వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ మంత్రుల రాజీనామా: 3 ని.ల్లో మాణిక్యాలరావు, సీఎంతో కామినేని, ఆలింగనాలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

BJP ministers resigned from Chandrababu Naidu's Cabinet

అమరావతి: ఏపీ బీజేపీ మంత్రులు పైడికొండల మాణిక్యాల రావు, కామినేని శ్రీనివాస్‌లు గురువారం ఉదయం తమ పదవులకు రాజీనామా సమర్పించారు. వారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తమ రాజీనామా పత్రాలను అందించారు.

ఓపికపడుతున్నా, మీరే అన్నారుగా.. ఇప్పుడేం చేశావ్: మోడీకి బాబు డెడ్‌లైన్, విష్ణు కౌంటర్ఓపికపడుతున్నా, మీరే అన్నారుగా.. ఇప్పుడేం చేశావ్: మోడీకి బాబు డెడ్‌లైన్, విష్ణు కౌంటర్

ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాణిక్యాల రావు తన మంత్రి పదవికి రాజీనామా చేసి మూడు నిమిషాల్లో బయటకు వచ్చారు. కామినేని శ్రీనివాస రావు మాత్రం రాజీనామా చేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి చాంబర్‌లో కాసేపు ఉన్నారు.

 ఆలింగనం చేసుకున్న టీడీపీ నేతలు, మంత్రులు

ఆలింగనం చేసుకున్న టీడీపీ నేతలు, మంత్రులు

మంత్రులు మాణిక్యాల రావు, కామినేనిలు రాజీనామా చేసిన సమయంలో టీడీపీ మంత్రులు వారిని ఆలింగనం చేసుకొని వీడ్కోలు పలికారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము రాజీనామా చేయక తప్పని పరిస్థితి వచ్చిందని వారు వెల్లడించారు.

 బీజేపీని, వెంకయ్యను దోషిగా చూపే ప్రయత్నం

బీజేపీని, వెంకయ్యను దోషిగా చూపే ప్రయత్నం

విభజన హామీల కోసం నాడు రాజ్యసభలో పోరాడిన వెంకయ్య నాయుడిని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పదవికి రాజీనామా చేసిన మాణిక్యాల రావు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీని కూడా దోషిగా చూపిస్తున్నారన్నారు.

టీడీపీ బయటకు వచ్చింది కాబట్టి మేం

తెలుగుదేశం పార్టీ కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకుంటుందని, అందుకే తాము తప్పుకోవాల్సి వచ్చిందని మాణిక్యాల రావు చెప్పారు. ప్రత్యేక హోదా బదులు ఏపీకి ప్యాకేజీ ఇస్తామని ప్రకటించామని, ఏపీని ఆదుకుంటామని చెబుతున్నామన్నారు.

 ఎలాంటి బాధ లేదన్న కామినేని

ఎలాంటి బాధ లేదన్న కామినేని

తాను పదవి నుంచి తప్పుకుంటున్నందుకు ఎలాంటి బాధ లేదని కామినేని శ్రీనివాస రావు చెప్పారు. పదవుల నుంచి గౌరవంగా తప్పుకోవడం సంతోషకరమని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీ మధ్య విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే.

English summary
Andhra Pradesh BJP Ministers pydikondala manikyala rao, kamineni srinivas submitted resignation letter to AP CM Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X