• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సాదినేని యామినికి బంపర్ ఆఫర్: వారణాశి కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్టులో ప్రతిష్ఠాత్మక పదవిలో

|

అమరావతి: భారతీయ జనాతా పార్టీ రాష్ట్రశాఖ నాయకురాలు సాదినేని యామినికి కీలక పదవి లభించింది. అత్యంత ప్రాచీనమైన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం వారణాశిలోని కాశీ విశ్వనాథ ఆలయానికి అధికార ప్రతినిధిగా నియమితులు అయ్యారు. సాక్షాత్ పరమ శివుడే కొలువయ్యాడని భావించే కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయ ట్రస్టు దక్షిణాది రాష్ట్రాల అధికార ప్రతినిధి బాధ్యతలను ఆమెకు అప్పగించారు. రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు, కర్ణాటక, కేరళ, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కాశీ విశ్వనాథుడి ఆలయ ప్రచార కార్యక్రమాలను ఆమె పర్యవేక్షించాల్సి ఉంటుంది.

తిరుమల తరహాలో దక్షిణాది రాష్ట్రాల్లో కాశీ విశ్వనాథుడి ట్రస్టు పరిధిలో ఉన్న ఆలయాల నిర్వహణ, ఆదాయ వ్యయాలు వంటి అంశాలను పర్యవేక్షించే బాధ్యతను సాదినేని యామినికి ఇచ్చారు. వారణాశికి వచ్చే భక్తుల సౌకర్యాల గురించి దక్షిణాది రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టాల్సి ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే.. దక్షిణాది నుంచి కాశీ విశ్వేశ్వరుడి దర్శనార్థం వారణాశికి వెళ్లే భక్తుల సంఖ్య తక్కువే. దీనికి కారణం- అక్కడ లభించే సౌకర్యాలపై సరైన అవగాహన లేకపోవడమేనని ఆలయ ట్రస్ట్ భావిస్తోంది.

BJP leader Sadineni Yamini appointed as Spoke Person for Varanasi Kashi Vishwanath TempleTrust

దీనిపై భక్తుల్లో సమగ్ర అవగాహన కల్పించడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి వారణాశికి వెళ్లే భక్తుల సంఖ్యను భారీగా పెంచడానికి వీలుగా అధికార ప్రతినిధిని నియమించాల్సి ఉంటుందంటూ ఇదివరకే ఆలయ ట్రస్టు బోర్డు సమావేశంలో తీర్మానించారు. ఈ మేరకు అధికార ప్రతినిధి పదవిలో సాదినేని యామినిని కూర్చోబెట్టారు. త్వరలోనే ఆమె బాధ్యతలను స్వీకరించబోతున్నారు. కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్టు పరిధిలో ఇప్పటిదాకా దక్షిణాది రాష్ట్రాల అధికార ప్రతినిధి అనే పోస్ట్ లేదు. కొత్తగా ఆ పోస్టును ఏర్పాటు చేశారు.

ఇదివరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగిన సాదినేని యామిని అనంతరం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తెలుగుదేశం పార్టీలో కొనసాగినన్ని రోజులు ఆమె క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుని పడేవారు. ఓ రకంగా టీడీపీ మహిళా నేతల్లో ఫైర్‌బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.

పుట్టినరోజు నాడే పొట్టనబెట్టుకున్న కరోనా: డీఎంకే ఎమ్మెల్యే కన్నుమూత: స్టాలిన్‌కు కుడిభుజంగా

  నిందితులను చంపకుండా... జైల్లో మటన్ పెట్టి మేపుతున్నారు!! || Oneindia Telugu

  ఎన్నికల తరువాత పరిస్థితులు తారుమారు అయ్యాయి. టీడీపీలో ఎక్కువరోజులు కొనసాగలేకపోయారు. ప్రత్యమ్నాయంగా బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన తరువాత క్రియాశీలక రాజకీయాల వైపు పెద్దగా కనిపించలేదు. పరిమిత సందర్భాల్లో తప్ప ఆమె ఎప్పుడూ జనం ముందుకు రాలేదు. తెరమరుగు అయ్యారని అనుకుంటోన్న లోపే.. ప్రతిష్ఠాత్మక పదవిని అందుకున్నారు. ప్రపంచంలోనే అతి ప్రాచీన నగరంగా.. పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోన్న కాశీ విశ్వనాథుడి ఆలయ ప్రతినిధిగా నియమితులు అయ్యారు.

  English summary
  Bharatiya Janata Party leader from Andhra Pradesh Sadineni Yamini appointed as Spoke Person for Varanasi Kashi Vishwanath TempleTrust. Spreading d temple activites and projects in Southern States.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X