• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆ విషయంలో ఏపీ ప్రభుత్వం ఫెయిల్... బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు

|

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లు పెరిగిపోయారని, ఎంతో విలువైన ఎర్రచందనం సంపదను రక్షించుకోవడంలో, స్మగ్లర్స్‌ను కట్టడి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. స్మగ్లర్లు రోజురోజుకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారని... అధికారులపై దాడులకు దిగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం‌లేదని మండిపడ్డారు. ఆదివారం(ఏప్రిల్ 4) ఉదయం వీఐపీ విరామ సమయంలో రఘునందన్ రావు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

శ్రీవారి హుండీ ద్వారా వస్తున్న ఆదాయంలో 10 శాతం కూడా టీటీడి హిందూ ధర్మ పరిరక్షణకు కేటాయించకపోవడం భాధాకరమని రఘునందన్ రావు అన్నారు. హిందూ ధర్మప్రచారంపై టీటీడి దృష్టి సారించకపోతే.. తిరుపతి, పరిసర ప్రాంతంలో పెరుగుతున్న అన్యమత ప్రచారానికి టీటీడీనే భాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పురాతన దేవాలయాలను టీటీడీ ఆధీనంలోకి తీసుకుని వాటిలో ధూపధీప నైవేద్యాలు నిర్వహించాలన్నారు. ఆ ఆలయాల పరిరక్షణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. టీటీడీ పాలక మండలి ఇకనైనా హిందూ ధర్మ ప్రచారానికి ప్రాధాన్యమివ్వాలని కోరారు.

తన నియోజకవర్గంలో ఇల్లు లేని పేదవాడు ఉండకూడదని.. ప్రతీ ఒక్కరికి సొంత ఇల్లు నిర్మించే శక్తినివ్వాలని శ్రీవారిని వేడుకున్నట్లు రఘునందన్ రావు తెలిపారు. అంతకుముందు,శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు రఘునందన్ రావు‌కు వేద ఆశీర్వాదం అందించారు. పట్టు వస్త్రాలతో ఆయన్ను సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

bjp mla raghunandan rao slams ysrcp government over red sandal smuggling issue

ఈ నెల 17న తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక నేపథ్యంలో ప్రస్తుతం రఘునందన్ రావు బీజేపీ తరుపున అక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. శనివారం(ఏప్రిల్ 2) తిరుపతిలో ప్రచారం సందర్భంగా రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. 'తెలంగాణ ఉద్యమాన్ని మట్టికరిపించి, జైశ్రీరామ్‌ నినాదాన్ని సిద్ధిపేట నుంచి తిరుపతికి తీసుకొచ్చాం' అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నెటిజన్ల నుంచి రఘునందన్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే,ఆదివారం(ఏప్రిల్ 3) తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. శేషచలం అడవుల్లో ఎర్రచందనాన్ని స్మగ్లర్స్ ఇష్టమొచ్చినట్లు దోచుకుంటున్నారని పవన్ అన్నారు.అక్కడ కూల్చే ప్రతీ ఎర్రచందనం చెట్టు.. వైసీపీ పతనానికి మెట్టు అని అభివర్ణించారు.

English summary
Telangana BJP MLA Raghunandan Rao has criticized that AP govt failing to curb red sandalwood smuggling in Seshachalam forests. He said YSRCP government had failed to protect the valuable red sandalwood wealth and crack down on smugglers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X