవడం ఏమిటని తీవ్ర ఆగ్రహం చెందారు.

నా సంగతి...సిఎంకి తెలుసు

నా సంగతి...సిఎంకి తెలుసు

ఇది ప్రజల ప్రభుత్వమా లేక...పచ్చచొక్కాల ప్రభుత్వమా అంటూ విమర్శలు గుప్పించారు. ఎంఎల్‌ఏ గ్రామంలోకి వస్తే సంబంధిత అధికారులు లేకపోతే ప్రజలు అడిగే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు. కార్యక్రమానికి హాజరుకాని అధికారుల పేర్లను నమోదు చేయాలని పీఏకు సూచించారు. ఇది ఎంఎల్‌ఏ హక్కులకు భంగం కల్గించడమేనని, దీనిపై హక్కుల కమిటీలో ఫిర్యాదు చేస్తానన్నారు. ఇప్పటివరకూ మెత్తగా ఉండే మాణిక్యాలరావునే మీరు చూశారని, ఒకవేళ గట్టిగా ఉంటే ఎలా ఉంటానో మీకు తెలియదని, సీఎం చంద్రబాబుకు తెలుసని హెచ్చరించారు.

English summary
BJP leader Purandeswari blamed the TDP government in Andhra Pradesh. She strongly condemned the attack on the opposition leader Jagan. Speaking to the media in Tirupati on Wednesday, she said that the Law and order has been faded in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X