వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పై ఫైర్ అయిన విష్ణు కుమార్ రాజు.. గంటా బీజేపీలోకి వస్తే స్వాగతిస్తారట

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై బిజెపి నేత విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు పరిపాలన తెలియడం లేదని, ఏపీలో నిర్మాణరంగ కార్మికులు నానా ఇబ్బందులు పడుతూ పస్తులు ఉంటున్నా జగన్ కు పట్టడంలేదని ఆయన విమర్శించారు. ఒక్కరోజులోనే ప్రజావేదికను కూల్చిన శక్తి ఉన్నవాళ్లు ఇసుకను అందుబాటులోకి తీసుకు రాలేకపోతున్నారు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ అయినా దొరుకుతుంది కానీ జగన్ అపాయింట్మెంట్ మాత్రం దొరకడం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విష్ణుకుమార్ రాజు.

<strong>యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ ... యాగానికి స్థల పరిశీలన</strong>యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ ... యాగానికి స్థల పరిశీలన

70 రోజులు గడుస్తున్నా ఇసుక పాలసీ లేదు.. జగన్ అపాయింట్మెంట్ లేదు అన్న బీజేపీ నేత

70 రోజులు గడుస్తున్నా ఇసుక పాలసీ లేదు.. జగన్ అపాయింట్మెంట్ లేదు అన్న బీజేపీ నేత

ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు విమర్శలు గుప్పించారు. ఒక్క రోజులోనే అమరావతిలోని ప్రజావేదికను కూల్చేశారని, అధికారంలోకి వచ్చి 70 రోజులు గడుస్తున్నా ఇసుక విధానంపై నిర్ణయాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారని ఆయన జగన్ సర్కార్ ను ప్రశ్నించారు. ఇసుక లభించకపోవడంతో ఎంతో మంది భావన నిర్మాణ రంగ కార్మికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ
70 రోజుల్లో జగన్ అపాయింట్ మెంట్ కూడా దొరకలేదని ఆయన విమర్శించారు.

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అపాయింట్మెంట్ వెంటనే దొరికేదన్న విష్ణుకుమార్ రాజు

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అపాయింట్మెంట్ వెంటనే దొరికేదన్న విష్ణుకుమార్ రాజు

ఇది పరిపాలించే తీరు కాదని ఆయన విమర్శించారు. జగన్ తీరు సరైన పద్ధతి కాదని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏవైనా ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే ఒక్క రోజులోనే అపాయింట్ మెంట్ దొరికేదని తెలిపారు విష్ణుకుమార్ రాజు.ఎంతసేపటికి వైసీపీ సర్కార్ కాంట్రాక్టర్ లను టార్గెట్ చేస్తోందని, అవినీతి ఒక కాంట్రాక్టర్ల వల్లనే సాధ్యం కాదని, అధికారులు కూడా కుమ్మక్కయినడే అవినీతి సాధ్యపడుతుందని ఆయన పేర్కొన్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్ర అభివృద్ధి శూన్యం గా మారుతుందని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు.

గంటా సైలెంట్ గా ఉండకు .. బీజేపీలోకి రా అని ఆహ్వానించిన విష్ణుకుమార్ రాజు

గంటా సైలెంట్ గా ఉండకు .. బీజేపీలోకి రా అని ఆహ్వానించిన విష్ణుకుమార్ రాజు

జగన్ తీరు చూస్తుంటే ఆయనకు సరైన సలహాదారులు లేరు అనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. లేకుంటే ఇలాంటి తలాతోకాలేని నిర్ణయాలు తీసుకోరు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు టిడిపిలో ఉంటాడా పార్టీ మారతారా అన్న చర్చ జోరుగా జరుగుతున్న తరుణంలో గంటా శ్రీనివాసరావు గురించి విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓట్లు వేసిన విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ ప్రజలకు గంటా అందుబాటులో ఉండాలని ఆయన తన విన్నపాన్ని తెలియజేశారు. ఇలా సైలెంట్ గా ఉండకుండా ఏ పార్టీలో ఉంటారో గంటా త్వరగా తేల్చుకోవాలని సూచించిన విష్ణుకుమార్ రాజు బీజేపీలోకి వస్తే స్వాగతిస్తామని తెలిపారు.

English summary
BJP leader Vishnu Kumar Raju fired on Jagan Sarkar on 70 days has not decided on the sand policy. He was unable to find jagan's appointment in 70 daysWhenever Chandrababu said he would get an appointment inchandrababu's regime .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X