వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందుకే వారిని విచారించలేదు: ప్రణయ్ హత్యపై బీజేపీ నేత, అమృతకు హామీ

|
Google Oneindia TeluguNews

మిర్యాలగూడ: నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో ప్రణయ్ కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర రావు పరామర్శించారు. ప్రణయ్ హత్య కేసు విషయమై కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.

అమృత వర్షిణి, ప్రణయ్ తల్లిదండ్రులను ఆయన పరామర్శించారు. ప్రణయ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కేతేపల్లి పోలీసు స్టేషన్లో ప్రణయ్‌ తండ్రి బాలస్వామికి వ్యతిరేకంగా తప్పుడు ఫిర్యాదు చేయించిన విషయంలో తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం హస్తముందని ఆరోపణలు రాగా, అతనిని పోలీసులు విచారించలేదని ఆరోపించారు.

అమృత వద్దకు నేతల క్యూ, ఆఫర్లు: ఏం సహకారం కావాలని కలెక్టర్ అడగ్గా..అమృత వద్దకు నేతల క్యూ, ఆఫర్లు: ఏం సహకారం కావాలని కలెక్టర్ అడగ్గా..

BJP leader Sankineni Venkateshwer Rao meets Pranay family

అమృతను అబార్షన్‌ చేయించుకోవాలని సూచించిన సోమా భరత్‌ కుమార్‌ను సైతం పోలీసులు విచారించలేదని చెప్పారు. వీరిద్దరు మంత్రి జగదీశ్వర్ రెడ్డి శిష్యులు కాబట్టే విచారణ చేయకుండా వదిలేశారని ఆరోపించారు. సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సంకినేని అమృతతో మాట్లాడటంతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో సెల్ ఫోన్లో మాట్లాడించారు.

Recommended Video

స్నేహితుడి కొడుకుతో పెళ్లి చేయాలని...!

English summary
BJP leader Sankineni Venkateshwara Rao meets Pranay family members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X