వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు వ్యూహంలో బీజేపీ నేతలు: సొంత పార్టీ ఎంపీ ఆరోపణ: ఉత్తరాఖండ్‌కు వెళ్లాలంటూ

|
Google Oneindia TeluguNews

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం నిరర్థక ఆస్తుల వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తిరుమల శ్రీవారికి చెందిన నిరర్థక ఆస్తులను విక్రయించడానికి అనుమతి ఇస్తూ 2016లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన రద్దు చేసింది జగన్ సర్కార్. దీనిపై సరికొత్త జీవోను తీసుకొచ్చింది. ఫలితంగా- ఏడుకొండలవాడి ఆస్తుల అమ్మకాలపై టీటీడీ పాలకమండలి ఇకముందు ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేదు. పాలకమండలి అనుమతి ఇచ్చినా, ప్రభుత్వం తెచ్చిన జీవో ఫలితంగా- అది కార్యరూపం దాల్చదు.

పసుపు పండుగ అజెండా: అదొక్కటే టార్గెట్..ఎన్టీఆర్‌కు భారతరత్న: సంక్షోభాన్ని ఇలా అవకాశంగాపసుపు పండుగ అజెండా: అదొక్కటే టార్గెట్..ఎన్టీఆర్‌కు భారతరత్న: సంక్షోభాన్ని ఇలా అవకాశంగా

చంద్రబాబు వ్యూహంలో బీజేపీ

చంద్రబాబు వ్యూహంలో బీజేపీ

టీటీడీ నిరర్థక ఆస్తుల విషయం.. భారతీయ జనతా పార్టీ నాయకుల్లో విభేదాలకు దారి తీసినట్టే కనిపిస్తోంది. ఏపీ, తెలంగాణ బీజేపీ రాష్ట్రశాఖ నాయకుల వైఖరి పట్ల జాతీయ స్థాయిలో గుర్తింపు పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఆయన నేరుగా వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నారు. ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచడానికి తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పన్నిన వ్యూహంలో భాగంగానే.. ఈ ప్రచారం సాగుతోందని, ఇందులో తమ పార్టీ నాయకులు కూడా చిక్కుకున్నారని ఆయన అంటున్నారు.

ఉత్తరాఖండ్‌లో విక్రయించలేదా?

ఉత్తరాఖండ్‌లో విక్రయించలేదా?

ఉత్తరాఖండ్‌లో అధికారంలో బీజేపీ ప్రభుత్వం.. ఆలయ ఆస్తులను విక్రయించడాన్ని, స్వాధీనం చేసుకోవడాన్ని సుబ్రహ్మణ్య స్వామి ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. అప్పట్లో ఎవరూ ఎందుకు అడ్డు చెప్పలేదనే విషయాన్ని ఆయన లేవనెత్తుతున్నారు. బద్రీనాథ్, కేదార్‌నాథ్ వంటి అత్యంత ప్రాచీన ఆలయాలతో నిండిఉన్న ఉత్తరాఖండ్‌కు దేవభూమిగా పేరు ఉందని, అలాంటి చోటే బీజేపీ ప్రభుత్వం ఆలయాల ఆస్తులను లాక్కుందని, ఎవరూ అడ్డు పడలేదని చెప్పారు. అలాంటిది- తిరుమల విషయంలో రాజకీయంగా రచ్చ చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం.. అది చంద్రబాబు పన్నిన వ్యూహమని సుబ్రహ్మణ్య స్వామి ఉదహరించారు.

 భాను ప్రకాష్‌పైనా విమర్శలు..

భాను ప్రకాష్‌పైనా విమర్శలు..

చిత్తూరు జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు భానుప్రకాష్‌పైనా సుబ్రహ్మణ్య స్వామి విమర్శలు చేశారు. టీటీడీ ఆస్తుల అమ్మకాలపై 2016లో అనుకూలంగా తీర్మానం చేసిన పాలక మండలిలో భానుప్రకాష్ సభ్యుడని, అప్పట్లో ఆయన ఎందుకు అడ్డు చెప్పలేదని సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్నించారు. ఇప్పుడు ఈ అంశాన్ని రాజకీయం చేయడం వెనుక ఉద్దేశమేమిటనేది అందరికీ తెలిసిందేనని చెప్పారు.

Recommended Video

TTD Temple Lands Sale Cancelled | AP CM Jagan Serious on TTD Officials
 ఉత్తరాఖండ్‌కు వెళ్లి ఉపవాస దీక్షలు చేయగలరా?

ఉత్తరాఖండ్‌కు వెళ్లి ఉపవాస దీక్షలు చేయగలరా?

ఏపీ బీజేపీ నాయకులు నిజమైన హిందువులు అయితే ఉత్తరాఖండ్ వెళ్లి ఉపవాస దీక్షలను చేయాల్సి ఉంటుందని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు టీటీడీ ఆస్తులు వేలం వేస్తే ఏపీ బీజేపీ నేతలు సమర్థించారని, ఇప్పుడు మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు. రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకులు ఒక పార్టీ ప్రభావానికి లోను కావడం సరి కాదని, అలాంటి పరిస్థితులు మున్ముందు కొనసాగితే.. స్వయంగా ఎదగడం అసాధ్యమనీ సుబ్రహ్మణ్య స్వామి చురకలు అంటించారు. టీటీడీ ఆస్తులను వేలం వేయడాన్ని నిలిపి వేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడాన్ని ఆయన స్వాగతించారు.

English summary
Bharatiya Janata Party leader and Rajya Sabha member Subrahmanya Swamy strongly criticised to Telugu Desam Party president Chandrababu on Tirumala Tirupati Devasthanams (TTD) issue. He told that BJP government also sales temple properties in other States.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X