విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రధాని మోడీపై చంద్రబాబు వ్యాఖ్యలు అత్యంత హేయం...విపత్తు కూడా ప్రచారాస్త్రామా?:

|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం:తిత్లీ తుఫాన్‌ సహాయక కార్యక్రమాలను కూడా అట్టహాసంగా ప్రచార ఆర్భాటంతో చేస్తూ...విపత్తును కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారాస్త్రంగా మార్చుకున్నారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ దుయ్యబట్టారు.

ఆదివారం ఆయన విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడుతూ తుఫాన్‌ను కూడా రాజకీయాలకు వాడుకోవడం సరికాదన్నారు. మరోవైపు ప్రధాని మోడీను దోషిగా నిలబెట్టేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీజేపీ ఏపీ ఎమ్మెల్సీ మాధవ్‌ ఆరోపించారు. ప్రధాని మోదీపై చంద్రబాబు వ్యాఖ్యలు అత్యంత హేయమైనవని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి తన స్థాయిని దిగజార్చి మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.

చంద్రబాబు...వ్యాఖ్యలు అబద్దం

చంద్రబాబు...వ్యాఖ్యలు అబద్దం

ప్రధాని మోడీపై సిఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ పర్యటించలేదని, తుఫాను సాయాన్ని కేంద్రం అడ్డుకుంటోందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు ఏ మాత్రం నిజం కాదన్నారు. తుఫాను వచ్చిన వెంటనే బీజేపీ ఏపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు ఆధ్వర్యంలో ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించామని, ఆ నివేదిక ప్రధానికి కూడా అందజేశామని మాధవ్ చెప్పుకొచ్చారు.

అప్పుడు గాడిదలు కాస్తున్నారా?...అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంపై బిజెపి కుట్ర:కుటుంబరావు అప్పుడు గాడిదలు కాస్తున్నారా?...అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంపై బిజెపి కుట్ర:కుటుంబరావు

ప్రజలు...తిట్టుకుంటున్నారు

ప్రజలు...తిట్టుకుంటున్నారు

సిఎం చంద్రబాబు తుఫాను బాధితులకు అందించిన సాయాన్ని పెద్ద పెద్ద హోర్డింగ్స్ రూపంలో ప్రచారం చేసుకోవటాన్ని ప్రజలు తిట్టుకుంటున్నారని మాధవ్ ఎద్దేవా చేశారు. తుఫాను సాయం పచ్చజెండా పట్టుకొని...పచ్చ కండువాను కప్పుకున్నవారికే అందుతోందని ఆయన ఆరోపించారు. పార్టీలకు అతీతంగా తుఫాను బాధితులకు సహాయం చేయాలని మాధవ్ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అది...నీచమైన ఆలోచన

అది...నీచమైన ఆలోచన

పలాస వంటి కొన్ని ప్రాంతాల్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి టాంకర్లు మాత్రమే బాధితులకు నీరు పంపిణీ చేసేందుకు తిరగాలని నిబంధన విధించడం నీచమైన ఆలోచన అని మాధవ్ మండిపడ్డారు. తిత్లీ తుఫాను బాధితులను కేంద్రం ఉదారంగా ఆదుకుంటోందని, తల్చేర్-కోలార్ విద్యుత్ లైన్ పునరుద్ధరించి 24 గంటల్లో విద్యుత్‌ను కేంద్రం అందించిందని మాధవ్ గుర్తుచేశారు. రాజాం-పలాస 400 కేవీహెచ్‌వీ లైన్‌ను రేపటికల్లా పునరుద్ధరిస్తామన్నారు.

కేంద్ర బృందం...త్వరలో వస్తుంది

కేంద్ర బృందం...త్వరలో వస్తుంది

సోమవారం కేంద్ర హార్టికల్చర్ బోర్డ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుందని, జీడీ, కొబ్బరి, వంటి పంట నష్టాలను పరిశీలిస్తుందని మాధవ్ వెల్లడించారు. అలాగే తితలీ తుఫాన్‌ నష్టం అంచనాకు త్వరలోనే కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తుందని, అలాగే కేంద్ర సాయం ఆలస్య

English summary
Vishakapatnam:BJP MLC Madhav criticized that AP CM Chandra babu made Titli Thophan relief works with Massive Campaigning is very bad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X