వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు చేతులెత్తేసారా: టీడీపీ అధినేత‌ కోట‌రీకి బీట‌లు: ముహూర్తం ఫిక్స్.. బీజేపీ వ్యూహంతో విల‌విల‌..!

|
Google Oneindia TeluguNews

40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వానికి ప‌రీక్ష‌. ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్న టీడీపీ అధినేతకు ఇప్పుడు రాజ‌కీయంగా అస‌లు ప‌రీక్ష మొద‌లైంది. కేంద్రంలో..రాష్ట్రంలో త‌న ప్ర‌త్య‌ర్ధులు అధికారంలో ఉన్నారు. లోక్‌స‌భ‌లో ముగ్గురు..ఏపీ అసెంబ్లీ లో 23 మంది టీడీపీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఆ ముగ్గురు..ఈ 23 మందిలో ఎంత మంది మిగులుతార‌ని ఇప్ప‌టికే చ‌ర్చ సాగుతోంది.అయితే, అస‌లు ల‌క్ష్యం వారు కాదు. బీజేపీ-వైసీపీ టార్గెట్ చంద్ర‌బాబు. ఆయ‌న్ను క‌ద‌లించాలంటే ముందుగా ఆయ‌న బ‌లం ఆయ‌న కోట‌రీయే. ఆ కోట‌రీయే ల‌క్ష్యంగా అడుగులు ప‌డుతున్నాయి. అందు కోసం వేగంగా పావులు క‌దుపుతున్నారు. మ‌రి..చంద్ర‌బాబు ఏం చేయ‌లేరా..చేతులెత్తేసారా..

చంద్ర‌బాబు కోట‌రీకీ బీట‌లు..

చంద్ర‌బాబు కోట‌రీకీ బీట‌లు..

తాజా ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యంతో డీలా ప‌డిన టీడీపీ అధినేత చంద్ర‌బాబును రాజ‌కీయంగా దెబ్బ కొట్టాలంటే ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని..ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బీజేపీ..వైసీపీలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే..బీజేపీ నేత‌లు ఢిల్లీ కేంద్రంగా పావులు క‌దుపుతున్నారు. చంద్రబాబును దెబ్బ తీయాలంటే..ప్ర‌ధానంగా ఆయ‌న న‌మ్ముకున్న కోట‌రీని ల‌క్ష్యంగా చేసుకోవాల‌ని నిర్ణ‌యించారు. ఇందు కొసం చంద్ర‌బాబుకు ఆర్దికంగా..రాజ‌కీయంగా కుడి భుజంగా ఉండే కేంద్ర మాజీ మంత్రిని త‌మ వైపు తిప్పుకోవ‌టంలో బీజేపీ స‌క్సెస్ అయిన‌ట్లే. ఆయ‌న తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో సైతం అవే సంకేతాలు ఇచ్చారు. ఇక‌..ఒక నిర్మాణ సంస్థ అధినేత‌గా ఉంటూ చంద్ర‌బాబు స‌న్నిహితంగా వ్య‌వ‌హ‌రించి న మరో ముఖ్య నేత నేడు టీఆర్‌య‌స్ ఎంపీ అయ్యారు. మ‌రో కీల‌క నేత ఇప్పుడు జ‌గ‌న్ టార్గెట్‌లో చిక్కుకున్నారు. ఇక‌, అటు ఢిల్లీలో..ఇటు ఏపీలో చంద్ర‌బాబు మౌత్ పీస్‌గా వ్య‌వ‌హ‌రించే మ‌రో నేత సైతం ఇప్పుడు దూరంగా ఉంటున్నారు.

ఎంపీలు..ఎమ్మెల్యేలు సైతం...

ఎంపీలు..ఎమ్మెల్యేలు సైతం...

టీడీపీ అధికారం కోల్పోవ‌టంతో..ఏపీలో నెలకొన్ని ప‌రిస్థితుల కార‌ణంగా పార్టీలో ఉండ‌లేక‌..వైసీపీలో చేర‌లేని కొంద‌రు టీడీపీ ప్ర‌ముఖులు బీజేపీలోకి వెళ్ల‌టం దాదాపు ఖాయ‌మైంది. అందులో చంద్రబాబు మేనేజ్‌మెంట్ టీం స‌భ్యులు సైతం ఉన్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. చంద్ర‌బాబు ఏ ప‌ని అప్ప‌గించినా పూర్తి చేయ‌గ‌లిగిన స‌మ‌ర్ధులుగా ఉన్న ఆ ఇద్ద‌రు ప్ర‌ముఖులు సైతం బీజేపీ నేత‌ల‌తో ట‌చ్‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇక‌..టీడీపీ నుండి గెలిచిని ముగ్గురు ఎంపీల్లో ఒక‌రు ఇప్ప‌టికే బీజేపీలో చేరేలా ప్ర‌ణాళిక‌లు సిద్దం అయ్యాయి. బీజేపీ ముఖ్య నేత రాం మాధ‌వ్‌తో ఇప్ప‌టికే వారి చ‌ర్చ‌లు సైతం పూర్త‌యిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ నెల 27న వారు బీజేపీల చేరిక‌కు ముహూర్తం ఖ‌రారైన‌ట్లుగా స‌మాచారం. ఇదే విధంగా..ఏపీలోని ఇద్ద‌రు ఎమ్మెల్యేలు సైతం బీజేపీ వైపు చూస్తున్న‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది. ఇదే కొన‌సాగితే..తెలంగాణ త‌ర‌హాలోనే ఏపీలోనూ టీడీపీ బ‌లం కోల్పోయే ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది.

Recommended Video

చంద్రబాబు ప్రాజెక్టులపై కమిటీ వేయనున్న జగన్
చంద్ర‌బాబు చేతులెత్తేసారా..

చంద్ర‌బాబు చేతులెత్తేసారా..

సంక్షోభాలు త‌న‌కు కొత్త కాద‌ని..సంక్ష‌భం నుండి అవ‌కాశం వెతుక్కోవ‌టం త‌న‌కు తెలుస‌ని ప‌దే ప‌దే చెప్పే చంద్ర‌బాబు ఇప్పుడు ప‌రిస్థితుల పైన సీరియ‌స్‌గా దృష్టి సారించ‌టం లేదు. ఆయ‌న న‌మ్ముకున్న‌..చంద్ర‌బాబును న‌మ్ముకున్న కీల‌క నేత‌లు పార్టీని వీడుతున్నార‌నే సంకేతాలు..స‌మాచారం ఉన్నా వారిని నియంత్రించే చ‌ర్య‌లు చంద్ర‌బాబు ఎందుకు తీసుకోవ‌టం లేద‌నే ప్ర‌శ్న మొద‌లైంది. తాను చెప్పినా వారు వినిపించుకొనే ప‌రిస్థితిలో చంద్ర‌బాబు ఉన్నారా అనే సందేహం క‌లుగుతోంది. ఏపీ అసెంబ్లీలోనూ చంద్ర‌బాబుతో పాటుగా అచ్చంనాయుడు, గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి, క‌ర‌ణం బ‌ల‌రాం మిన‌హా మిగిలిన వారు యాక్టివ్‌గా ఉండ‌టం లేదు. అయినా..చంద్ర‌బాబు వారి విష‌యంలోనూ చూసీ చూడ‌న‌ట్లుగానే ఉంటున్నారు. అదే విధంగా ఢిల్లీ కేంద్రంగా టీడీపీని దెబ్బ తీసే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం అవుతున్న వేళ‌..చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారు. దీంతో..చంద్రబాబు ఆలోచ‌న ఏంట‌నేది అంతు బ‌ట్ట‌టం లేదు.

English summary
BJP national leaders target TDP key leaders to join in their party. Chandra babu personal team leaders already in touch with BJP. But, Chandra babu no trying to stop them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X