అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కల్యాణ్ ను హెచ్చరించిన బీజేపీ ఎంపీ జీవీఎల్?

పొత్తులతో బీజేపీని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని, వారిని క్షమించమంటూ పవన్ కల్యాణ్ ను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పరోక్షంగా హెచ్చరించారు.

|
Google Oneindia TeluguNews

భారతీయ జనతాపార్టీ కార్యవర్గానికి ఆ పార్టీలోని సీనియర్లు పలువురు డుమ్మా కొట్టారు. తెలుగుదేశం-జనసేన పొత్తు ఖరారైందంటూ సంకేతాలు వస్తుండటంతో బీజేపీలోని సీనియర్ నేతలు పలువురు జనసేనలోకి చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సమావేశంలో మాట్లాడుతూ ఫైరయ్యారు.

ఎంపీ జీవీఎల్ హెచ్చరికలు

ఎంపీ జీవీఎల్ హెచ్చరికలు


పొత్తులని చెబుతూ భారతీయ జనతాపార్టీని దెబ్బతీయడానికి ప్రయత్నించేవారిని క్షమించమని పరోక్షంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను హెచ్చరించారు. ఢిల్లీ పెద్దలు తెలుగుదేశం పార్టీతో కలిసి నడిచేందుకు ఆసక్తిగా లేరని తెలుస్తోంది. దీంతో జనసేన బీజేపీకి దూరమవుతూ తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతోంది. ఈ పరిణామాన్ని ఆ పార్టీ ఏపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. అన్నికోణాల నుంచి టీడీపీని చుట్టుముడుతున్నారు. కొండగట్టులో వారాహికి పూజ చేయించిన తర్వాత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఏపీలో బీజేపీతో పొత్తులోనే ఉన్నామని ప్రకటించారు.

పొత్తులోనే ఉన్నామంటున్న ఇరువురు నేతలు

పొత్తులోనే ఉన్నామంటున్న ఇరువురు నేతలు


కార్యవర్గ సమావేశాల్లో పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా జనసేనతో పొత్తులోనే ఉన్నామని ప్రకటించారు. ఈ ఇద్దరు నేతలు పొత్తులోనే ఉన్నామని ప్రకటిస్తున్నప్పటికీ అధికారికంగా ఈ రెండు పార్టీలు కలిసి చేసిన కార్యక్రమాలు లేవు. ఏ పార్టీకా పార్టీ విడివిడిగా కార్యక్రమాలను నిర్వహించుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలోకి గౌరవప్రదమైన సంఖ్యలో ఎమ్మెల్యేలుండాలని ప్రయత్నిస్తోన్న అందుకు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఒక్కటేమ మార్గమని నిర్ణయానికి వచ్చారు. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా చీలిపోకుండా ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఎన్నికలు జరిగే చివరి నిముషం వరకు భారతీయ జనతాపార్టీతో కలిసే ఎన్నికలకు వెళ్లడానికి ప్రయత్నిస్తామని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. టీడీపీ తరఫున ఢిల్లీ పెద్దలతో రాయబారం చేస్తున్నారు.

కొంతకాలం వేచిచూసే ధోరణి

కొంతకాలం వేచిచూసే ధోరణి


అటువైపు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో మరికొంతకాలం వేచిచూడాలన్న ధోరణికి పవన్ తోపాటు చంద్రబాబు కూడా వచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండ అవసరమని ఇరువురు నేతలు భావిస్తున్నారు. అందుకే ఒకటికి నాలుగుసార్లు బీజేపీతో కలిసి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చివరి నిముషంలోనైనా వారిని ఒప్పించగలమనే నమ్మకంతో ఉన్నారు.

English summary
BJP MP GVL Narasimha Rao has indirectly warned Pawan Kalyan that they are trying to harm BJP with alliances and forgive them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X