రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిజెపికి ఎమ్మెల్యే షాక్ : జ‌న‌సేన లో ఎంట్రీ ఖాయం..!

|
Google Oneindia TeluguNews

ఏపి బిజెపి లో షాకింగ్ ప‌రిణామం. బిజెపి వాయిస్ బ‌లంగా వినిపించే ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌నారాయ‌ణ పార్టీకి రాజీనా మా చేసారు. నేరుగా త‌న రాజీనామా లేఖ‌ను పార్టీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా కు అంద‌చేసారు. ఇక‌, ఆయ‌న ఏపి లో జ‌న‌సేన నుండి బ‌రిలోకి దిగాల‌ని భావిస్తున్నారు. ఆ పార్టీలో అధికారికంగా చేర‌ట‌మే మిగిలింది.

ఏపి కి బిజెపి అన్యాయం చేసింద‌ని టిడిపి..ఏపికి టిడిపి అన్యాయం చేస్తుంద‌ని బిజెపి ఆరోప‌ణ‌లు చేసుకుంటూ.. రోడ్ల పై పోరాటాల‌కు దిగుతున్న స‌మయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే బిజెపి ని వీడారు. రాజ‌మండ్రి బిజెపి ఎమ్మెల్యేల ఆకుల స త్య నారాయ‌ణ పార్టీకి రాజీనామా చేసారు. త‌న రాజీనామా లేఖ‌ను నేరుగా బిజెపి జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా కు అం ద‌చేసారు. కొంత కాలంగా జ‌రుగుతున్న ప్ర‌చారం ఇప్పుడు నిజ‌మైంది. దీంతో..ఆకుల రాజ‌నామా విష‌యంలో పార్టీ అధినేత సైతం పెద్ద‌గా రియాక్ట్ అవ్వ‌లేద‌ని స‌మాచారం. ఇక‌, రాష్ట్ర స్థాయిలోని బిజెపి నేత‌లు సైతం ఆకుల రాజీనా మా పై స్పందించ లేదు. ఆకుల రాజీనామా పై కొంత కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న పార్టీని వీడ‌టానికి సిద్ద ప‌డుతున్నార‌ని..కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మ‌రో పార్టీలో చేర‌టానికి స‌ద్ద‌మ‌య్యార‌ని ప్ర‌చార సారాంశం.

BJP MLA resigned : ready to join in Janasena..

జ‌న‌సేన లోకి ఎంట్రీ..

ఆకుల సత్యనారాయణ బీజేపీలో ఉండగానే ఆయన సతీమణి జనసేనలో పనిచేస్తున్నారు. గతకొద్ది రోజులుగా సత్య నారాయణ జనసేనలో చేరతారని ప్రచారం రుగుతున్నా..ఇప్పుడు అది నిజ‌మ‌య్యే ప‌రిస్థితి కనిపిస్తోంది. ఆకుల దం పతుల్లో ఒకరికి ఎంపీ, మరొకరికి ఎమ్మెల్యే సీటు ఖాయమైనట్లు వార్తలు వినవస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుంచి స్పష్టమైన హామీ రావడంతోనే ఆయన బీజేపీకి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. కాగా త్వరలోనే ఆయన పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకుంటారని సమాచారం. దీంతో..మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇప్ప‌టికే కామినేని శ్రీనివాస్ పార్టీలోనే ఉన్నా..యాక్టివ్ గా ఉండ‌టం లేదు. పార్టీ ఫ్లోర్ లీడ‌ర్ విష్ణు కుమార్ రాజు సైతం పార్టీని వీడ‌టానికి సిద్ద‌ప‌డుతున్నారు. మాణిక్యాల రావు మాత్రం పార్టీ వాయిస్ బ‌లంగా వినిపిస్తున్నారు.

English summary
AP BJP sitting MLA Akula Satyanarayana resigned to party. He submitted his resignation letter to Party chief Amit Shah in Delhi. He ready to join in Janasena shortly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X