అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతిపై సుజనా హాట్ కామెంట్స్- అంగుళమూ కదలదు- కేంద్రం స్పందించే టైమ్ రాలేదంటూ..

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటు కోసం తీసుకుంటున్న చర్యలపై బీజేపీ ఎంపీ మరోసారి స్పందించారు. రాజధాని తరలింపు జరగబోదని, కేంద్రం సరైన టైమ్ లో స్పందిస్తుందంటూ సుజనా చేసిన వ్యాఖ్యలు మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి. రాజధాని విషయంలో కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న బీజేపీ నేతలు ఒక్కసారిగా ఇలాంటి కామెంట్లు చేయడంతో కేంద్రం నిజంగానే జోక్యం చేసుకుంటుందా లేదా అన్న చర్చ సాగుతోంది.

108 సిబ్బందికి జగన్ బంపర్ ఆఫర్ - ఒక్కసారిగా జీతాల రెట్టింపు- పనితీరే ప్రాతిపదిక...108 సిబ్బందికి జగన్ బంపర్ ఆఫర్ - ఒక్కసారిగా జీతాల రెట్టింపు- పనితీరే ప్రాతిపదిక...

అమరావతిపై సుజనా స్టాండ్...

అమరావతిపై సుజనా స్టాండ్...


ఏపీ రాజధాని అమరావతి నుంచి విశాఖకు తరలింపు వ్యవహారంలో గతంలో పలుసార్లు సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అప్పట్లో పార్టీ ఆగ్రహంతో వెనక్కి తగ్గారు. రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందా కేంద్రం పరిధిలో ఉందా అన్న చర్చ వచ్చినప్పుడు అది రాష్ట్రం నిర్ణయించుకోవాల్సిన అంశమేనంటూ మరో ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. ఆ తర్వాత పలువురు బీజేపీ నేతలు స్పందించినా అధిష్టానం క్లారిటీ ఇచ్చేయడంతో వాటికి పెద్దగా విలువ లేకుండా పోయింది. దీంతో సుజనాతో పాటు ఇతర నేతలు కూడా దీనిపై మాట్లాడటం మానేశారు. తాజాగా మరోసారి సుజనా చౌదరి తేనెతుట్టెను కదిపారు.

 అమరావతి అంగుళం కూడా కదలదు..

అమరావతి అంగుళం కూడా కదలదు..

అమరావతి నుంచి రాజదాని తరలింపు కోసం వైసీపీ సర్కారు తిరిగి ప్రయత్నాలు ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై ఓ టీవీ చానల్ లైవ్ లో సుజనా స్పందించారు. అమరావతి అంగుళం కూడా కదపలేరని జగన్ సర్కారును ఉద్దేశించి సుజనా సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా జగన్ సర్కారు చేసే ప్రయత్నాలు వృథా కాక తప్పదనే అర్ధం వచ్చేలా సుజనా మాట్లాడారు. దీంతో బీజేపీతో పాటు రాష్ట్రంలోనూ సుజనా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాజధాని ప్రాంతంలో జనం అయితే సుజనా వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారు.

సరైన సమయంలో కేంద్రం జోక్యం...

సరైన సమయంలో కేంద్రం జోక్యం...


అమరావతి నుంచి రాజధాని తరలింపు విషయంలో కేంద్రం స్పందించే సమయం ఇంకా రాలేదని, కానీ సరైన సమయంలో కేంద్రం స్పందించి తీరుతుందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. అంటే ఇంకా రాజధాని కేంద్రం పరిధిలోనే ఉన్నట్లు, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే అన్నట్లుగా సుజనా భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. గతంలో ఇదే తరహాలో సుజనా చేసిన వ్యాఖ్యలకు జీవీఎల్ కౌంటర్ ఇచ్చారు. రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమేనని, ఇందులో కేంద్రం జోక్యం ఏమీ ఉండబోదని అప్పట్లో జీవీఎల్ తేల్చిచెప్పారు. సుజనా తాజా వ్యాఖ్యల నేపథ్యంలో జీవీఎల్ ఎలా స్పందిస్తారా చూడాల్సి ఉంది.

English summary
bjp mp sujana chowdary made sensational comments on ap govt's plans on amaravati capital shifting. sujana says that amaravati capital won't move a inch from actual place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X