వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ రుణాంధ్రప్రదేశ్, అప్పలు మంత్రిగా బుగ్గన: ప్రజలపైనే పెను భారమంటూ జీవీఎల్ ఆందోళన

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు. ఏపీ రుణాంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అప్పుల మంత్రి అయ్యారని విమర్శించారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కొత్త అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రోజూ ప్రయత్నాలు చేసే పరిస్థితి ఉందని జీవీఎల్ అన్నారు, ఏపీలో అప్పుల కోసమే ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏపీ‌ఎస్‌డీసీ) ఏర్పాటు చేసినట్లుందన్నారు. అది రాజ్యంగ నిబంధనలను ఉల్లంఘించేలా ఉందన్నారు. అది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించేలా ఉందని, దీంతోపాటు ఏపీకి చెందిన పలు అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

bjp mp gvl narasimha rao slams AP government for taking huge loans.

ఎస్‌డీసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సవరణలు చేయాలని జీవీఎల్ నర్సింహారావు డిమాండ్ చేశారు. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రోజూ కొత్త అప్పుల కోసం పడరాని పాట్లు పడుతున్నారన్నారు. ఏపీ అప్పులపై కాగ్, ఆర్బీఐతో ఆడిట్ చేయాలని కేంద్రాన్ని కోరతానని జీవీఎల్ తెలిపారు.

Recommended Video

South India’s Largest Industrial Estate at Orvakal ఓర్వకల్లులో అతి పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్

ఏపీ సర్కారు పింఛన్లు, జీతాలు ఇవ్వలేని స్థితిలోకి వచ్చిందన్నారు జీవీఎల్. ఓటు బ్యాంక్ కోసం రుణాలు తీసుకుంటున్నారని అన్నారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు చూసుకుని నిధుల సమీకరణతో పథకాలు అమలు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై కేంద్రానికి సూచనలు చేస్తానని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేస్తే కుదరదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేసే అప్పుల భారం చివరికిప్రజలపూనే పడుతుందని జీవీఎల్ తెలిపారు. ఏపీ ఆర్థిక పతనం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది కాబోతోందన్నారు.
ఏపీ అప్పులు చేయడం ఆపేలా కేంద్రం సూచనలు చేయాలని కేంద్రాన్ని కోరతానని జీవీఎల్ నర్సింహారావు తెలిపారు. అంతేగాక, పార్లమెంట్ లోనూ ఈ అంశం ప్రస్తావిస్తానని తెలిపారు. అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ఏపీకి కరోనా మహమ్మారి రూపంలో తీవ్ర నష్టమే జరిగింది.

English summary
bjp mp gvl narasimha rao slams AP government for taking huge loans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X