వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రక్తం కారేలా కొట్టారు.. ఇదిగో వీడియో.. ఈసీ తక్షణం జోక్యం చేసుకోవాలన్న జీవీఎల్

|
Google Oneindia TeluguNews

ఏపీలో స్థానిక సంస్థల నామినేషన్ల వేళ హింసాత్మక ఘటనలు కలకలం రేపుతున్నాయి. గుంటూరు జిల్లా మాచర్ల సమీపంలో బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావులు ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగింది. వైసీపీ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో బీజేపీ కార్యకర్తలపై దాడి జరిగింది. ఇక్కడ కూడా వైసీపీ నేతలే దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. నామినేషన్ వేసేందుకు వెళ్తున్న క్రమంలో తమపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. దాడికి సంబంధించి ఓ వీడియోను కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అందులో ఓ వ్యక్తి తలకు బలమైన గాయమై రక్తం కారుతుండటం గమనించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలపై వైసీపీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని జీవీఎల్ చెప్పారు. ఎన్నికల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకుని రాజకీయపరమైన హింసాత్మక వాతావరణాన్ని అదుపులోకి తీసుకురావాలని సూచించారు.

మరోవైపు మాచర్లలో దాడి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డీజీపీ గౌతం నవాంగ్‌ను ప్రశ్నించారు. దీనికే ఆయనే సమాధానం చెప్పాలన్నారు. ఎస్పీకి ముందుగానే సమాచారం ఇచ్చినా ఇలా జరగడాన్ని ఏమనాలని ప్రశ్నించారు. రక్తపు మరకలు చూసినా డీజీపీకి బాధ కలగట్లేదా అని నిలదీశారు. రాష్ట్రంలో ఇంతటి హింసాత్మక,భయానక పరిస్థితులు ఎప్పుడూ లేవని, పులివెందుల రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఆఖరికి కశ్మీర్,బీహార్‌లో కూడా ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. నియంత పాలనకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు.

bjp mp gvl narasimha rao demands intervention by EC to prevent political violence.

కాగా, స్థానిక సంస్థల నామినేషన్ల ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు కొనసాగనున్న సంగతి తెలిసిందే.ఈనెల 14న మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉప సంహరణ ఉంటుంది. ఈ నెల 21న పోలింగ్ జరుగుతుంది. ఈసారి బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. 24వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. 30న జడ్పీ చైర్మన్లు,వైఎస్ ఛైర్మన్లు,కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఉంటుంది.

English summary
BJP Rajya Sabha member GVL Narasimha Rao said that We strongly condemn attacks on BJP Karyakartas in different parts of the Andhra Pradesh state by YSRCP workers and cadets. He demand urgent intervention by State Election Commission to prevent this political violence
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X