వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం కేంద్ర ప్రాజెక్టు, ఢిల్లీలో ఎందుకు: చంద్రబాబుకు ఆకుల కౌంటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: పోలవరం ప్రాజెక్టు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు అని బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అన్నారు. నిధుల విషయంలో ఎలాంటి సమస్య లేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారని గుర్తు చేశారు. ఏదైనా సమస్య ఉంటే కేంద్రానికి చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు హితవు పలికారు.

భూసేకరణ ఖర్చు ఎందుకు రెట్టింపు అయిందో చెప్పాలని ప్రశ్నించారు. డ్యాం పొడవు, వెడల్పు పెరగనప్పుడు ఖర్చు ఎందుకు పెరిగిందో చెప్పాలని నిలదీశారు. సచివాలయాన్ని ఢిల్లీలో పెట్టడం ఎందుకని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం పాజిటివ్‌గా ఉంటే చంద్రబాబు నెగిటివ్‌గా ఆలోచిస్తున్నారని చెప్పారు.

పోలవరంపై బాబుకు కన్నా ఊహించని షాక్: గడ్కరీ సందర్శన, టీడీపీXబీజేపీపోలవరంపై బాబుకు కన్నా ఊహించని షాక్: గడ్కరీ సందర్శన, టీడీపీXబీజేపీ

BJP MLA Akula Satyanarayana counter to CM Chandrababu

ఇదే స్ఫూర్తి కొనసాగించాలి: మంత్రి

సమిష్టిగా పనిచేస్తూ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తోన్న ఆ శాఖ అధికారులు ముందు ముందు కూడా ఇదే స్ఫూర్తితో పని చేయాలని మంత్రి అమర్నాథ్ రెడ్డి సూచించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో ఏపీకి ప్రథమ స్థానం దక్కడంతో.. పరిశ్రమలశాఖ అధికారులు సచివాలయంలో మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చారు.

ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి మాట్లాడారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో ఏపీకి అగ్రస్థానం దక్కడంలో అధికారులు చేసిన కృషి ఎంతో ఉందన్నారు. సీఎం చంద్రబాబు ఆలోచనలకు తగినట్లు పనిచేస్తూ పారిశ్రమిక ప్రగతికి సహకరించారన్నారు. ఇదే స్ఫూర్తితో పని చేయాలన్నారు.

English summary
BJP MLA Akula Satyanarayana counter to Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu over Polavaram project issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X