andhra pradesh new delhi bjp mp gvl narasimha rao demand cm chandra babu centre ఆంధ్రప్రదేశ్ న్యూఢిల్లీ బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు డిమాండ్ సిఎం చంద్రబాబు క్షమాపణ కేంద్రం
చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి...మంత్రి ఉమ అబద్ధాలు: జీవీఎల్
న్యూఢిల్లీ:పోలవరంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్షమాపణ చెప్పాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు.
అసలు తెలుగుదేశం పార్టీ అబద్ధాలు ఆడే పార్టీ అని, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సిగ్గులేకుండా అబద్ధాలు ఆడుతున్నారని జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. మంగళవారం ఆయన న్యూఢిల్లీలో ప్రెస్ నోట్ విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంకా రూ.1,935 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని దేవినేని నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పారన్నారు.


పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రానికి కేంద్రం ఎలాంటి బకాయి లేదనేది అసలు నిజం అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇప్పటి వరకు చెల్లించాల్సిన బకాయిలు అన్నీ చెల్లించిందన్నారు. అందుకు ఆధారంగా సమాచార హక్కు చట్టం కింద పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇచ్చిన జవాబును ఆయన తన ప్రకటనకు జోడించారు. 2018-19 సంవత్సరానికి సంబంధించి రూ.1,385 కోట్ల మేర వినియోగ పత్రాలు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సమర్పించాల్సి ఉందని పోలవరం అథారిటీ ఈ జవాబుపత్రంలో పేర్కొనడం గమనార్హం.