• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సంచయితపై బహిష్కరణ వేటు!.. సీఎం జగన్ దెబ్బకు బీజేపీ విలవిల..

|

ఏపీలో సుప్రసిద్ధ సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా, కీలకమైన మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌(మాన్సాస్‌) ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా సంచయిత గజపతిరాజును నియమించడంపై రాష్ట్ర బీజేపీ మండిపడుతోంది. బీజేపీలో కీలక నేతగా ఉన్న సంచయితను రాత్రిరాత్రే వైసీపీ వైపు ఆకర్షించి.. అప్పటికప్పుడే జీవోలు జారీచేసిన సీఎం జగన్ తీరుపై కాషాయనేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించే దిశగా పావులు కదుపుతున్నారు. ఈ వ్యవహారంపై శుక్రవారం మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏం జరిగిందంటే..

ఏం జరిగిందంటే..

విజయనగరం జిల్లా రాజకీయాల్లో మొదటి నుంచీ ముఖ్యపాత్ర పోషిస్తోన్న పూసపాటి రాచకుటుంబంలో మాజీ ఎంపీ, దివంగత ఆనందజగపతిరాజు కూతురు సంచయిత వ్యవహారం కలకలం రేపింది. ఆనందజగజపతిరాజు సోదరుడు, ప్రస్తుత టీడీపీ నేత అశోక్ గజపతిరాజు ఇన్నాళ్లుగా సింహాచటం ఆలయానికి ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 15 సంవ్సతరాల సుదీర్ఘ విరామం తర్వాత సిహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలిని ప్రకటిస్తూ వైసీపీ సర్కారు గత నెల 20న 252 జీవో జారీచేసింది. అశోక గజపతికి కనీసం ఒక్కమాటైనా చెప్పకుండా ఈ పని చేసినందుకు అటు వైసీపీపై, ఇటు సంచయితపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆలోపే కీలకమైన మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా సంచయిత నియమిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వులివ్వడం పుండుమీద కారం చల్లినట్లయింది.

 రాజకీయ రాక్షసక్రీడ

రాజకీయ రాక్షసక్రీడ

పవిత్రమైన సింహాచలం దేవస్థానం కేంద్రంగా వైసీపీ రాజకీయ రాక్షసక్రీడ ఆడుతున్నదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఫైరయ్యారు. శుక్రవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అసలీ సంచయిత ఎన్నిసార్లు సింహాచలం గుడికి వెళ్లుంటుంది? పీవీజీ రాజు కాలం నుంచి జరుగుతున్న ప్రక్రియకు సీఎం జగన్ తూట్లు పొడిచారు. అర్ధరాత్రి జీవోల సంగతి పక్కనపెడితే.. ఆ పదవి చేపట్టడానికి తనకు అర్హత ఉందో లేదో సంచయిత ఆత్మ విమర్శ చేసుకోవాలి''అని మండిపడ్డారు.

హైకమాండ్‌కు ఫిర్యాదు

హైకమాండ్‌కు ఫిర్యాదు

బీజేపీలో కీలక నేతగా ఉన్న సంచయిత కనీసం పార్టీ నేతలకు కూడా సమాచారం ఇవ్వకుండా వైసీపీ ఆఫర్ ను అంగీకరించడం దారుణమని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఫైరయ్యారు. సంచయితను బీజేపీ నుంచి బహిష్కరించాలని, పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి వెంటనే ఆమెను తొలగించాలని కేంద్రానికి లేఖరాసినట్లు తెలిపారు. దేవాలయం భూముల్ని కబ్జా చేసేదుకే వైసీపీ ఈ తరహా నాటకానికి తెరలేపిందని, చైర్మన్ గా ఉన్న అశోక గజపతిరాజుకు కనీస సమాచారం ఇవ్వకుండా ఆ పదవిలో సంచయితను నియమించడాన్ని బీజేపీ ఖండిస్తున్నదని మాధవ్ అన్నారు.

  AP 3 Capitals : BJP Dharna Against Ap Capitals Creates High Tension || Oneindia Telugu
   సంచయిత చేరతారా?

  సంచయిత చేరతారా?

  ఏపీ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న సంచయిత రాత్రిరాత్రే వైసీపీ ఇచ్చిన ఆఫర్లను అంగీకరించడం, సింహాచలం దేవస్థానం, మాన్సాస్‌ ట్రస్టు పదవులు చేపడుతున్నట్లు రాష్ట్ర పార్టీకి సమాచారం కూడా ఇవ్వవకోపవడంపై నేతలు మండిపడుతున్నారు. సంచయిత అధికారికంగా వైసీపీలో చేరనప్పటికీ.. సీఎం జగన్ ఆదేశాలను పాటిస్తుండటం అనైతికమని, అంతగా పదవులు కావాలనుకుంటే ముందు పార్టీకి రాజీనామా చేయాల్సిఉందని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు.

  English summary
  bjp mlc madhav and ex mla vishnu kumar raju slams sanchaita gajapathi raju for taking charge of simhachalam temple trust and mansan trust. they said sanchayita will be expelled from bjp.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more