• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రాజధాని విషయంలో పురంధరేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు ... ఆమెదీ వైసీపీ నేతల మాటే !!

|
  అమరావతిపై పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు || Purandheshwari Interesting Comments On The AP Caital

  బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి రాజధాని అమరావతి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక రాజధానిగా అమరావతి ఉండాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్న తరుణంలో చాలా మంది రాజధాని వికేంద్రీకరణ జరగాలనే తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలా వ్యక్తం చేసిన నాయకులు వైసీపీ నుండే ఎక్కువ మంది ఉన్నారు. తాజాగా ఆ కోవలో కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నేత దగ్గుపాటి పురంధరేశ్వరి కూడా చేరిపోయారు. హైదరాబాద్‌ విషయంలో జరిగిన తప్పిదం మరోసారి రాజధాని విషయంలో జరగకూడదని సూచించారు దగ్గుపాటి పురంధరేశ్వరి .

  బురద చల్లటానికే ఇదంతా ... నిరూపిస్తే ఆ 493 ఎకరాలు రాసిస్తా అంటున్న బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్

   హైదరాబాద్ విషయంలో చేసిన తప్పు ఇప్పుడు ఏపీలో చెయ్యకూడదు అన్న పురంధరేశ్వరి

  హైదరాబాద్ విషయంలో చేసిన తప్పు ఇప్పుడు ఏపీలో చెయ్యకూడదు అన్న పురంధరేశ్వరి

  కడప జిల్లాలో పర్యటించిన పురంధేశ్వరి అభివృద్ధి వికేంద్రీకరణ చాలా అవసరమని చెప్పుకొచ్చారు. గతంలో కేవలం హైదరాబాద్ ను మాత్రమే అభివృద్ధి చెయ్యటం వల్ల రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు నష్టపోయాయని ఆమె అభిప్రాయపడ్డారు. అందుకే అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చేలా ఉంటె బాగుంటుంది అని ఆమె పేర్కొన్నారు. అందుకే రాజధాని వికేంద్రీకరణ అవసరం అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక ఏపీ సీఎం వైయస్ జగన్ సైతం అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనని తన మాట తమ నేతల నోట చెప్పిస్తున్నారు. తాజాగా పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు జగన్ నిర్ణయాలకు పరోక్షంగా మద్దతు పలికినట్లు అన్న భావన వ్యక్తం అవుతుంది .

  అధికార వికేంద్రీకరణ అవసరం అంటున్న బీజేపీ నేత పురంధరేశ్వరి

  అధికార వికేంద్రీకరణ అవసరం అంటున్న బీజేపీ నేత పురంధరేశ్వరి

  రాజధాని నిర్మాణం అంశంపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పిన పురంధేశ్వరి, ఈ విషయంలో కేంద్రం ఎలాంటి జోక్యం చేసుకోబోదు అని చెప్పుకొచ్చారు. నిధులు ఖర్చు చేశాక రాజధాని మార్పు చేయాలనుకోవడం భావ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. కానీ అధికార వికేంద్రీకరణ జరిగితేనే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి సాధిస్తాయని చెప్పారు.ఇక గత చంద్రబాబు ప్రభుత్వంప విమర్శలు గుప్పించిన పురంధరేశ్వరి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏటా నియోజకవర్గానికి రూ.50 కోట్లు ఇచ్చిందని తెలిపారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఆ నిధులను పక్కదారి పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నిధులను రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో నిధులు పక్క దారి పట్టాయని చెప్పిన ఆమె ప్రస్తుత ప్రభుత్వం వాటిపై దృష్టి సారించాలని అన్నారు.

  జగన్ సర్కార్ నిర్ణయానికి పురంధరేశ్వరి మద్దతు

  జగన్ సర్కార్ నిర్ణయానికి పురంధరేశ్వరి మద్దతు

  ఇక ఏపీలో బలమైన శక్తిగా బీజేపీ ఎదగడం ఖాయమని పురంధేశ్వరి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక బీజేపీకి దేశవ్యాప్తంగా పోటీ ఇవ్వగలిగే పార్టీ కాంగ్రెస్ అని అయితే అది కూడా ప్రస్తుతం సంక్షోభంలో ఉందన్నారు పురంధరేశ్వరి . రాహుల్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటే వయోభారంతో బాధపడుతున్న సోనియాగాంధీని పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారంటూ ఆమె ఎద్దేవా చేశారు . ఇక జగన్ ప్రభుత్వం ఇప్పటికే రాజధాని వికేంద్రీకరణ వైపు మొగ్గు చూపుతున్న నేపధ్యంలో రాజధాని వికేంద్రీకరణ జరగాలని హైదరాబాద్ లా తప్పు జరగకూడదని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో ఆసక్తికర చర్చకు కారణం అవుతున్నాయి .

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Daggupati purandhareshwari made interesting comments about capital Amravati. With the huge demand for Amravati to be the capital, many people are saying that the capital should be decentralized. Leaders who have expressed so much from the YCP. BJP leader Daggupati Purandareshwari has also in the same path of ycp .. she also expressed capital should be decentralized.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more