వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీని టిడిపి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లా వాడుతోంది:బిజెపి ఎమ్మెల్సీ మాధవ్

|
Google Oneindia TeluguNews

విజయవాడ:ఎపికి అన్యాయంపై టిడిపి-బీజేపీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. తాజాగా బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో టిడిపి పై విమర్శనాస్త్రాలు సంధించారు.శాసన సభలో ప్రధాని మంత్రి క్లిప్పింగ్స్ చూపించడం సభ మర్యాదలు ఉల్లంఘించడమేనని మాధవ్ విమర్శించారు.శాసన సభను టీడీపీ వారు స్వప్రయోజనాల కోసం, స్వార్ధ రాజకీయాలు కోసం వాడుకుంటున్నారని...

అసెంబ్లీ ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లా ఉపయోగించు కుంటున్నారని మాధవ్ ధ్వజమెత్తారు. మీ ప్రధాన మంత్రి అంటూ సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలను తీవ్రగా పరిగణిస్తున్నామని అన్నారు.చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని...సభలో లేని ప్రధాన మంత్రి, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురించి ఇప్పుడు అక్కడ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు.

 BJP MLC Madhavs Sensational Comments on TDP

చంద్రబాబు ప్రత్యేక హోదాపై అనేక సందర్భంల్లో మాట మార్చిన విధానాన్ని వీడియో క్లిప్పింగ్స్ రూపంలో అసెంబ్లీలో తాము ప్రదర్శించడానికి అనుమతి ఇస్తారా?...అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాట మార్చిన వీడియో క్లిప్పింగ్స్, అలాగే

రుణమాఫీ, పిరాయిపులపై గతంలో చంద్రబాబు మాట్లాడినవి...ఇప్పుడు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ మీడియాకు ప్రదర్శించి చూపించారు. చంద్రబాబు పిరాయిపు రాజకీయాలపై గవర్నర్ కు పిర్యాదు చేస్తామని చెప్పారు.చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం పరిస్థితి కి తగ్గట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని,

హోదా కన్నా ప్యాకేజీనే బెటర్ అన్న సీఎం చంద్రబాబే ఇప్పడు బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.బీజేపీ వలన 15 సీట్లు కోల్పోయామంటున్న చంద్రబాబు గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన సంగతి మర్చిపోయారా అని ఎద్దేవా చేశారు.అసలు చంద్రబాబు పొత్తు లేకుండా ఒంటరిగా గెలిసిన చరిత్ర ఎన్నడూ లేదన్నారు...ఎన్నికల్లోఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని, దీంతో తనపై ఉన్న ప్రజా వ్యతిరేకతను మళ్ళిచేందుకు బీజేపీపై విమర్శలు చేస్తున్నారని మాధవ్ చెప్పారు.

అసలు అమిత్ షా లేఖను ఎలా అసెంబ్లీలో ఎలా ప్రస్తావిస్తారని...షా ప్రశ్నల కు సీఎం సమాధానం చెప్పకుండా ప్రజలపై దాడిగా అభివర్ణించడం సిగ్గు చేటన్నారు.బీజేపీకి ఇచ్చిన సీట్ల లో రెబెల్స్ ను నిలబెట్టారని...టీడీపీ మిత్ర ధర్మానికి వెన్నుపోటు పొడిచిందన్నారు.ప్రజల నుంచి డబ్బులు తీసుకొని బ్యాంక్ ల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తారని ప్రశ్నించారు...కాల్ మని సెక్స్ రాకెట్ లో ఇలాగే ఎక్కువ డబ్బులు ఇస్తామని ప్రజల నుంచి డబ్బులు తీసుకొని టీడీపీ నాయకులు మోసం చేశారని ఆరోపించారు.ప్రత్యక హోదా అనేది ముగిసిన అధ్యాయమని...ఇటీవలి కాలంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు.

English summary
Vijayawada:BJP MLC Madhav criticised the comments made by Andhra Pradesh chief minister N Chandrababau Naidu here today. Madhav mentioned that the ruling party was silencing the opposition parties by not allowing them to speak in state assembly. The BJP MLC said that the TDP was portraying BJP as the villain of the state when they started questioning the government and also for pointing out their mistakes to the public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X