వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు కౌంటర్: గవర్నర్‌కు ఫిర్యాదు, ఆ లేఖకు సమాధానమేదీ, ఒంటరిగా గెలిచారా?: మాధవ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:ప్రధానమంత్రి నరేంద్రమోడీపై, బిజెపిపై విమర్శలు చేసేందుకు అసెంబ్లీని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఉపయోగించుకొంటున్నారని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు.ఈ విషయమై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.

గురువారం నాడు ఎమ్మెల్సీ మాధవ్ అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఏపీ అసెంబ్లీలో కొన్ని రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బిజెపిపై విమర్శలు గుప్పిస్తున్నారని మాధవ్ గుర్తు చేశారు.

కొన్ని రోజులుగా ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకొంటున్న పరిణామాలపై ఏపీ అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలు కేంద్రంపై ఘాటుగా ఉంటున్నాయి. అయితే బిజెపి నేతలు కూడ టిడిపి నేతలకు సమాధానమిచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రధానిపై విమర్శలకే బాబు ప్లాన్

ప్రధానిపై విమర్శలకే బాబు ప్లాన్

ఏపీ అసెంబ్లీని వేదికగా చేసుకొని ప్రధాన మంత్రి మోడీపై నిందలు వేసేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ అభిప్రాయపడ్డారు. ప్రధాన మంత్రిపై, బిజెపిపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.ఏపీకి నిధులు కేటాయించినా.. నిధులు కేటాయించలేదంటూ టిడిపి నేతలు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు.

ప్రత్యేక ప్యాకేజీ నిధుల ఆలస్యానికి రాష్ట్రమే కారణం

ప్రత్యేక ప్యాకేజీ నిధుల ఆలస్యానికి రాష్ట్రమే కారణం


ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ నిధులు రావడానికి ఆలస్యమైందని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ ఒప్పుకొన్నారు. అయితే ఈ నిధులు ఆలస్యం కావడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ఆయన చెప్పారు.కేంద్రం సూచించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించలేదని ఆయన అభిప్రాయపడ్డారు .

అమిత్ షా లేఖకు సమాధానం చెప్పాలి

అమిత్ షా లేఖకు సమాధానం చెప్పాలి

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాసిన లేఖకు సమాధానం ఇవ్వాలని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడును డిమాండ్ చేశారు.
.అమిత్ షా లేఖకు సమాధానం ఇవ్వకుండా డొంక తిరుగుడుగా టిడిపి నేతలు మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.ఎన్డీఏ నుండి వైదొలిగిన సమయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు రాసిన లేఖకు సమాధానంగా అమిత్ షా కూడ ఇటీవలే ఓ లేఖ రాశారు. బిజెపిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాధవ్ ఆరోపించారు.

గవర్నర్‌కు ఫిర్యాదు

గవర్నర్‌కు ఫిర్యాదు


ఉద్దేశ్యపూర్వకంగానే బిజెపిపై, ప్రధాన మంత్రి మోడీపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శలు చేస్తున్నారని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి మోడీ, బిజెపిపై విమర్శలు చేసుకోవడానికి అసెంబ్లీని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వేదికగా ఉపయోగించుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ విషయమై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.ఈ విషయమై స్పీకర్ ఎందుకు ఏపీ సీఎం ను అనుమతిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

ఒంటరిగా టిడిపి గెలవలేదు

ఒంటరిగా టిడిపి గెలవలేదు

ఏపీ రాష్ట్రంలో ఏనాడూ కూడ టిడిపి ఒంటరిగా విజయం సాధించలేదని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ ఎద్దేవా చేశారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 1999లో ఆనాడు రాష్ట్రంలో టిడిపి విజయంలో బిజెపి కీలకపాత్ర పోషించిందని ఆయన చెప్పారు. మరోవైపు 2014 ఎన్నికల్లో కూడ ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి రావడానికి కూడ బిజెపి కారణమన్నారు. ఒంటరిగా పోటీ చేసి ఏనాడు కూడ ఆ పార్టీ విజయం సాధించలేదన్నారు.ఎన్నికల హమీలను అమలు చేయలేకే బిజెపిపై టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు విమర్శలు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
BjP MLC Madhva responded on Ap CM Chandrababunaidu allegations on Bjp. He made allegations on Ap chief minister Chandrababunaidu on Thursday. He spoke to media at Amaravathi on Thursday. He condmned allegations on Prime minister Modi .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X