వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి అఖిలప్రియను బర్తరఫ్‌ చేయండి:బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ డిమాండ్

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:టిడిపి నేతలు దిగజారుడు మాటలతో ప్రధాని మోడీని దూషిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ మండిపడ్డారు. ప్రధాని మోడీని ఉద్దేశించి రాష్ట్ర మంత్రి అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఎమ్మెల్సీ మాధవ్ న్యూ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

ప్రధాని మోడీయే మహిళలపై అత్యాచారాలు ప్రోత్సహిస్తున్నారంటూ మంత్రి అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలతో సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్సీ మాధ్ అన్నారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కూడా ప్రధాని గురించి ఇంత దారుణంగా ఎప్పుడూ ఇలా మాట్లాడలేదన్నారు. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అఖిల ప్రియను వెంటనే మంత్రివర్గం నుంచి తొలిగించాలని డిమాండ్‌ ఎమ్మెల్సీ మాధవ్ డిమాండ్ చేశారు.

BJP MLC demanded for Minister Akhila Priya Dismissal

ఆంధ్రప్రదేశ్ లో టిడిపి ప్రభుత్వం నిరంకుశంగా పరిపాలిస్తోందన్నారు. రాష్ట్రంలో పరిస్థితులకు బాధ్యుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేయాల్సిన సమయం వచ్చిందని ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. ఎపిలో ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులను కూడా రాజకీయాల కోసం వాడుకుంటున్నారని మాధవ్ ఆరోపించారు. కేంద్రం పై నిరాధార ఆరోపణలు చేస్తున్నా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటునిస్తోందని ఎమ్మెల్సీ మాధవ్ చెప్పుకొచ్చారు.

ఇలీవలే భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం చేసిన విషయం మాధవ్ గుర్తు చేశారు. 2014లో చంద్రబాబుకు బీజేపీ మద్దతిచ్చి తప్పు చేసిందని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ అభిప్రాయపడ్డారు.

English summary
NEW DELHI: BJP MLC Madhav has said that the TDP leaders are blaming Prime Minister PM Modi. He was angry with the comments made by the AP Minister Akhila Priya on Modi. On Tuesday, MLC Madhav spoke to the media in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X