• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నిద్రపోయారా: 'హోదా'లోకి చిరంజీవిని లాగిన బీజేపీ మంత్రి మాణిక్యాల

|

విజయవాడ: ఏపీకి న్యాయం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, నాడు ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పెట్టనప్పుడు నాడు కేంద్రమంత్రులుగా ఉన్న చిరంజీవి, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిద్రపోయారా అని మంత్రి, బీజేపీ నేత మాణిక్యాల రావు ప్రశ్నించారు.

ఏం మీకు బాధ్యత లేదా, 2గం.లు ఆలోచించు, చూసుకుంటాం!: మోడీకి బాబుఏపీకి ప్రత్యేక హోదా పైన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం నాడు రాజ్యసభలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఏపీకి హోదా రాదని ఆయన వ్యాఖ్యల ద్వారా తెలిసింది. దీనిపై విపక్ష వైసిపి, కాంగ్రెస్‌లు బీజేపీపై మండిపడ్డాయి. టిడిపి కూడా బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో మంత్రి మాణిక్యాల రావు ఆదివారం నాడు మాట్లాడారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా గురించి కాంగ్రెస్ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. చట్టంలో హోదా అంశాన్ని చేర్చనప్పుడు ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. ఆ సమయంలో చిరంజీవి, ఇతర కాంగ్రెస్ నేతలు నిద్రపోయారా అన్నారు. తమ ప్రభుత్వం ఏపీ పట్ల చిత్తశుద్ధితో ఉందన్నారు. యూపీఏ ద్వంద్వ వైఖరితో విభజన చేసిందని ఆరోపించారు.

BJP Minister drags Chiranjeevi into Special Status issue

బీజేపీ మరిచిందా: సీతారాం ఏచూరీ

ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ నాడు చెప్పిందని, ఇప్పుడు ఆ విషయాన్ని మరిచిపోయిందా అని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ ప్రశ్నించారు. అనాలోచితంగా ఏపీని విభజించారని, కాబట్టే నానాటికీ సమస్యలు పెరుగుతున్నాయన్నారు.

పర్యవసానాల గురించి ఆలోచించకుండా విభజిస్తున్నారని తాము ఆనాడే చెప్పామన్నారు. అయినా తమ మాట పట్టించుకోలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. తామే అధికారంలోకి వస్తామని, పదేళ్లు ప్రత్యేక హోదా అమలు చేస్తామని ఎవ్వరూ కోరకుండానే బీజేపీ నేత వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారన్నారు.

విభజన జరిగి రెండేళ్లు గడిచినా ఆనాడు ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయడం లేదన్నారు. కేంద్రంలో బీజేపీతో కలవడం వల్ల ప్రత్యేక హోదా వస్తుందని చంద్రబాబు భావించారని, అందుకే ఎన్నికల్లో ఆ పార్టీతో జతకట్టారన్నారు.

టిడిపి దూరమైతే..: బాబు హెచ్చరికతో మోడీ అప్రమత్తం, దిద్దుబాట!విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను బీజేపీ అమలు చేయాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సీపీఎం పోరాడుతుందన్నారు. పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ.. పార్లమెంటులో రెండు రోజుల చర్చ వల్ల ఏపీకి ప్రత్యేక హోదాపై రాజకీయ పార్టీల అసలు రంగు బయట పడిందన్నారు.

ప్రజలు కూడా బయటకు రావాలని, హోదా కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రజలు పోరాడితే తప్ప కేంద్రం మాట వినదన్నాపు, బంద్‌కు ప్రజల నుంచి భారీగా స్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంతో చంద్రబాబు ఇంకెన్ని రోజులు చర్చిస్తారని, చర్చల పేరు చెప్పి ఎన్నాళ్లు మోసం చేస్తారన్నారు.
ప్రజాగ్రహానికి గురవుతామని భయపడే ఇప్పుడైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారన్నారు.

English summary
BJP Minister Manikyala Rao drags Chiranjeevi into Special Status issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X