విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు,టిడిపి ప్రభుత్వంపై మళ్లీ ఫైర్ అయిన జివిఎల్:బిజెపి నేతలు డబ్బులు తేవడంలో ఫెయిల్ చంద్రబాబు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విజయవాడ:బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై, టీడీపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు అవినీతికి చట్టబద్ధత కల్పించిన ఘనులు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.

గొడుగులతో అసెంబ్లీ బిజెపి ఎమ్మెల్యేలు:భాజపా నేతలు హీరో, విలన్ మధ్య కమెడియన్స్‌లా తయారయ్యారన్న బుద్దాగొడుగులతో అసెంబ్లీ బిజెపి ఎమ్మెల్యేలు:భాజపా నేతలు హీరో, విలన్ మధ్య కమెడియన్స్‌లా తయారయ్యారన్న బుద్దా

ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ఫిషరీస్‌ ద్వారా రూ.2,713 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఎంపి జివిఎల్ ఆరోపించారు. అమరావతి బాండ్ల ఇన్వెస్టర్ల పేర్లు ఎందుకు బహిర్గతం చేయడం లేదో టిడిపి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో అవినీతికి పాల్పడిన వారి పేర్లు త్వరలోనే బయటపెడతానని హెచ్చరించారు. టీడీపీ నేతలు ఓటమి భయంతో ఉన్నారని జివిఎల్ వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీకి రాకపోవడం ప్రజాస్వామ్యంలో లోటు అని జీవీఎల్ వ్యాఖ్యానించారు.

BJP MP GVL once again fire over CM Chandra babu and TDP Government

ఇదిలావుండగా గురువారం ఉదయం నుంచి ఎపి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో బిజెపి ఎమ్మెల్యేల ప్రసంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిస్పందించారు. బిజెపి ఎమ్మెల్యేలు ప్రస్తావించిన సమస్యల ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...ప్రాథమిక వైద్య కేంద్రాల్లో ఔట్ సోర్సింగ్ ద్వారా మెరుగైన వైద్య సదుపాయాలను కల్పిస్తున్నామని సమాధానం ఇచ్చారు.

ప్రశ్నోత్తరాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రాథమిక వైద్యకేంద్రాలపై బీజేపీ ఎమ్మెల్యేలు విష్ణు కుమార్ రాజు, మాణిక్యాలరావులు బాగా మాట్లాడారని...కానీ కేంద్రం నుంచి డబ్బులు తేవడంలో మాత్రం విఫలమవుతున్నారని ఎద్దేవా చేశారు. భవనాలు సరిగ్గా లేవన్న బిజెపి నేతల విమర్శల విషయంలో వాళ్లతో తాను కూడా ఏకీభవిస్తున్నానన్నారు.

రాష్ట్రంలో ప్రతి సామాన్యుడికి మెరుగైన వైద్యాన్ని అందించాలన్నదే తమ ధ్యేయమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అన్ని సబ్ సెంటర్లను, పంచాయతీ, అంగన్ వాడీ, స్కూళ్లు, శ్మశానాల నిర్మాణాలను గ్రామీణ ఉపాధి హామీ పథకంతో అనుసంధానిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. గ్రామాల్లో వైద్యులు నిర్లక్ష్యంగా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలోనే మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు.

English summary
Vijayawada:BJP Rajya Sabha MP GVL Narasimha Rao was once again fired on Andhra Pradesh Chief Minister Chandrababu and TDP government. He said that Chandrababu has given legalization to corruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X