వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీతో ట‌చ్‌లో బొత్సా..ధ‌ర్మాన: వైసీపీ అధికారంలోకి రాక‌పోయుంటే: ఎమ్మెల్సీ మాధ‌వ్ సంచ‌ల‌నం..!

|
Google Oneindia TeluguNews

వైసీసీ సీనియ‌ర్ నేత‌లు బొత్సా స‌త్యనారాయ‌ణ‌..ధ‌ర్మాన ప్ర‌సాద రావు బీజీపీతో ట‌చ్‌లోకి వెళ్లారా. వైసీపీ అధికారంలోకి రాక‌పోతే వారు బీజేపీలోనే చేరేవారా. అవుననే అంటున్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధ‌వ్. ఎన్నిక‌ల ముందు ఈ ఇద్ద‌రు నేత లు త‌మ పార్టీ ముఖ్యుల‌తో ట‌చ్‌లోకి వ‌చ్చారంటూ బాంబు పేల్చారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర స‌మ‌యం ముందే ఈ ఇద్ద‌రి నేత‌ల‌కు పార్టీలో ప్రాధాన్య‌త ఇచ్చారు. ఇద్ద‌రూ పార్టీ విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాల్లో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించా రు. మ‌రి..వారు ఎన్నిక‌ల ముందు అయినా బీజేపీతో ఎందుకు ట‌చ్‌లోకి వెళ్లారు..మాధ‌వ్ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఇప్పుడు ఇదే చ‌ర్చ మొద‌లైంది..వైసీపీలో ఈ ఇద్ద‌రు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు.

బీజేపీతో ట‌చ్‌లో ఆ ఇద్ద‌రు నేత‌లు
ఉత్త‌రాంధ్ర‌కు వైసీపీ ముఖ్య నేత‌లు బీజేపీతో ట‌చ్‌లోకి వెళ్లార‌నే వార్త సంచ‌ల‌నంగా మారింది. కాంగ్రెస్‌లో ఉన్న బొత్సా ..ధ‌ర్మాన వైసీపీలో చేరారు. ధ‌ర్మాన ప్ర‌సాద రావు సోద‌రుడు కృష్ణ దాస్ జ‌గ‌న్ పార్టీ ఏర్పాటు చేసిన స‌మ‌యం నుండి ఆయ‌న‌తోనే ఉన్నారు. త‌రువాత ధ‌ర్మాన ప్ర‌సాద రావు పార్టీలో చేరారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల త‌రువాత కాంగ్రెస్‌ను వీడి బొత్సా స‌త్య‌నారాయ‌ణ వైసీపీలో జాయిన్ అయ్యారు. అయితే, వారిద్ద‌రికీ ఉన్న సీనియార్టీ కార‌ణంగా జ‌గ‌న్ ప్రాధాన్య‌త ఇచ్చారు. పార్టీలో క్రియా శీల‌కంగా మారారు. పార్టీ వాయిస్ బ‌లంగా వినిపించేవారు. ఇక‌, పాద‌యాత్ర స‌మ‌యంలోనూ విజ‌య‌న‌గ‌రం జిల్లాలో జ‌గ‌న్ బొత్సాకు ప్రాధాన్య‌త ఇచ్చారు. అయితే, ఈ ఇద్ద‌రు నేత‌లు తాజాగా జ‌రిగిన ఎన్నిక‌లకు ముందు బీజేపీతో ట‌చ్‌లోకి వెళ్లారంటూ బీజేపీ ఎమ్మెల్సీ మాధ‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. దీంతో..ఎన్నిక‌ల మందు వీరిద్ద‌రు నేత‌లు అస‌లు బీజేపీ నేత‌ల‌తో ట‌చ్‌లోకి ఎందుకు వెళ్లాల్సి వ‌చ్చంద‌నేదే ఇప్పుడు చ‌ర్చ‌.

BJP MLC Madhav sensational comments on YCP Senior leaders Botsa and Dharmana before elections touch with BJP.

టిక్కెట్లు ద‌క్క‌వ‌నా..బెదిరింపు కోస‌మా..
తాజా ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ముందు బొత్సా త‌నతో పాటుగా సోద‌రుడు టిక్కెట్ ద‌క్కించుకున్నారు. అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో ధ‌ర్మాన సోద‌రులు ఇద్ద‌రూ టిక్కెట్ పొందారు. వీరంతా తాజా ఎన్నిక‌ల్లో గెలుపొందారు. అయితే, విజ‌య‌న‌గ‌రం జిల్లాలో బొత్సా..కొల‌గొట్ల వీర‌భ‌ద్ర‌స్వామి ఒకే పార్టీలో ఉన్నా రాజ‌కీయంగా గ్యాప్ ఉంది. దీని కార‌ణంగా అప్ప‌ట్లో బొత్సా పార్టీ మారాల‌ని భావించారా అనే చ‌ర్చ సాగుతోంది. అయితే, వైసీపీ క్రియా శీల‌కంగా వ్య‌వ‌హ‌రించే ఓ ముఖ్య నేత విజ య‌న‌గ‌రం జిల్లాలో బొత్సాను కాద‌ని..త‌న అనుచ‌రుల‌కు పెద్ద పీట వేసే ప్ర‌య‌త్నం చేసారు. ఆ స‌మ‌యంలో బొత్సా బీజేపీ వైపు చూసిన‌ట్లుగా ఇప్పుడు పార్టీ నేత‌లు చెబుతున్నారు. అదే విధంగా..ఎన్నిక‌ల ముందు టీడీపీ చేసిన ప్ర చారం నిజ‌మైతే..ఇక వైసీపీ కి రాజ‌కీయంగా భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అప్ప‌ట్లో ఆలోచ‌న‌గా ప్ర‌చారం. దీంతో..ఆయ‌న ఒక ద‌శ‌లో బీజేపీ వైపు వెళ్లాల‌ని ఆలోచించిన‌ట్లుగా చెబుతున్నారు. అయితే, ఇప్పుడు ఈ ఇద్ద‌రు వైసీపీ నుండ గెల‌వ‌గా..బొత్సా మంత్రిగా..ధ‌ర్మా సోద‌రుల్లో కృష్ణ‌దాస్ సైతం మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. అయితే, బీజేపీ ఎమ్మెల్సీ మాధ‌వ్ చేసిన వ్యాఖ్య‌ల పై ఆ ఇద్ద‌రు ఎలా స్పందిస్తారో చూడాలి.

English summary
BJP MLC Madhav sensational comments on YCP Senior leaders Botsa and Dharmana before elections touch with BJP. Now this comments creating politically heat in YCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X