వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొత్తుకు మెలిక మైండ్ గేమ్: జగన్‌కు బిజెపి నేతల ఝలక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

బీజేపీతో కలిసినడుస్తాం, కానీ ఒక కండిషన్ !

అమరావతి: తమ పార్టీతో పొత్తుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన మెలిక ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకులకు రుచించనట్లు లేదు. ప్రత్యేక హోదా ఇస్తే బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమని జగన్ చెప్పిన విషయం తెలిసిందే.

జగన్ పెట్టిన మెలికపై బిజెపి సీనియర్ నేత దగ్గుబాటి పురంధేశ్వరి వెనువెంటనే ప్రతిస్పదించారు. ప్రత్యేక హోదా గురించి జగన్ మాట్లాడడం సరికాదని ఆమె అన్నారు. తాజాగా పలువురు బిజెపి నేతలు ప్రతిస్పందించారు.

 జగన్ మైండ్ గేమ్..

జగన్ మైండ్ గేమ్..

బిజెపితో కలిసి పనిచేస్తామని వైయస్ జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. అవినీతి పార్టీతో తాము ఎలా కలిసి పనిచేస్తామని ఆయన విశాఖపట్నంలో మంగళవారం మీడియా సమావేశంలో అన్నారు. టిడిపి, బిజెపి కలిసి పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు ఈ రెండు పార్టీలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాని ఆయన అన్నారు. జగన్ కావాలని మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

మంత్రి కామినేని ఇలా...

మంత్రి కామినేని ఇలా...

ఎపికి ప్రత్యేక హోదా ఇస్తా బిజెపితో కలుస్తానని జగన్ చేసన ప్రతిపాదినపై బిజెపి నేత, మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రతిస్పందించారు. అవినీతిపరుడైన జగన్‌తో బిజెపి కలిసే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. టిడిపి, బిజెపి కలిసినందుకే ప్రజలు మద్దతు ఇచ్చారని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని చెప్పారు .

 సోము వీర్రాజు ఇలా....

సోము వీర్రాజు ఇలా....

ప్రత్యేక హోదాతో ఎన్నికల పొత్తులు, రాజకీయాలు ముడిపడి ఉండవని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తే బిజెపితో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నానని జగన్ చెప్పిన విషయంపై ఆయన ప్రతిస్పందించారు. ప్రత్యేక హోదాను అనుసరించి పొత్తులుండవని, అయినా తాము టిడిపితోనే న్నామని, విడిపోలేదని ఆయన అన్నారు.

 భవిష్యత్తులో హోదా ఉండదని...

భవిష్యత్తులో హోదా ఉండదని...

భవిష్యత్తులో రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉండదని, కమిషన్ల సిఫార్సుల వల్ల ఇకపై ఆ ప్రయోజనాల రావని, హోదా ఇచ్చే కమిటీ ఇప్పుడు లేదనే విషయం గుర్తించాలని సోము వీర్రాజు అన్నారు. రోజూ పత్రికలు చదవేవారికి ఆ విషయం తెలుసునని అన్నారు. రాష్ట్రానికి మోడీ ఇచ్చిన హామీలన్నీ అమలవుతున్నాయని, హోదాను మించిన ప్యాకేజీ ఇస్తామని చెప్పి ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పటికే 4 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పారు. మరో రెండు మూడు నెలల్లో 2,3 వేల కోట్లు ఇస్తారనే సమాచారం ఉందని ఆయన అన్నారు. ఆ తర్వాత మరో 4 వేల కోట్లు ఇస్తామని అంటున్నట్లు తెలిపారు.

English summary
BJP leaders like Somu Veerraju, Kamineni Srinivas reacted on YSR Congress party president YS Jagan's proposal for alliance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X